Friday, December 31, 2010

నవ్వండి .. నవ్వించండి ..... { సర్వే జనో నవ్వో భవతు: }

నవ్వటం ఒక యోగం .. నవ్వించడం ఒక భోగం .. నవ్వలేక పోవడం ఒక రోగం ... అని స్వర్గీయ జంధ్యాల గారు చెప్పినట్లు .. నిజం గా నవ్వటం అనేది దేవుడు మనిషి కి మాత్రమే ఇచ్చిన ఒక వరం ...దానిని సద్వినియోగం చేసు కోవాల్సిన అవసరం మనకు ఎంతైన ఉంది .... 

నిత్యం మనకు ఉన్న పని వత్తిడో .... ఇంకా మరి ఏ ఇతర కారణాల వలన మనం నవ్వటం అనే ఒక మంచి .. వ్యాయామాన్ని మరుస్తున్నాము..



మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నార? లేక మీ పక్కింట్లోనో ..ఎదురింట్లొనో ఖచ్చితంగా ఉండే ఉంటారు లేండి ..వారిని ఒక సారి పరిశీలించండి ..వాళ్ళు ఎప్పుడు ..ఉల్లాసం గా ఉత్సాహం గా ఉండటానికి కారణం ..వారికి ఏ వత్తిడి లేక పోవడం కాదు .. వారిలో హాస్య చతురుత .. తొందరగ స్పందిచే గుణం ... అది మనం అందరం వారి నుండి నేర్చుకోవలిసిన సద్గుణం ...

ప్రతి రోజు అందరి కంటే ఎక్కువ గా నవ్వగలిగిన వాళ్ళు ..నవ్వెవాళ్ళు .. ఎక్కువ కాలం యవ్వనం గా ఉండి ..అందరి కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్టారు అని చాల సర్వేలు తేల్చి చెబుతున్నాయి ...కాబట్టి ఈ కొత్త సంవత్స్రం అయిన మీరు మరింతగ నవ్వి మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు అని కోరుకుంటున్నాను ....
                        మీ కు తెలిసిన హాస్య సంధర్బాలు మన బ్లాగ్ మిత్రులతో పంచుకొని మీరు నలుగురిని నవ్వించండి ...ఆ నలుగురిని తలా నలుగిరిని నవ్వించమని కోరండి .. ఇలా చేస్తే  రెండు మూడు రోజుల లో మన అందరికి  నాలుగు , ఐదు సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుంది ... 


                               సర్వే జనో నవ్వో భవతు:

Thursday, December 30, 2010

శ్రీ కృష్ణ గోవిందా ! .. హరే మురారి ....

శ్రీ కృష్ణ గోవిందా ! .. హరే మురారి .... జై వాసు దేవా ...


అని కృష్ణాష్టమి రోజు ఎంతమంది ..భజన చేసారో తెలియదు ..కాని .మన రాష్ట్రం లో గత ఒక సంవత్సరం గా ప్రతి రోజు శ్రీ కృష్ణ నామ జపమే ... గడువు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కటే ఉత్కంఠ ...ఎన్నికలు ముందు చివరి రోజు ప్రచారం కోసం నాయకులు లో ఎంత ఉత్కంఠ ఉంట్టుందో ఇప్పుడు కూడ అంతకన్న ఎక్కువే ఉంది...

ఇన్నాళ్ళు "జస్టీస్ శ్రీ కృష్ణ" కమిటి నీవేదిక అంటు వేచి చూసే ధోరణి అవలంభించిన కాంగ్రేస్ , తెలుగుదేశం పార్టీలు తమ వ్యూహాలని ఎలా మార్చుకుంటాయో చూసే సమయం ఆసన్నమైనది ..

సమైక్య ఆంధ్ర కే కట్టుబడి ఉన్నాము అని చెప్పుకునే ప్రజాధరణ లేని ప్రజారాజ్యం పార్టి, చిన్న రాష్ట్రల తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పే 1 + 1 భారతీయ జనత పార్టి .. తెలంగాణ తన జీవిత ధ్యేయం అని చెప్పి చెప్పి విధ్యార్ధుల జీవాతాల తో చెలగాటం ఆడే "తె రా సా" తమ రాజకీయ లబ్ధి కోసం విధ్యార్ధులని రెచ్చగొట్టీ వారిని హింసాత్మక ధోరణి వైపు నెట్టే పొలిటికల్ "జే.యే.సి" లు ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాయో కదా! ...

ఈ సమయం చాల చిత్రమైనది .. మరియు ఎంతో కీలకమైనది ... ప్రతి ఒక్క రాజకీయ పార్టి తన భవిషత్తు కోసం వేల విధ్యార్దుల ఆవేశాన్ని వారి ఆయుధము గ మార్చుకోవడానికి గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నాయి ..


ఇదే అదునుగా మన రాష్ట్రం లో విచ్చిన్నకర పరిస్తితులు సృష్టించడానికి ఎంతో మంది తీవ్ర వాదులు ఎదురు చూస్తున్నారు ...
సందట్లొ సడేమియా ..తమ "టి.ఆర్.పి" రేట్లు పెంచుకోవడానికి ఏ విలువ లేకుండ ఎటువంటి వార్తలును అయిన ప్రసారం చేసి ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టే వార్త ప్రసరాలు ఇప్పుడు కాచుకొని కుర్చున్నాయి ..

సరిగ్గ ఇదే సమయం మన లోని విజ్ఞత, మన చదువు మనకు నేర్పిన సంస్కారం ..ప్రదర్సించడానికి .. ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ఇప్పుడు వచ్చే నివేదిక కూడ ఎదో ఒక వైపు మొగ్గుతుంది.. ఈ నివేదిక అందరి ని ఒప్పించ లేక పోయిన ..మన సంసంస్కారం, సమ్యమనం తో ఎదుటి వారిని నొప్పించ కుండ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైన మన మీద ఉంది ...


వారి స్వార్ధం కోసం మిమ్మల్ని బలి పెట్టే రాజకీయ నాయుకులు ఒక పక్క, మీరు సంతోషం గా ఉండటానికి తమ రెక్కలు ముక్కలు చేసుకొని వారి ఆసలు అన్నీ మీ మీదనే ఉంచుకునే మీ తల్లి తండ్రులు మరో పక్క ఉన్న ఈ సమయం లో సరియైన నిర్ణయం తీసుకోవాలి ..



హే కృష్ణా! .. సంకట స్తితి లో ఉన్నప్పుడు అర్జునికి గీతోపదేశం చేసి అర్జునిడిని ఏ విధము గా అయిటే కార్యోర్ముకుడివి చేసినా వో .. అదే విధముగా ఇప్పుడు ఈ భరతమాత బిడ్డల్ని .. సరి యైన దారి లో ..నడుపు తండ్రి

Thursday, December 23, 2010

మా ఇంటి "ఇంగ్లీష్" చిలక ...

"సుహృద్" మా పెద్ద అన్నయ్య .పెద్దబ్బాయి..వయసు 5 సంవత్సరాలు ..చదువుతున్నది 1 ఇంగ్లీష్ మీడియం ..వాడే మా ఇంటి "ఇంగ్లీష్" చిలక ...

ఒకటి(1) ఇంగ్లీష్ మీడియం .... అని నొక్కి చెబుతున్నా ..ఎందుకు అంటే వాడే మా ఇంట్లో ..మొదటగా ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియం లో చదువుతున్నది ...

అస్సలు మాటర్ లోకి వస్తే .. చిన్న పిల్లలు మాట్లాడుతుంటేనే ..చిలక పలుకుల్లా ముద్దొస్తు ఉంటాయి ...

ఇంక అందులో ఇంగ్లిష్ పలుకుతుంటే .. వినాలే కాని ..ఆ ఆనందం వర్ణనాతీతం..  

నేను ఇంటికి వెళ్ళినప్పుడల్ల ...మా అన్నయ్య , వదిన , నేను , మా అమ్మ నాన్న ..అందరం చిన్న ఇంగ్లీష్ లో ఇడుచుకో .. ఇంకోటి ఇడుచుకో ..అంటు మా వాడిని ఉత్శాహపరుస్తాము ...

మేము ఇచ్చే ప్రోత్సాహం ..వాడి ఉత్సాహం ..వల్ల ఇంగ్లిష్ వాడి నోట్లో నుండి ....అలా అలా ముత్యాలు లా జారి పొతాయి ..


మా ఇంటి ఇంగ్లీష్ చిలక పలికిన కొన్ని పలుకులు ...   


What Father's brother ...? How are you fine ?


అంటే ఎమిటి బాబాయి ....బాగున్నావా ? అని ...


What grand mother ? Tell to Grand son ..?


అంటే ఎమిటి బామ్మ ..నాకు చెప్పు... అని


What Father's brother ..? What computer ..?



అంటే ఏమిటి బాబాయి ..కంప్యుటర్ లో ఏమి చెస్తున్నావు అని ...


అప్పుడే మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు ..

అప్పుడు మా వాడు ...


What Letter man ? who letter ?
అన్నాడు .. 

అంటే పోస్ట్ మ్యాన్ ..ఎందుకు వచ్చాడు లెటర్ ఎవరికి వచ్చింది అని...

అంతకు ముందు రెండు రోజుల ముందు ..మా వదిన.. వాడికి లంచ్ బాక్స్ ఇద్దామని వెళ్ళారు అట ..అదే సమయం లో వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు కనిపించి ..  

Hi Suhrudh, How are you ?  అని అడిగారు అట ..


వెంటనే మా  Hero .. My name is T Venkata Suhrudh Sandilya  

అని తడుము కోకుండ చెప్పేశాడు అట...


ఇది చెప్పటం ..మా ఇంట్లో నవ్వటం ...


ఈ షో మా ఇంట్లో .. దాదువు 1 గంట నడిచింది ... ఈ గంట లో వాడికి ..వాళ్ళ బామ్మ, తాతయ్య, న్నాన్న, ఇంక ఈ పిచ్చి బాబాయి ... ఎన్ని ముద్దులు పెట్టామో గుర్తే లేదు ...

ఒక అర్ధ గంట తర్వాత గుర్తు వచ్చింది .. నేను ఇంజినీరింగ్ 2 వ సంవత్సరం లో మొదటి సారి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన తర్వత మా ఇంగ్లీష్ మాష్టార్ నన్ను హత్తుకొని ...

.
I never laugh this much these days..   అన్నారు .. ఆ సమయం లో అర్ధం కాలేదు కాని ... ఈ సంఘటన జరిగినప్పుడు అర్ధం అయ్యింది.. ఎందుకు అంతలా ఫీల్ అయ్యారో ..

మా నాన్న గారు ఎప్పుడు చెబుతు ఉంటారు ..నీకు నేర్చుకునే ధైర్యం ఉండాలి కాని ..ప్రతి ఒక్కరి దగ్గర ఎదో ఒకటి నేర్చుకోవచ్చు అని ....

ఆ మాట నిజం ...

నాకు "సీతఫలపు పండు" ని ... custard apple   అంటారు అని ..
ఉయ్యాల ఊపడాన్ని .... waving అంటారు అని నాకు మా ఇంగ్లీష్ చిలకనే నేర్పాడు ...


మళ్ళి రేపు మా ఊరు వెళ్తున్న ....ఈ సారి మరిన్ని పలుకులు మోసుకువస్తా ...  

ఫిజిక్స్ సారు, నేను, గాడిద ..

నాకు తెలిసి ప్రపంచం లో అతి ఎక్కువ మెమొరి ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ..మన మెదడే అనుకుంట....

ఈ ఉపోద్ఘాతం ..ఎందుకు అనుకుంటున్నారా ...?

నాకు ఇవ్వాళ కార్యాలయానికి వెళ్ళే దారి లో ..ఒక గాడిద కనిపించింది...

అందులో వింత ఏముంది ..కదా ?

నాకు 2000 సంవత్సరం నుండి గాడిద ..కనిపిస్తే ..ఫిజిక్స్ సార్ గుర్తొస్తారు ...

మాములుగ అయితే అందరి దౄష్టి లో ఫిజిక్స్ కి ..గాడిద లకి ఏమి సంబందం ఉండదు ..

కాని ఆ రోజు జరిగిన సంఘటన ..నన్ను జీవితం లో గాడిద ని ..ఫిజిక్స్ సార్ ని మరిచి పోకుండ చేసింది ...

~~~~ ం ం ం ం ~~~~ కంగారు పడకండి .. మీమ్మల్ని నాతో మా కాలేజి కి తీసుకు వెళ్తున్న అన్నమాట ~~~


ఆ రోజు ..అర్ధం కాని ఫిజిక్స్ క్లాస్ లో ..ఏ ముక్క చెవికి ఎక్కదు అని తెలిసిన ..తదేకంగా బోర్డ్ వైపే చూస్తున్న ...
అప్పుడు మా ఫిజిక్స్ సార్ [.. ఆయన కూడ నా లానే "బి.జె.పి" అనుకుండి .. "బి.జె.పి" అంటే అదేదో జాతియ పార్టి కాదు .. "భూమికి జానెడు పొడుగు" ]

లేపి బాబు IS PUSHING EASIER OR PULLING?  అని అడిగారు .. మనమా అస్సలే గవర్నమెంట్ వారి సర్కారు స్కూల్ ..అందు లోను ... కొత్త పాలెం నుండి కొత్త గా ఎర్ర బస్ దిగా .. అస్సలే ఏ ముక్క రాని ఇంగ్లిష్ మీడియం .. అందు లో అర్ధం కాని ఫిజిక్స్ ...


sun / son   లా ఒకే లా ఉన్నాయి .. రెండు ( pushing and pulling) మొదటి సారి వింటున్న ..ఏమి చెప్పా లో తెలియదు ... "తెలియదు సార్" అని కూడ ఇంగ్లీష్ లోనే చెప్పాలి అందుకే బెల్లం కొట్టే రాయి లా .. అలా నిలబడ్డా ...


అప్పుడా ఆయన నన్ను "గాడిద ..అది కూడా తెలియద" అని తిట్టారు..

వెంటనే ఆయనే  ఒక్క నిమిషం ఆలోచించి చెప్పటం మరిచి పోయ గాడిద లు నా కల లోకి వచ్చి ..రోజు సార్ మరి వాడి తో పోలుస్తున్నారు ఎమిటి సార్ ..మా పరువేం గాను అని బాధ పడుతున్నాయి .. అని అన్నారు ...

ఆ మాటలకి క్లాస్ మొత్తం విపరీతం గ నవ్వుతుండగానే .... నా చూపు అలవాతు అలవాటు లో పొరపాటు లా జ్యోతి వైపు చూశ .. జ్యోతి విపరీతంగా నవ్వుతుంది  ..ఎలా అంటే చిన్న పిల్లలు సర్కస్ లో భఫూన్ ని చూసి నవ్వుతారే అలా అన్న మాట .. అదేదొ సామెత [ " మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వింది అని బాధ అంట" ]  అన్నట్లు గా నాలో "జల్" తుఫాన్ నా తేనే కళ్ళ దగ్గర తీరం దాటింది ...

వెంటనే మా సార్ .. ఒరెయి మరి ఇలా ప్రతి దానికి ఫీల్ అయితే "టీచర్" అవి అవుతావు అన్నారు ..

 అది అన్నమాట "గాడిద".. "నేను" .. "మా ఫిజిక్స్ సార్ ..."

పదేళ్ళు అయిన ..నాకు గాడిద ని చూడ గానే అదే గుర్తు వచ్చింది .. ఎంత గొప్ప మెమరి నాది ...


కొసమెరుపు ...  ఆయనని మేము ఇప్పుడు ముఖ్య ప్రశ్నలు చెప్పండి సార్ అన్నా ..నే చెపితే రావు .. జరగదు  అనే వారు ..ఆయన అన్నట్లు గానే నేను టీచర్ ని కాలేదు .. అప్పడ్నించి "తిట్లు" అలవాటు అయిపోయి ..దున్న పోతు మీద వాన పడ్డట్లు ..ఫీల్ అవ్వటం మానేసాను ...

 PUSH /  PULL అని బోర్డ్ ని చూసిన కూడ నాకు ఇదే సీన్ గుర్తొస్తుంది ....



        
        

Wednesday, December 22, 2010

గూగుల్ ..ఓ మంచి గూగుల్ ..నువ్వు నాకు నచ్చావు ..

గూగుల్

గూగుల్ .. ఓ మంచి గూగుల్ ..

ఉత్తరాలు రాసుకొవడానికి .. జిమేల్ ఇచ్చావు ....
మన ఉత్తరాలు వేరే వాళ్ళు చదవకుండ పాస్ వర్డ్ ఇచ్చావు ..
స్నేహితులు తో మాట్లడటానికి జీటాక్ ఇచ్చావు..
నన్ను ప్రపంచానికి చూపించుకోవడానికి పికాస ఇచ్చావు ..
ఏ ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పడనికి గూగుల్ మ్యాప్స్ ఇచ్చావు..
నేను కూడ రాయగలను అని చెప్పడనికి బ్లాగ్స్ ఇచ్చావు ..
మరిచిపోయిన స్నేహితుల్ని కలవడానికి ఆర్కుట్ ఇచ్చావు ...
ఎప్పుడు ఏ అవసరం వచ్చిన వెతుక్కొడానికి సెర్చ్ ఇచ్చావు ..
ఎర్రర్ నేను పోస్ట్ చేస్తే .. సొల్యుషన్ నువ్వు ఇచ్చావు ...
పైస ఖర్చు లేకుండ సినిమాలు చూసేలా చేసావు ...
ఇవి అన్ని నన్ను రూపాయి కూడ అడగకుండా ఉచితంగా ఇచ్చావు ...



ఇలానే

ఏ తొకలు పెట్టకుండ వెబ్సైట్ ఇస్తావు అని ...
తప్పిపోయిన నా మొబైల్ కనిపెట్టాడనికి ..ఎదో ఒక దారి చూపిస్తావని..
కోరుకుంటున్నాను ..

చేస్తావు ..నువ్వు తప్పకుండ చేస్తావు ఎందుకంటే నువ్వు గూగుల్ వి ..మంచి గూగుల్ వి...

కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం

కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం .. ఏమి చెయ్యాలి ... ఎలా మొదలు పెట్టాలి.
కొత్త సంవత్సరం .. పాత సంవత్సరం లా పాత లా ( రొటీన్) ఉండకూడదు .. కొత్తగా కొత్త పనులు మొదలు పెట్టాలి.


ఇవి రాబోయే సంవత్సరం లో నేను కొత్తగ మొదలు పెడదాము అనుకునే ....సంకల్పాలు ..

1) మా అమ్మ, నాన్న చిన్నప్పటి నుండి చెవి లో ఇల్లు కట్టుకొని మరి చెప్పే మాట .. పొద్దున్నే లేవాలి....

ఇప్పటి దాక ..పొద్దున అంటే వేకువ జామున 8:30, 9:00 అనుకునే నేను ... వచ్చే సంవత్సరం నుండి పొద్దున్నే అంటే 7:30 అని మెదటి బిల్లు గా ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది అని చెప్పుటకు సంతసించడమైనది..        


2)
అరే ఒకసారి అద్దం లో చూసుకో.. బద్దకం ఎక్కువై .. రోజు రోజు కి.. కొబ్బరి బోండం లా తయారు అవుతున్నావు .. అని మా హితులు ..సన్నిహితులు ..కోరడం తో .. అందులోను ఇలా అయితే పిల్ల ని ఎవ్వరు ఇవ్వరు అని పలురకాలు గా భయాందొళనలకు గురిచేయడం వలన

వచ్చే సంవత్సరం నుండి .. క్రమం తప్పకుండ "జిమ్మ్ కి" వెళ్ళడం లేద అందుబాటు లో ఉన్న టీటీ ..వాలీబాల్ వంటి ఆటలు ఆడి అయిన సరే శరీర సౌష్టవం కాపాడుకుంటాను అని మీ అందరి ముందు వాగ్దనం చెస్తున్న..


3) అరే నువ్వు ఏ పెళ్ళాం కాకి, పిల్లలు కాకులు లేని ఏకాకివి ..నీ ఖర్చులు చూస్తే ..
హైదరబాద్ లో  ఒక మంచి ఏరియా లో ఒక చిన్న కుటుంబం చింతలు లేకుండ ఒక నెలంత జీవించడం తేలిక అని మళ్ళి నా హితులు సన్ని హితులు కోరడం ....

మీ ముద్దుల కొడుకు దుబారాలు ఎక్కువ అయ్యాయి అని ..వార్తలు "టీవి9" వాళ్ళు లేకుండనే ఇంట్లో ప్రాదేశిక వార్తలు గా ప్రసారం అవ్వడం వల్లన ..              
                            
ఇలా అయితే నీ .. "ఏ టి యం" కార్డు తీసుకొని పాకెట్ మని లాంటి పాత స్కీములు కొత్తగా మొదలు పెడతాము అని అధిష్టానం నుండి హెచ్చరికలు రావడం తో ...

వచ్చే సంవత్సరం నుండి ప్రతి పైస ఖర్చు పెట్టెముందు .. ఎందుకు ..? అవసరమా? అని రెండు ప్రశ్నలు సంధించుకొని వాటికి సరియైన సమాధానం వచ్చిన పిమ్మట మాత్రమే ఖర్చు చెయ్యాలని ..కొత్త నిభందన ఎర్పాటు చేయడమైనది .. అని విన్నవించుకుంటున్నాను


చివరగా

అధిష్టానం దగ్గర బుద్దిమంతుడు అని పేరు తెచ్చుకున్న నేను ..ఇప్పటి వరకు గడిచిన 26 సంవత్సరములు లాగానే ..ఈ వచ్చే సంవత్సరం కూడ ..ధూమపానం ..మధ్యపానం .. ఇంకా ..ఎమైన మంచి అలావాటులు కి దురంగా ఉండి .. అధిష్టానం నమ్మకాన్ని .. వమ్ము కానియకూడదు అని ప్రతిఞ్ చేయుచున్నాను...



పైన పెర్కొనబడిన నా సంకల్పలు ..కేవలం నా స్వార్జితం అని ఎవరి నుండి తస్కరించనవి కావు అని ... ఒకవేళ ఇవే సంకల్పాలు మీరు చేసిఉంటే దానికి నేను .. నా బ్లాగ్ ఎవిధముగా బాద్యుడిని కాను అని .... ఒకవేళ నా సంకల్పాలు మీకు నచ్చి మీరు కూడ పాటించిన .. నాకు ఏమి రొక్కం .. ఏ రుపం లో కూడ కట్టవలిసిన అవసరం లేదు ...అని విన్నవించుకుంటున్నాను 

ఇట్లు 

నూతన సంవత్సర శుభాకాంక్షల తో 

మీ

నలుగురి లో నాలుగో వాడు. ..

Tuesday, December 14, 2010

2010 = 2 + 0 +1 +0 = 3

హలో ..బాగున్నారా.? బాగలేకపోయిన నేను చేసేది ఏమి లేదు లేండి. బట్ (కాని) మీరు అందరు ( నాతో కలిపి)  బాగుండాలి అని  కోరుకుంటున్ననూలేండి.....
            తర్వాత..  దేని తర్వాత అనా మీ ఉద్దేశ్యం? అదేనండి ఇందాక కుశల ప్రశ్నల తర్వాత అసలు పాయింటు కొద్దము పాయింటు కొద్దాము. . 2010 = 2 + 0 +1 + 0 = 3. అవును మూడు, త్రీ, తీన్ , మూరు, బాష ఏదైన "మూడు" నా లక్కి నంబర్. కాబట్టి మీకు ముచ్చటగ ఈ సంవత్సరం నా అనుభవాలలో మూడు మీతో పంచుకుందాము అనుకుంటున్నాను.

1. క్రొత్త బంగారు లోకం
Zensar Technologies Pune.
సంవత్సరం మొదటి రోజు ఎలా జరిగితే సంవత్సరం అంత అలా జరుగుతుంది అని నమ్మే వాళ్ళ లో నేను ఒకడిని. 2010 జనవరి 1న మా అన్న ని చూద్దాము అని ఎందుకు "పూణే" వచ్చానో తెలియదు కాని అనుకోకుండా, అస్సలు ఊహించని విదముగా నేను ఇక్కడే జాబ్ జాయిన్ అయ్యా. ఆ దేవుడి దయ వల్ల "క్రొత్త బంగారు లోకం" లోకి అడుగుపెట్టా!. మంచి కంపెని ..మంచి మనుషులు .. మంచి విలువ గల క్లైంటు.. అంతా ఆల్ హ్యపీస్ ...... 


2. జీవితమే ఒక రైలు ప్రయాణం

 

"జీవితమే ఒక రైలు ప్రయాణం" అని ఆ కవి ఏ టైం లో .. ఎవరిని ఉద్దేస్యించి చెప్పారో కాని .. నా ఈ సంవత్సరం .. సగం రైలు లోనే గడిచింది...మళ్ళి మొదటికి వస్తే .. జనవరి 1 న ఏమని ముంబయి (వేగముగ) వెళ్ళు రైలు ఎక్కానో ..ఈ సంవత్సరం అంత ఆ రైలు ఎక్కుతు ..దిగుతు ..అదే పని ప్రతి వారాంతం.. ఈ సంవత్సరం నేను చేసిన ప్రయాణం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. 




3.  పెళ్ళి ... పెళ్ళి ... పెళ్ళి ...

         ఏమిటి .. పెళ్ళి .. పెళ్ళి .. పెళ్ళి అని మూడు సార్లు రాశాను అనా ? చెప్పాకదా నా లక్కి నంబర్ 3 అని. ఇంతకి ఈ సంవత్సరానికి .. ఈ 3 పెళ్ళిళ్ళ లకి బంధం ఏమిటా అనా? .. ఈ సంవత్స్రం ముచ్చటగ మా మూడో ( 3 ) అన్న పెళ్ళి .. తర్వతా మా స్నేహితుడి పెళ్ళి .. తర్వాత మా కజిన్ పెళ్ళి ..ఇలా ఇప్పటికి మూడింటికి హాజర్ అయ్యా. ఇది ఈ సంవత్సరం పెళ్ళి గోల ...


హమ్మయ్య ఇది అండి ఈ ఏటీ మేటి అనుభావాలు .. మీరు కూడ ..ఈ ఏటి మేటి అనుభవాలు పంచుకుంటారు కదూ..

Saturday, November 20, 2010

కల్తి కాంగ్రేశ్

అనగా అనగ భారత దేశాన్ని సత్య హరిచంద్రుడు అనే రాజు పరిపలించాడు. అతను అబద్దం ఆడకూడదు అని పత్నిని కూడ అమ్మటానికి తయారు అయ్యాడు. అలానే శిబి చక్రవర్తి అనే అతను ఒక పావురం కాపాడటానికి తన వంటి లోని కొంత భాగం కోసి ఇచ్చాడు. వీరి లానే అక్బర్, వీర శివాజి ఇలా ఎంతో మంది మన దేశాన్ని పాలించారు. రాముడు పాలించిన తీరు ఇప్పటికి రామరాజ్యం అని వేయినోళ్ళా కొనియాడ పడుతుంది. అలాంటి మన దేశానికి బ్రిటిష్ పీడ వదిలిన తర్వాత కాంగ్రేశ్ అధికారం లోకి వచ్చింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే ప్రజస్వామ్యాం అని నమ్మిన రోజులు అప్పట్లొ ఉండేవి.

ఒక చిన్న రైలు ప్రమాదానికి నైతిక భాద్యత వహించి మంత్రి పదవికి రాజినామ చెసిన చరిత్ర గల నాయకులు ఉన్నారు. దేశం కోసం ఉన్న ఆస్థి ని అంత రాసిచ్చిన వారు ఉన్నారు. 5,10 సంవత్సరాలు మంత్రి పదవి చేసి సొంత ఇల్లు కూడ లేని ఉన్నారు.




మరి ఇప్పుడు అంత కల్తి అయినట్లే .. కాంగ్రేశ్ కూడ పూర్తిగ కల్తి అయిపొయింది. ఎంత ల అంటే దేశం మొత్తం గర్వం గా చెప్పుకొవల్సిన కామన్ వెల్త్ ... ఇప్పుడు 2ఘ్ స్పెక్ట్రం లు కాంగ్రేశ్ ను పూర్తిగ కల్తి గ మార్చివేసాయి ఎక్కడ చూసిన అవినీతి .. ప్రతి చోట అవినీతి .............. చ నాకు కూడ రాయటానికి సిగ్గు గ ఉంది .

ఇందిరమ్మ టపా

అదిమేటి టపాల్లో  ఇందిరమ్మ టపాలు కూడ ఉంటాయ అని మీకు అనుమానం రావచ్చు కాదు రావాలి. అసలు విషయం ఎమిటంటే ఎప్పటి లానే కడుపు నిండా తిని పడుకున్నాన అప్పుడు రోశయ్య గారు కలలోకి వచ్చాడు(రు) బాబు ఒక సారి నన్ను చూచి నువ్వు మా ఇందిరమ్మ పేరు మీద ఒక టప రాయి అన్నారు. నేను వెంటనే, చూడండి రోశయ్య గారు మీరు పొరపాటో , గ్రహపాటో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు నన్ను అడగటం న్యాయమే నేను కాదు అనను కాని నేను పుట్టక ముందు చనిపోయిన ఆమే గురించి ఎందుకు రాయాలి అని అన్నాన అలా కాదు నాయన ఇంక పేరు(ల) వేలు పెట్టని ప్రదేశం ఎమైన ఉంది అంటే అది తెలుగు బ్లాగే కావున మీరు తప్పకుండ ఇందిరమ్మనో , రాజీవ్ టపానో రాయల్సిందే అని కాళ్ళ వేళ్ళా పడ్డారు .

అయ్యా రోశయ్య గారు, అన్నిటికి ఇందిరమ్మ, రాజీవ్ పెర్లు పెట్టే మీరు మీ కార్యలయం కి మాత్రం కేవలం "గాంధి భవన్" అని పెట్టడం ఎమీ బాగుంది అని నేను అడుగుతున్నాను. చూడు బాబు మాది "గాంధి"ల పార్టి ఎప్పుడు ఏ గాంధి ఉంటారో తెలియదు కాబట్టీ( మొదట్లొ ఇందిరా గాంధి , తర్వాత రాజీవ్ గాంధి, ఇప్పుడు సోనియ గాంధి , తర్వాత రాహుల్ గాంధి, ఆ తర్వాత ఎదొ ఒక X గాంధి ..) సొ గాంధి భవన్ అయిపొయింది.




అది సరేండి తెలుగు లలిత కళాతోరణం కి రాజివ్ కి ఎమి సంబంధం, మెదక్ కి ఇందిరమ్మ కి ఎమిటి రిలేషన్? చూడు బాబు నువ్వు నీకు పుట్టకు ముందు ఇందిరమ్మ ఇక్కడ పోటి చేసి గెలిచారు, ఓహొ! గెలిచి ఏమి చేసారు? గెలిస్తే ఎం చేస్తారు ఓడి పొతె అన్న ఎదొ ఒక పని మీద ధర్నాలు, రాస్థా రొకొలు చేస్థారు గాని. నీ దగ్గర వంద కోట్లు ఉంటే చెప్పు మీ తాత గరి పేరు తో రామ క్రిష్ణ మెమోరియల్ సచివాలయం అని పేరు మారుద్దాము.



అలా వచ్చార! అయ్యో నేను మరిచి పోయ రెపొద్దున్నె రాజివ్ గాంది ఆంధ్ర అనో, ఇందిరా ప్రదేశనో మన రాష్త్రం పేరు మార్చడానికి ఒక అప్లికేషన్ పెట్టి వస్థా. బాబు చివరగ ఒక మాట హుస్సేన్ సాగర్ ఖాలి గానే ఉంది కదా అని దూకేవ్ ? చావవ్ కద లెని పోని రోగాల్ వస్తాయి.



ఇక మరి నేను ఉంట ! ..

Thursday, February 4, 2010

నాటకాలకి పెరుగుతున్న ఆదరణ ..


 నాటకాలకి నిజంగా ఆదరణ పెరుగుతుందా ? అవుననే అంటున్నారు ఖమ్మం వాసులు. జనవరి 30 నుండి ఖమ్మం లో మొదటి సారిగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు చూడటానికి జనం తండోప తండాలు గా వస్తున్నారు అట,ఉదయం నుండి మొదలయ్యే ఈ నాటకల్ని జనం విరగపడి చూస్తున్నారు.అందున పద్య నాటకానికి ఎక్కువ ఆదరణ లభించటం నిజం గా హర్షణియం. ఉత్తమము గా అనిపిస్తే అది మాస్ హీరో సినిమానే కాదు నాటకమైన వన్స్ మోర్ అనాల్సిందే. 

ఇంత ఆదరణ చూసి ఎంతో కష్టపడి నంది నాటకోత్సవాలని హైదరబాద్ నుండి ఖమ్మం బస్ ఎక్కించిన కలెక్టర్ ఉషారాణి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ఇక నాటకాలకి కూడ మంచి రోజులు వస్తున్నాయి. పైన ఫోటో లో బుదవారం ప్రదర్శించిన పద్య నాటకం లో ఒక దృశ్యం.

చంద్రుడికి ఒక నూలుపోగు లాగ నాటక రంగానికి కృషి చేస్తున్న వారందరికి న అభినందనలు. పైన పెర్కొనబడిన నాటకం లో నటించి దర్శకత్వం వహించిన మా పెదనాన్న (తాటికొండాల నరసింహరావు ) గారికి ప్రత్యేక అభినందనలు .   

Tuesday, February 2, 2010

చంపేశారు .....

 చంపేశారు వైష్ణవిని.....నిజంగా చంపేశారు ...కాని ఎవరు .? అందరు అనుకున్నట్లుగా ఆస్తి కోసం అయిన వాళ్ళే చంపారా ..? కాని వాళ్ళు మాత్రమే కాదు ..నా ఉద్దేశ్యం లో వాళ్ళు ఎంత కిరాతకులో మీడియా కూడ ..
                 ఈ మీడియా వాళ్ళా అత్యుత్సాహం వల్ల వాళ్ళు అసలుకే మోసం వస్తుంది అనుకొని చంపారు ఇంత హడావుడి చేయకపోతే ఫలితం వేరేల ఉండేది. ముంబాయి దాడులు జరిగినప్పుడు కూడ ఇలాంటి అనవసర ఉత్సాహం చూపి వాళ్ళాకి దారి చుపారు. ఇలాంటి వార్తలు ప్రజల మద్యలోకి తీసుకువెళ్ళటానికి ఒక పద్దతి పాడు లేకుండ పొయింది. మొన్ననే సుప్రీం మీడియా మీద ఆంక్షలు ఎన్ని పెట్టిన కుక్క తోక వంకర అన్నట్లు వీళ్ళు మారలేదు.

Monday, January 25, 2010

గుర్తొచ్చింది ........

నేను ఇవ్వాళ ఆఫీస్ నుండి రాగానే మా వదిన రేపు మీకు "సెలవేనా" అని అడగగానే నాకు గుర్తొచ్చింది. రేపు జనవరి 26 కదా.. సెలవే మరి .. సెలవు కాబట్టే గుర్తు ఉంది.. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది..వెంటనే నేను అర్జంట్ గా రేపు పొద్దున్నే లేచి నాకు దేశభక్తి ఉంది అని నిరుపించుకోవాలి.. అంటే ఎం చేయాలి చెప్మా? ఆ గుర్తొచ్చింది.. ఎర్రకోట మీద భారి భద్రతల మద్య ..మనం జెండ మనం ఎగరవేయాటానికి ఎన్ని కష్టాలు రా అనుకుంటూ ... పాపం "చటోపాద్యయా" 100 సంవత్సరాల క్రితం రాసిన వందే మాతర గీతానికి వచ్చిన కష్టాలు తలుచుకుంటు..ఆ పాట కూడ విని కొంచెం దేశభక్తి నాకు ఉంది అని ఫీల్ అయిపొయ్ సెలవు కదా పేపర్ తెచ్చుకుందాం అని బయటకి బయలు దేరి ..దారి లో రేపు మాత్రమే కనపడే మన జెండా ఒకటి లేదా రెండో కొని ఒకటి మన జేబు కి పెట్టూకొని ఇంకొకటి మన వాళ్ళకి ఎవరి కి అయిన ఇచ్చి హమ్మయ్య వాళ్ళ లో కూడ దేశభక్తి పెంచాం అనుకొని.. ఏ "ఖడ్ఘం" మో , మేజర్ చంద్రకాంత్ సినెమా నో చూసేసి హమ్మయ్య మనకు చాలా దేశభక్తి ఉందిరా అని నాలో నేనే పొంగిపోయి .. ఇంకా నేను ఇండియన్ గా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని వచ్చే 2,3 "ఫార్వార్డ్" మెయిల్స్ నా లిస్ట్ లో ఉన్న స్నేహితులకి పంపి ..వారి లో కూడ దేశభక్తి పెంపొందించాము అని సంబరపడి .... రేపు మాత్రమే గుర్తుకు వచ్చే మన రియల్ హీరోస్ అదేనండి మన ఆర్మి పీపుల్ కి సలాం చేసి ....హమ్మయ్య నాకు చాలా దెశభక్తి ఉంది రా అని నాకు నేనే ఒక సర్టిఫికేట్ జారి చేసుకొని .. మళ్ళి ఎళ్ళుండి రాగానే .... మళ్ళి దేశాన్ని గురించి దేశభక్తి గురించి మరిచిపోయి 7 నెలల తర్వాత వచ్చే సెలవు రోజు అదేనండి ఆగష్ట్ 15 రోజు వచ్చేదాక మాములే... రేపు జరగపోయేది ఇలా కళ్ళకు కట్టినట్లు చెపుతున్నావిమిటి అని ఆశ్చర్య పోతున్నారా ? ప్రతి సంవత్సరం నేను, నా లాంటి వాళ్ళు చాలా మంది ఇదేగ చేసేది.

ఇదేమి న్యాయం ............

నేను నిన్న ఆదివారం కావడం తో ..సినిమా కి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అని ..మా అన్న,వదిన లతో కలిసి "అదుర్స్" అనే సినిమాకి వెళ్ళాను. సినిమా మొదలయిన 5,10 ని"లు నుండి నా మనసు లో ఒకటే ఆలొచన... ఒకటే బాధ. సినిమా మొత్తం నా వాళ్ళ గురించి,మా వేషధారణ గురించి అవహేళన చేస్తున్నారు అని ఒకటే బాధ. "నాకు తెలిసి ఒకరిని చూసి మనం నవ్వుతున్నాము అంటే వారిని మనం అవహేళన,హేళన చేస్తున్నాము అనే". ప్రతి సన్నివేశం లోను మా నుండి వెకిలి నవ్వులు పుట్టిచ్చడనికి ప్రయత్నించారు అనే బాధ.







అప్పుడెప్పుడో "కంత్రి" సినిమా రిలీజ్ అయిన కొత్తలో అనుకుంట .. కేవలం ఒకే ఒక సన్నివేశం లో అది కూడ అంబేద్కర్ విగ్రహం చూపించారు అని అవి కేవలం దళిత వాడల్లోనే ఉంటాయి అని ..వారికి వారే ఊహించుకొని శ్రీ మందా కృష్ణ మాదిగ (..పేరు పూర్తిగ పైకి చదవకండి .. కేసు వేసి బొక్కలో తోస్తారు) గారు నాన గొడవ చేసి డైరెక్టర్ చేత సారి చెప్పించి ఆ సదరు సన్నివేశం తీసివెసే దాక మీడియా తో కలిసి బీబత్సం సృష్టించారు.

ఏమి ఇదేమి న్యాయం? సినిమా మొత్తం మా గురించి ఇలా మాట్లాడతారు ..ఇలా చేస్తారు .. అలా ఉంటారు అని వెకిలి చేష్టలు చేయిస్తే ఎవరు మాట్లడరే ..? ఎందుకు అంటే వారు 22% ఉన్నారు ఓట్లు రాలవు అనా ..మేము అయితే కేవలం 4% ఉన్నారు వెస్తే ఎంత వేయకపోతే ఎంత అనా? అయిన కథా రచయతలకి మమ్మల్ని కించపరచకుండ సినిమా కథలు రాయటం రాదా? కామెడి అంటే ఇలా ఒక సామజిక వర్గం వారిని కించపరచడమేనా? ఇది ప్రతి ఒక్కరు సిగ్గు పడాల్సిన విషయం. సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఇలా ఒక సామాజిక వర్గానికి చెంది న వారిని ఇలా అవహేళన చేయటం తగునా ..? ఇదేమి న్యాయం భగవంతుడా ?

Thursday, January 21, 2010

సార్ 5 నిమిషాలు.. ప్లీజ్ సార్ 5 ని"లు ..... ఆలొచించండి.

ఆచార్యా కోదండరాం గారు, ప్లీజ్ 5 నిమిషాలు ఆలోచించండి. మీరు ఇలా శ్రీకాంత్ కోసం ఒక సారి, వేణు గోపాల్ కోసం ఒకసారి బంద్ చేసుకుంటు పోతే .. విద్యార్దుల కి తప్పుడు సమాచారం పంపినట్లు అవుతుంది. ఇలా చేస్తే నిజం గా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి "తెలంగాణ" సాదించ వచ్చు అని అపోహ కలిగించిన వాళ్ళు అవుతారు. శ్రీ గౌరవనీయులైన " కె సి ర్" గారు ఇలా చేద్దమనే 3 పర్యాయాలు రాజినామ సమర్పించి చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గా ఎదో గెలిచాం అంటే గెలిచాము అని అనిపించుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని ఒక్క 5 నిమిషాలు ఆలొచిస్తే మీకే అవగతం అవుతుంది. ఆయన మొదటి సారి రాజినామా సమర్పించినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇది ఎదో బాగుంది అని 2 వ సారి , 3 వ సారి కూడ అలానే చేస్తే చివరకు ఇంకోలా జరిగింది. రాజినామ చేయటం వల్ల జరిగే నష్టం ప్రభుత్వానికి ఎంత వుందో ప్రజలకి పరోక్షము గా అలానే ఉంది అనే విషయం ఆలస్యము గా అయిన వాళ్ళాకి తెలిసింది. ఇప్పుడు ఈ విషయం అంతే, ఇలా మీరు బంద్ అని పిలుపునిస్తే ప్రభుత్వానికి ఎంత నష్టమో ప్రజలకి ( ముఖ్యము గా విద్యార్డులకి) అంతకన్నా ఎక్కువ నష్టం. వారి పరీక్షలు వాయిద వేయించి ఎదో సాదించాం అని మీరు అనుకుంటే దాని వల్ల వాళ్ళా విలువైన జీవితం ఇబ్బంది పాలు అవుతుంది,ఒక సారి జైల్ కి వెలితే తర్వాత వారు ఇక ప్రపంచం లో ఎక్కడా ఏ ఉద్యోగం, కనీసం చదవటానికి కూడా అనుమతి దొరకదు. ఈ విషయము ఈ క్షనికావేశంలో తెలియకపోయిన, తెలిసిన నాడు మీకు విశ్వ విద్యాలయ విద్యార్దులు కాదు కదా కనీసం "అ ఆ" లు దిద్దే వాళ్ళు కూడా మద్దతివ్వరు అప్పుడు మీకు తెలంగాణా లో ఈ 2 సీట్లు కూడా రావు.





కావున ఆచార్య కోదండరాం గారు విద్యార్దుల జీవితాలతో ఆడకండి.వాళ్ళు రెండు వైపుల పదునున్న కత్తుల లాంటి వారు వారితో జాగ్రత్తగా మసలటం మీకు ..తెలంగాణ ఉద్యమానికి ఎంతో మంచిది.




మీరు ఆచార్యులు అయిఉండి ఏంతో ఉన్నత వ్యక్తిత్వం కిలిగిఉన్న మీకు నేను చెప్పేవాడిని ఏ మాత్రం కాదు. కాబట్టి సార్, ఆచార్యా ! 5 నిమిషాలు .. కేవలం 5 నిమిషాలు ఆలొచించండి.

Monday, January 18, 2010

Foot Prints

Many people will walk in and out of your life, but only true friends will leave footprints in your heart.--  "Eleanor Roosevelt "


                  ఆ రోజు జూన్ 29 2009,కొత్త కంపెని లో నేను జాయిన్ అయిన రోజు. నాతో పాటు నవీన్,మోహన్ ఇంకా తుషార్,సొనం వీళ్ళు కూడ అదే రోజు జాయిన్ అయ్యారు. మేము అందరం ఒకే రోజు జాయిన్ అవ్వటం వల్ల రెండు,మూడు రోజులలోనే చాలా దగ్గర అయ్యాం. ముఖ్యం గా నేను,నవీన్ అయితే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ లా ఎప్పుడూ కలిసి ఉండే వాళ్ళం. కలిసి తినే వాళ్ళం,ఆడే వాళ్ళం ఆఫిస్ లో ఉన్నంత సేపు అతుక్కొని ఉండే వాళ్ళం. జాయిన్ అయిన 15 రోజులకి మా ఇద్దరిని ఒకే ప్రాజెక్ట్ లో వేసారు. ఇక మేము పరస్పరం పని లో కూడ ఎంతో సహాయకరం గా ఉండే వాళ్ళం.నా కన్న తనకి బేసికల్ గా కొంచెం కాదులెండి, బాగానే నాలెడ్జ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను నా ప్రతిపని ఆఫిస్ ది అయిన సొంత పని అయిన తనని సలహా ఆడిగి చెసేవాడిని. తను కూడ ఏమి చేసిన నాకు చెప్పి చేసే వాడు కుదరకు పోతే చేసిన తరవాత చెప్పేవాడు.అన్ని విషయాలలో నాకు వెన్నుదన్ను గ ఉండే వాడు.

                  ఆ రోజు డిసెంబర్ 17 2009, తనకి "యు స్ ఎ " హెచ్1బి వీసా ఉండటం తో మా కంపెని కి రిసైన్ చేసాడు. ఇక అప్పటి నుండి నాకు ఈ కంపెని లో ఉండాలి అనిపించలేదు నేను గట్టిగ ట్రై చేశా నాకు వేరే కంపెని లో మంచి ఆఫర్ వచ్చింది. ఆ రోజు 12 జనవరి 2010 నేను రిసైన్ చేసా.

ఈ రోజు జనవరి 18 2010 తనకి మా కంపెని లో లాస్ట్ వర్కింగ్ డే. మళ్ళి తనకి నేను కనపడతానో లేదో కనపడిన ఇప్పటి లా కలిసి పని చేస్తామో లేదో తెలియదు కాని తను నాతో గడిపిన ఈ 7 నెలల స్నేహాన్ని నేను ఎప్పటికి మరువను.

అందుకే  Many people will walk in and out of your life, but only true friends will leave footprints in your heart.

చెప్పటం మరిచా నేను,నవీన్ కొన్ని గంటల వ్యవది లో జన్మించాం. తను 20 ఫిబ్రవరి అయితే నేను 21 ఫిబ్రవరి.  
 
ఫోటో లో ఎడమ వైపు నవీన్,పక్కన నేను[నలుగురి లో నాలుగో వాడిని]                      

                       

Wednesday, January 13, 2010

అ-అరిసె, ఆ - ఆమ్మ(పెద్దమ్మ)


అ- అమ్మ అనగానే ప్రేమా,మాదుర్యం,ఆప్యాయత అని ఎలా తెలుస్తుందో అలానే సంక్రాంతి పండగ అంటే భోగి పండ్లు,గొబ్బెమ్మలు,ముగ్గులు ఇంకా గుర్తువచ్చిందా? నోరు ఊరుతోందా ? అదేనండి అరిసెలు. హా! పలికితేనే నోరు అంత తియ్యగ అవుతుంది. ఇంకా తింటుంటే ఆహా ! నా రాజ ! .. మరి ఇంక ఏ- స్వీట్ దాని దక్కరకు రాదు. మనలో అరిసెలు చేయటం రాని వారు ఉన్నారేమో కాని తినడం ఇష్టం లేని వాళ్ళు ఉండరు అంటే అతిసోయక్తి కాదు. నాకు అరిసె అన్న, సంక్రాంతి అన్న ముందు గుర్తుకు వచ్చేది మా ఆమ్మ.
     నాకు ఇంకా గుర్తు ఉంది.ప్రతి సంక్రాంతి పండగ కి కొత్తపాలెం (వెలది కొత్తపాలెం,చందర్లపాడు (మ),కృష్ణ(జి) మా సొంతూరు లేండి ) వెళ్ళడం. మేము వెళ్ళగానే మాకోసమే ఎదురు చూసే ఆమ్మ(కొంత మంది పెద్దమ్మ అని కూడ అంటారు),ఆమ్మ వేసే రంగు రంగుల ముగ్గులు, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు,వాటి మీద చల్లే బంతి పూలు , పొలం గట్ల నుండి కోసుకు వచ్చే రేగ్గాయలు నిజం గా మా మేము ఉండే వీది వైపు వచ్చి న వారు ఎవరైన సరే కళ్ళు తిప్పే వారు కాదంటే నమ్మండి.


మేము వెళ్ళిన రోజు నుండి మా ఆమ్మ పెట్టే పరుగులు,ఉరుకులు, మా చిన్నోడి కి అవి అంటె ఇష్టం ,ఇవి ఆంటే ఇష్టం అని చెప్పి తను చేసే వంటలు , స్వీట్లు . నేను నిజం గా (పెట్టి పుట్టాడు ఆంటారు చూడండి) అంత కన్న ఎక్కువ అన్నమాట. ఇంకా తను భోగి కి రెండు రోజుల ముందు అరిసెలు చేసేది.నన్ను పక్కన కూర్చొ పెట్టుకోని మా నాన్న చిన్నప్పటి విశేషాలు, మా అమ్మ చిన్నప్పటి కబుర్లు అని చెబుతూ బియ్యప్పిండి రోట్లో దంచుతు .... బెల్లం పాకం పడుతు మద్య మద్య లో మా అమ్మ కి .. లక్ష్మి ఇలా చెయ్యి .. అలా చెయ్యి అని ట్రైనింగ్ ఇస్తూ ...ఇంకా నెయ్యి లో వేయిస్తూ .. ఇవి కాస్త వత్తరా అని చిన్న హెల్ప్ అడిగి .. ఇవ్వాల పని అంతా మా వాడే చేసాడు అని ఇంటి ముందు అరుగు మీద కుర్చొని, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి చెప్పేది. ఇంకా కనుము పండగ అయిపోగానే మేము ఊరికి బయలు దేరగానే ..మళ్ళి మా కోసం ఉగాది పండగ ఎన్నిరోజులకి వస్తుందో అని లెక్కలు వేసి, చేసిన పిండి వంటలు అన్ని ఒక సంచి లో పెట్టి . బాగ చదువుకో అని ఒక వందో, 2 వంద లో జేబులో పెడుతు కంటి నిండా నీళ్ళతో .. మనసు నిండా ప్రేమ తో చేయి ఊపుతు ఉగాది కి తప్పకుండ రార అని టాటా చెప్పేది.

 ఆమ్మ ఇప్పుడు బౌతికము గా మా మద్య లేక పోయిన, నేను చూసే ప్రతి ముగ్గు లో ఉంది,నాకు ఇష్టమైన అరిసె లో ఉంది. నా గుండెలు నిండా ఎప్పుడు ఉంటుంది

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి