Saturday, July 21, 2012

తొలిచూపు, తొలివలపు....ఇంకా జీలకర్ర బెల్లం

తొలిచూపు   తొలివలపు  Love at first Site ...
ఈ  పదములు లేకుండా , ఏ  సినిమా ఉండదు అనుకుంటా ...ఎందుకంటే  వాటికీ అంత క్రేజ్ ఉంది .. యువతరం లో ..
నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితం లో అది జరుగుతుంది , మీకు తెలియకుండా జరిగి ఉంటుంది. కాదంటారా ? చదవండి .. నాకు చెప్పండి ... తోలి చూపు ... తోలి వలపు మీకు ఉందొ లేదో ...


మీకు పెళ్లి అయ్యిందా? నాకు  కొత్త గ పరిచయం చేయిన సహోద్యోగి ప్రశ్న వేసాడు?  
నా  సమాధానం హ అయ్యింది. 


అతని తరవాతి ప్రశ్న  ప్రేమ పెళ్లి ? పెద్దలు నిర్నయిచినదా  ..?
సమాధానం . పెద్దలు  నిర్ణయించిన ప్రేమ పెళ్లి ... 


"వావ్" అయితే మీరు పెద్దల్ని ఒప్పించార మీ పెళ్లి కి?
 లేదు వాళ్ళు మాకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చాక ప్రేమించా


అంటే అందరి లాగా నే మీది మాములే అన్న మాట? ప్రేమ , తొక్క అంత కవరింగ్ ...
కాదు,నాకు తొలిచూపు, తోలి వలపు జరిగింది, కాబోతే కాలేజ్ లోనో , ఆఫీస్ లో నో.... దొంగ చాటుగ కాదు ..


అబ్బ చ? నిజామా ? ఇంకా చెప్పు ... వాడి మాట లో వెటకారం నాకు అర్ధమయ్యింది.
నా సమాధానం .వాడి కి అర్ధమయ్యేలా ఉండాలి .అనుకున్న


నువ్వు ఎప్పుడైనా శుభలేఖ చూసావా ? అందులో బాగా ముఖ్యమైనది ఏమిటి ?   ఇది నా  ప్రశ్న
Ya, ముహూర్తం 
అప్పుడు, అంటే ఆ టైం కి కరక్ట్ గా ఏమి  చేస్తారు ?
తాళి కడతారు , ఓహ్ నో .. జీలకర్ర, బెల్లం పెడతారు 


yes, అప్పటి దాక , ఎదురు ఎదురుగ కూర్చోబెట్టి , ఇద్దరి మధ్య లో తేర ఒకటి ఉంచి, జీలకర్ర బెల్లం తల మిద ఉంచి అప్పుడు తెర తీస్తారు..ఎందుకో తెలుసా? మన మాడు మీద భ్రహ్మ రంద్రం ఉంటుంది, అది ఎప్పుడు మూసుకొని ఉంటుంది, ఎప్పుడయితే , అది తల మిద పెడతారో అది తెరుచుకొని మన ఎదురుగ ఉన్న వారి రూపం మిద తొలిచూపు లోనే తొలివలపు చిగురిస్తుంది .. అది జన్మ జన్మలకు గుర్తు ఉంటుంది.

అందుకే మన పెళ్ళిళ్ళు ఒక్క రోజు కూడా పరిచయం లేని వాళ్ళ మధ్య కూడా 7 జన్మలు మీరే కావాలి అనేలా చేస్తుంది.. అర్ధమయ్యింది అనుకుంటా ?

ఇప్పుడు అర్ధమయ్యింది,  పెళ్లి లోని మ్యాజిక్ అండ్ మ్యూజిక్

మీరేమి అంటారు ?

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి