Wednesday, December 30, 2009

మీరూ నవ్వండి

నాకు మా స్నేహితుడి నుండి వచ్చిన మెయిల్. చూసి చాలా సేపు నవ్వా. మీరు ఇంతకుముందే చూసి ఉండవచ్చు. కాని మళ్ళి మళ్ళి చూసిన నవ్వు రావటం ఖాయం.
              
              

To ,

Tintumol

UKG A.



Dear Tintumol,



I love you. My dream I see you. Everywhere you. You no, I live no.

I come red shirt 2morrow. You love I, you come red frock. I wait down mango tree. You no come, i jump train. Sure come...



yours lovely,



Tutumon

Std 1 B

...........................................................................

.................

Reply....by Tintumol....



Darling, your letter mama see. Papa beat me beat me so many beat me.

I cry. i cry. So no come to mango tree. No jump train. I love you.

See another day. I no red frock. Only green.



You love me, you love me you green shirt. Give I gift. I see you with pinkumol.

Where you go.. NO talk to her. Okay My dream also only you




Lovely

Tintumol...


నవ్వారు కదా. నాకు తెలుసు అండి మీరు కూడ నవ్వుతారు అని అందుకే ఈ టప పోస్ట్ చేసా. చెప్పటం మరిచిపోయా మీరు ఇలానే 2010 మొత్తం సంతోషం గా నవ్వుతు,నవ్వులు పంచుతు, ఆనందముగా గడపాలని కోరుకుంటు. మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.



ఇట్లు

====

నలుగురి లో నాలుగోవాడు.

Gentlemen's agreement 1956

Gentlemen's agreement of Andhra Pradesh (1956)

The Gentlemen's agreement of Andhra Pradesh (1956) refers to a gentlemen's agreement that was signed between Telangana and Andhra leaders before the formation of the state of Andhra Pradesh in 1956. The agreement provided safeguards with the purpose of preventing discrimination against Telangana by the government of Andhra Pradesh. The alleged violations of this agreement are cited as one of the reasons for demands for separate statehood for Telangana

Agreement text


1. There will be one legislature for the whole of Andhra Pradesh which will be the sole law making body for the entire state and there be one Governor for the State aided and advised by the Council of Ministers responsible to the State Assembly for the entire field of Administration.



2. For the more convenient transaction of the business of Government with regard to some specified matters the Telangana area will be treated as one region.



3. For the Telangana region there will be a Regional Standing Committee of the state assembly consisting of the members of the State Assembly belonging to that region including the Ministers from that region but not including the Chief Minister.



4. Legislation relating to specified matters will be referred to the Regional committee. In respect of specified matters proposals may also be made by the Regional Committee to the State Government for legislation or with regard to the question of general policy not involving any financial commitments other than expenditure of a routine and incidental character.



5. The advice tendered by the Regional Committee will normally be accepted by the Government and the State Legislature. In case of difference of opinion, reference will be made to the Governor whose decision will be binding.



6. The Regional Committee will deal with following matters:

--Development and economic planning within the framework of the general development plans formulated by the State Legislature.



--Local Self Government, that is to say, the Constitutional powers of Municipal Corporations, Improvement Trusts, District Boards and district authorities for the purpose of Local Self Government or Village Administration.



--Public health and sanitation, local hospitals and dispensaries.



--Primary and secondary education.



--Regulation of admission to the educational institutions in the telangana region.



--Prohibition—Sale of agricultural lands.



--Cottage and small scale Industries, and Agriculture, Cooperative Societies, Markets and Fairs. Unless revised by agreement earlier this arrangement will be reviewed after ten years.



7. Domicile Rules : A temporary provision be made to ensure that for a period of five years, Telangana is regarded as a unit as far as recruitment to subordinate services is concerned; posts borne on the cadre of these services may be reserved for being filled up by persons who satisfy the domicile conditions as prescribed under the existing Hyderabad Mulki Rules. ( 12 years of Stay in Telangana area)



8. Distribution of expenditure between Telangana and Andhra Regions--- Allocation of expenditure with the resources of the state is a matter which falls within the purview of the State Government and the State Legislature.. Since , however, it has been agreed to the representatives of Andhra and Telangana that the expenditure of the new state on central and general administration should be borne proportionately by the two regions and the balance of income should be reserved for expenditure on the development of Telangana area, it is open to the state government to act in accordance with the terms of agreement in making budgetary allocations. The Government of India propose to invite the attention of the Chief Minister of Andhra to this particular understanding and to express the hope that it will be implemented.



9. The existing educational facilities including Technical Education in Telangana should be secured to the students of Telangana and further improved---



10. The cabinet will consist of members in proportion of 60:40 percent for Andhra and Telangana respectively, out of 40 % of Telangana ministers, one will be a Muslim from Telangana. If the Chief Minister is from one region the other region should be given Dy Chief Ministership.

Tuesday, December 29, 2009

ఆందోళనాంధ్ర ప్రదేశ్ - 2009

ఈ యేడు ఆందోళనలు జరిగినట్లు గా,నాకు తెలిసి ఈ దశాబ్దం లో మరే సంవత్సరం జరగలేదు అనుకుంటా?.ఒకే సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు వస్తే చాలా అరిష్టం అని చాలా మంది భావించినట్లే ఈ యేడు అంత చాలా ఆందోళన కరం గా సాగింది.

               జనవరి 7 సత్యం స్కాం తో మొదలైన మన రాష్ట్ర ఆందోళనలు ఈ సంవత్సరం అంతట ఏదో ఒక రూపం లో కనిపిస్తునే ఉంది. ఈ సంవత్సరం మనకు మొదటి ఆందోళన "సత్యం స్కాం".


జనవరి 7 శ్రీ రామలింగరాజు తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రాసిన లేఖ తో మన రాష్ట్రం తో పాటు మన దేశం మొత్తం తల దించుకోవల్సిన పరిస్తితి ఏర్పడింది."సత్యమేవ జయతే" అని గొప్పగా చెప్పుకునే మన దేశం లో "సత్యం" అంటే "మోసం" అనే పరిస్తితి కి వచ్చింది. అమేరికా లో ఏర్పడిన ఆర్దిక మాంద్యం మన దేశాన్ని,రాష్ట్రాన్ని ఒక్క కుదుపు కుదిపి ఎంతో మంది బడా బడా బాబులు తో పాటు మన రాష్ట్ర మద్య తరగతి ప్రజానికం వరకు ఆందోళనకు గురిచేసింది.

ధరలు ఇస్రో ప్రయొగించిన రాకెట్స్ లా ఒక పక్క దూసుకుపొతున్న తరుణం లో మన రాష్ట్ర,మరియు దేశ సార్వత్రిక ఎన్నికల తో ప్రజల పరిస్తితి మరి దయనీయం గా సాగింది.మంచో?చెడొ? అందరు అనుకున్నట్లు గా కాకుండ రాష్ట్రం లో,దేశం లో సుస్తిర ప్రభుత్వం ఏర్ఫాటు తో ప్రజలు ఊపిరి పీలుస్తున్న తరుణం లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించటం తో మళ్ళి ప్రజల లో భయం,ఆందోళన లు ఎక్కువ అయ్యాయి. ఆయన మరణించి 10 రోజులు కూడ కాకండానే జగన్ ను మ్య్ఖ్య మంత్రి ని చెయ్యాలి అని కొందరు చేసిన ఆందోళనలు , అల్లర్లు మన రాష్ట్ర ప్రజల్ని మరో మారు ఆందోళనలకు గురిచేసాయి.ఈ ఆందోళనలు జరుగుతు ఉండగానే ఉవెత్తున ఎగిసి పడిన వరదలు కర్నూలు,మహబూబ్ నగర్,కృష్ణ,గుంటూరు జిల్లాల్ని, మన రాష్ట్ర ప్రజల్ని మరింత ఆందోళన లోకి నెట్టాయి.


ఇవి అన్ని ఒక ఎత్తు అయితే Last but not Least అన్నట్లు గా నవంబర్ 30 నుండి తెలంగాణా అంశం మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఈ ఆందోళనలు మనల్ని ఎక్కడకు తీసుకువెళ్తాయో తెలియదు కాని ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రం హరితాంద్ర ప్రదేశ్ గానో,స్వర్ణాంద్ర ప్రదేశ్ గానో , సామజికాంద్ర ప్రదేశ్ గానో కాకుండ ఆందోళనాంద్ర ప్రదేశ్ గా మిగిలి పోయింది 

Friday, December 25, 2009

మతాలు వాటిని అనుసరించే మనుషులు



  మనుషులు ఎప్పుడు పుట్టారో ...మతం అప్పుడే పుట్టింది. అనాదిగా మానవుడు తను చేయలేని ప్రతి పనిని ఏదో ఒక శక్తి చేస్తున్నది,నడిపిస్తున్నది అని భావిస్తు వచ్చాడు.ఆ భావన కొన్ని రోజులకు నమ్మకం గా మారింది. ఆ నమ్మకం గురించి తన వాళ్ళాకు చెప్పి ఒప్పించాడు. అలా ఒకే నమ్మకం కలిగిన వాళ్ళు మేమంత ఒక మతం అన్నారు. వారందరు కలిసి ఆ శక్తి కి దైవం అని పేరు పెట్టారు. అప్పటి నుండి తనకు తెలియని పనిని చేశేది ఆ దైవమే అని భావించారు. ఆయనను పూజిస్తే (అనుసరిస్తే) మంచి జరుగుతుంది అని నమ్మారు. సాదారణం గా ఒకే ప్రాంతం లో ఉండే వారు,ఒకే వేషధారణ,ఒకే విధమైన భౌగోళీక పరిస్తితులు కలిగిఉంటారు.కాబట్టి వారు అలా ఒకే మతం గా జీవించారు.
మతం అనుసరించడం లేద పాటించడం అంటే ఒక శక్తి మీద నమ్మకం కలిగిఉండటం.ఎలా అనుసరించాలో చెప్పటానికి కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. మతం ఎదైన మంచి ని బోధిస్తుంది,మంచి మార్గము లో నడవమంటుండి. రాముడు అయిన అల్లా అయిన ఏసు అయిన మంచి మార్గము లో నడిచారు కాబట్టి వాళ్ళు దైవం గా కొలవబడుతున్నారు. దైవం ఏమి చేసిన మంచే చేస్తాడు అని మనం బావిస్తున్నాము కాబట్టి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు దైవం తో సమానం. మతం అంటే దైవాన్ని చేరే మార్గం. ఎవరి మార్గం వారిది,అలాంటప్పుడు మన మార్గమే(మతమే) గొప్ప అనుకొవడం తప్పు. ఆ తప్పుని అందరిచేత ఒప్పించడం కోసం తమదే గొప్ప మతమని,మా మార్గం అనుసరిస్తే డబ్బులు ఇస్తామని,లేద కాలిజి లో సీట్ ఇస్తామని చెప్పి వారికి ఆశ చూపి వారిని మార్గం మార్చుకోమనడం ఇంకా పెద్ద తప్పు.ఏ దైవం ఎప్పుడు తప్పుని ప్రోత్సహించదు. ప్రతి ఒక్కరి దైవం చేసిన విధంగా మంచి ని ప్రచారం చేయండి అంతే కాని మతాన్ని కాదు.ఏ మార్గానికి విలువలేదు కేవలం గమ్యానికే విలువ. అది తెలిసిన నాడు ఏ మార్గమైన ఒకటే మనం దేనికోసమో మన మార్గాన్ని మరల్చుకోవల్సిన అవసరం ఉండదు.మతం కోసం కోట్లాటలు ఉండవు.

Thursday, December 24, 2009

ఇక నుండి ... నన్నడిగితే .....?


ఇక నుండి విషయం ఏదైన ... సమయం ఏదైన.. సందర్బం ఏదైన.... నా వర్షన్ .. నన్నడిగితే .... నా వర్షన్ నన్ను అడిగితే లో మాత్రమే ....

Tuesday, December 22, 2009

ఎంకీ's Marriage సుబ్బీ's Death

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కి వచ్చింది అన్నట్లు తయారు అయింది మన రాష్త్రం సంగతి. ఏమని K C R తెలంగాణ కోసం దీక్ష మొదలుపెట్టారో తెలియదు కాని ఆ రోజు నుండి మన ప్రజల కష్టాలు మొదలు అయ్యాయి.10 రోజులు హైదరబాదు బందులు రాస్థా రోఖో ల తో తల్లడిల్లింది ఇప్పుడు ఎమో "లగడపాటి" గారి రగడం తో మళ్ళి రాష్ట్రం మొత్తం బందులు రాస్థా రోఖో లతో అట్టుడుకుతుంది. దీని వల్ల ఎవరు లాభ పడతారో తెలియదు కాని కాలేజి లు మూతపడి,పరీక్షలు వాయిదపడి మెరిట్ విద్యార్ధులు ఎంతో నష్ట పోయారు. ఈ విలువైన కాలాన్ని వాళ్ళాకి మళ్ళి అందించగలరా? ఎప్పుడో, జన్మకో శివరాత్రి లాగ పడె గ్రూప్ 2 ఈ గొడవల మద్య వాయిద పడింది. ఈ పరీక్షని తమ జీవిత పరీక్షలా భావించి సన్నద్దం అయిన వాళ్ళ పరిస్థిథి ఏమిటి? అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయిన R.T.C పరిస్థితి ఏమిటి? R.T.C కి వచ్చిన నష్టాలు చార్జీలు పెంచో ఉన్న రూట్లు తీసివేసో పూడ్చుకోగలదు,గ్రూప్ 2 మళ్ళి పెడతారు అనుకుందాము కాని రెక్క ఆడితే గానిడొక్క ఆడని రోజువారి వారి కూలీల నిన్నటి ఆకలి ఇవాల తీరుస్తారా? సరైన సమయం లో వైద్యం అందక మరణించిన వారి ప్రాణాలు తిరిగి పోస్తారా? మనుషల భావోద్వేగాలని రెచగొట్టి వారి ప్రాణలని పణంగా పెట్టిన(శ్రీకాంత్)లాంటి వారి ప్రాణాల్ని తిరిగి సాదించగలరా?

Thursday, December 17, 2009

ఇప్పుడు టెస్టుల్లో మనమే నంబర్ వన్



100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన  సంవత్సరా  మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది  అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం  వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం "  మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము


Wednesday, December 16, 2009

A.P.S.R.T.C నష్టం 50 కోట్లు [ 29-11-2009 to 14-12-2009]






A.P.S.R.T.C నష్టం 50 కోట్లు. 50 కోట్లు పెద్ద నెంబర్ ఎమి కాదు కాని దీని లో ఒక బయంకరమైన నష్టం ఉంది.ఈ డబ్బులు ఎవరివి? మన క్షనికావేశం లో తగలబెట్టిన , పగలగొట్టిన బస్సులు మరమత్తుల కోసం వినియోగించే ధనం ఎవరిది? అసలే కొత్త బస్సులు కొనడానికి కావల్సిన ధనం లేక అవస్థ పడుతున్న మన ఆర్.టి.సి. వీటి మరమత్తుల కోసం డబ్బులు ఎక్కడ నుండి తెవాలి? మన హైదరబాదు జనానికి ఉన్న బస్సులు చాలట్లెదు కొత్త బస్సులు కావాల్సిన పరిస్థితిలలో మన ఈ ఉద్వేగలకు ఉన్న బస్సులు కూడ తిరగకపోతె ఎవరికి నష్టం ? నాయకులకా? కాదు వాళ్ళు వాళ్ళ కార్ల లో తిరుగుతారు? మరి ఆర్.టి.సి. కా ? కాదు వాళ్ళు ఉన్న బస్సులు నే తిప్పుతారు ? మరి నష్టం ఎవరికి? రేపు పొద్దున్నే కాలేజి కి పోయే మీ తమ్ముళ్ళకి, చెళ్ళళ్ళకి , ఉద్యోగం కోసం సిటి బస్సు ఎక్కాల్సిన నీకు ? రేపు ఈ నష్టం పూడ్చటం కోసం చార్జిలు పెంచితే కష్టం ఎవరికి? మిమ్మల్ని రెచ్చగొట్టె నాయకులు హ్యాపి గా A/C కారు లో తిరుగుతారు? మరి మీ సంగతి ఎమిటి?

బాంచన్ మీ కాళ్ళు మొక్కుతం మా తెలంగాణా విడువుండ్రి

ఆంధ్ర అన్నా,అక్కా లారా బాంచన్ మీ కాళ్ళు మొక్కుతం మా తెలంగాణా విడువుండ్రి. మా తెలంగాణ రాష్త్రం మాకు కావలే. 50 ఎళ్ళ సంది మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి  పోలీస్ వోళ్ళ చేతిలో దెబ్బలు తిని,మమ్మల్ని మేము ఆకలితో మాడ్చు కొని ,మంటల తో కాల్చుకొంటే, గిప్పుడు మాకు అనుకూలం గా పైనోడు ఒక్క మాట చెప్పినందుకు ఇంత లొల్లి చెస్థారా ? ఎమన్నా మేము మనుషలం గామా? మేము చల్లగా బతగ్గూడదా ?. 50 ఎళ్ళ సంధి మీరు మమ్మల్ని అణగదొక్కుతున్నారు ? ఎన్ని రోజులన్న మేము బరించేది? మేము మీతో ఉండం మొర్రో అంటంటే మీరు ఇయ్యాలా సమక్యాంద్ర అంటు ఈ గొడవలేంది ? రోజు తినేటొడికి ఆకలి బాధ ఎం తెలుస్తది?. మీ స్వార్ధం కోసం మీరు ఇయ్యాల గొడవ చేస్తూ మమ్మల్ని స్వార్ధ పరులంటరా? మేము మిమ్మల్ని మీ ధన బలాన్ని తట్టుకొలేకనే కదా మా తెలంగాణా మాకు కావాలి అంటన్నాం. మొదట నుంచి మీరే మా కానికి వచిర్రు. హైదరబాదు ,హైదరబాదు అంటరు ఎందన్న? ఎమి చెసారు హైదరబాదు కి మీరు ట్రాఫిక్ పెంచడం తప్ప ? గోల్కొండ మీరు కట్టారా? చార్మినార్ మీరు కట్టరా ? చివరికి అసెంబ్లి హాలు , రైల్వే స్టేషన్లు కూడ మీరు కట్టిన్వి కాదు. ఉత్త పున్యానికి మా భుములు లాక్కొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మీరు కోట్లు దొబ్బుతు హైదరబాదు ని అభివ్రుద్ది చేసాం అంటరేమన్న? ఇదే ఇంత జాగా మీ విజయవాడ, కర్నూలు లో ఇంత తక్కువ రేటు కి దొరుకుతాయా అన్నా? మా హైదరబాదు పేరుచెప్పి మీరు అబివ్రుద్ది అయ్యురు మేం గట్లనే ఉన్నం. గిన్ని దినాలు మిమ్మల్ని నమ్మినం ఇక మీరు ఏం ఒర్లకుండ్రి. మా తెలంగాణా మాకు కావలే . మమ్మల్ని మేమే పాలించికుంటం. మా సర్కారు కొలువులు మాకు కావలే. ఇగో ప్రైవేట్ కొలువులు బయట రాష్ట్రల్లొ చేయట్లె .. బెంగళూరు లో , పునే లో అమెరికా లో మనొళ్ళు పని సెయట్లలేద అంట ? ఆడ భూములు కొనట్లేద అంట? గట్లనే హైదరబాదు లో గూడ. మీరు మా భూములు లాక్కున్నట్లుగా మేం మీ కాడ లాక్కోం. హైదరబాదు లో ఊండండి మీ కొలువులు మీరు సేసుకుండి కాని హైదరబాదు తెలంగాణా లొనే ఉంటది ? తెలంగాణా మటుకు ప్రత్యెకంగా ఉంటది.
అన్నలారో, అక్కలారో మా ప్రియమైన విద్యార్ధులార యాద్జెయటం మరిచిన మీ నాయకులు అంత (వైస్, చంద్రబాబు,చిరంజీవి) పచ్చి మోసగాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం ఎన్నో చెబుతారు మా తెలంగాణ రాష్ట్రంలో(ఇయ్యాల కాపొతే రెపు అయిన) ఊరు ఊరు వాడ వాడ తిరిగి ఓటు వెస్తే తెలంగాణా కి మద్దతు ఇస్తం అని చెప్పి తీర ఓటు వేసినాక గిప్పుడు నాటకాలు ఆడుతుంద్రు. ఇయ్యాల మమ్మల్ని ముంచిర్రు.రేపు మిమ్మల్ని ముంచరు అని గ్యారింటి ఎంది ? మీరు కొంచెం హుషారు ఉండాలే. జై తెలంగాణా ... జై జై తెలంగాణా



Wednesday, December 9, 2009

మీకు తెలుసా సెక్షన్ 144 గురించి?


                                                                                                  

మన దేశము లో ఏ మాత్రం అల్లర్లు చెలరేగిన ప్రభుత్వం ముందు చేసే పని 144 సెక్షన్ ప్రకటించడం. సెక్షన్ 144 ఉంది అని అందరికి తెలుసు కాని అసలు అది అంటే ఏమిటీ? ఆ సమయం లో మనం ఏమి చేయవచ్చు ? ఏమి చేయకూడదు ? తెలుసుకుందాము .
               భారత శిక్షాస్మౄతి 144 ప్రకారము, ఏ ఒక్కరు, ప్రాణానికి హాని చేయగలిగే ఆయుధాలు [మారణాయుధాలు] కలిగి ఉండటం నేరం. మరియు 3 లేద అంతకన్న ఎక్కువమంది గుమికూడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేయడం నేరం.
                   ఈ నేరాలు గనుక రుజువు అయితే అట్టి వారికి గరిష్టము గా 2 సం:: కారగారము, జరిమానా, కొన్ని సంధర్భాలలో రెండును విధించవచ్చు.

మరి కొన్ని సెక్షన్స్ కొరకు చూడండి.మరి కొన్ని సెక్షన్స్ కొరకు నన్ను క్లిక్ చేయండి

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి