Saturday, August 11, 2012

జులాయి సినిమా రివ్యు Julayi movie review



చాల రోజుల తర్వాత , కాదు చాల సంవత్సరాల తర్వాత నేను మొదటి రోజు, మొదటి అట సినిమా చూసా.
అది త్రివిక్రమ్ మీద ఉన్న అభిమానం. అయన నా లాంటి ఎందఱో అభిమానుల నమ్మకం వమ్ము చేయలేదు.
         
రవి (అల్లు అర్జున్ ) పట్టభద్రుడు అయిన ఒక జులాయి, ఒకే రోజులో బాగా ధనవంతుడు అవ్వాలని ఆశ తో వాళ్ళ నాన్న (భరణి) తో గొడవ పడి, 10 వేలు తీసుకోని, క్రికెట్ బెట్టింగ్ కి వెళ్తాడు. అక్కడ నుండి కథ మొదలు అవుతుంది.
వెళ్ళే దారి  లో, అతనికి "సోను సుద్" మరియు ఇతర వ్యక్తులు తారస పడతారు, వారు ఒక బ్యాంక్ దోచు కోవడం మొత్తం 1500 కోట్ల దోచుకొని, దాని తో దేశం దాటి వెళ్ళటం అతని ప్రణాళిక దానిని మన రవి ఎలా ఆపాడు అన్నది స్టోరి.



                                                  
కథనం:  త్రివిక్రమ్ తన పదునైన పంచ్ మాటల తో మరో సారి మనల్ని సమ్మోహితుల్ని చేస్తాడు.
 "లాజిక్ లు ఎవరూ నమ్మరు.. అందరకీ మ్యాజిక్ లే కావాలి... అందుకే మన దేశంలో సైంటిస్టు కన్నా బాబాలే ఫేమస్..."  అని అందరితో  విసిల్స్ వేయించి   

హాస్పిటల్ సీన్ లో తనికెళ్ళ  భరణి తో చెప్పించిన , "నువ్వు ఆ పదివేలు తిసుకేల్లకపోతే , మీ అమ్మ నీ కోసం ఇష్టమైన పకోడీ లు  చేసిది, మీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది, మనం హాయ్  టీవీ చూస్తూ ఉండేవాళ్ళం అది ర నిజమైన ఐశ్వర్యం " అందరి చేత కంట తడి పెట్టించింది.

నేను తెలివైన వాణ్ణి అని చెప్పించడం, బాగా వచ్చింది.

హిరోయిన్ తో స్టోరి కి ఒరిగింది ఏమి లేదు,  ఇంకా ఆలీ ఎందుకో ఏమిటో ఎవ్వరికి తేలేదు. తెలివి లేని దొంగ గ బ్రహ్మానందం బాగా చేసారు.

  మొత్తం మిద ఇంట్లోని వారందరు  సరదాకి వెళ్లి చూడగలిగిన  సినిమా.

నా రేటింగ్   3.5 /5        
     

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి