Monday, January 25, 2010

ఇదేమి న్యాయం ............

నేను నిన్న ఆదివారం కావడం తో ..సినిమా కి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అని ..మా అన్న,వదిన లతో కలిసి "అదుర్స్" అనే సినిమాకి వెళ్ళాను. సినిమా మొదలయిన 5,10 ని"లు నుండి నా మనసు లో ఒకటే ఆలొచన... ఒకటే బాధ. సినిమా మొత్తం నా వాళ్ళ గురించి,మా వేషధారణ గురించి అవహేళన చేస్తున్నారు అని ఒకటే బాధ. "నాకు తెలిసి ఒకరిని చూసి మనం నవ్వుతున్నాము అంటే వారిని మనం అవహేళన,హేళన చేస్తున్నాము అనే". ప్రతి సన్నివేశం లోను మా నుండి వెకిలి నవ్వులు పుట్టిచ్చడనికి ప్రయత్నించారు అనే బాధ.







అప్పుడెప్పుడో "కంత్రి" సినిమా రిలీజ్ అయిన కొత్తలో అనుకుంట .. కేవలం ఒకే ఒక సన్నివేశం లో అది కూడ అంబేద్కర్ విగ్రహం చూపించారు అని అవి కేవలం దళిత వాడల్లోనే ఉంటాయి అని ..వారికి వారే ఊహించుకొని శ్రీ మందా కృష్ణ మాదిగ (..పేరు పూర్తిగ పైకి చదవకండి .. కేసు వేసి బొక్కలో తోస్తారు) గారు నాన గొడవ చేసి డైరెక్టర్ చేత సారి చెప్పించి ఆ సదరు సన్నివేశం తీసివెసే దాక మీడియా తో కలిసి బీబత్సం సృష్టించారు.

ఏమి ఇదేమి న్యాయం? సినిమా మొత్తం మా గురించి ఇలా మాట్లాడతారు ..ఇలా చేస్తారు .. అలా ఉంటారు అని వెకిలి చేష్టలు చేయిస్తే ఎవరు మాట్లడరే ..? ఎందుకు అంటే వారు 22% ఉన్నారు ఓట్లు రాలవు అనా ..మేము అయితే కేవలం 4% ఉన్నారు వెస్తే ఎంత వేయకపోతే ఎంత అనా? అయిన కథా రచయతలకి మమ్మల్ని కించపరచకుండ సినిమా కథలు రాయటం రాదా? కామెడి అంటే ఇలా ఒక సామజిక వర్గం వారిని కించపరచడమేనా? ఇది ప్రతి ఒక్కరు సిగ్గు పడాల్సిన విషయం. సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఇలా ఒక సామాజిక వర్గానికి చెంది న వారిని ఇలా అవహేళన చేయటం తగునా ..? ఇదేమి న్యాయం భగవంతుడా ?

6 comments:

విరజాజి said...

భలేవారండీ! ఈరోజు కొత్తగా ఎగతాళి చేసేదేముంది? బ్రాహ్మలని ప్రతీ సినిమాలో అవహేళన చేసి చూపుతూనే ఉన్నారు. "సీమ శాస్త్రి" అనే ఒకానొక సినిమాలో అయితే అస్సలు ఆ వెకిలి హాస్యాన్ని చూసి తట్టుకోలేకపోయాను. దాని ముందు ఇదేముంది....? అయినా దళితులని కించపరిస్తే తప్పు కానీ.... బ్రాహ్మణులని కించపరచడం అందరి హక్కూ కదా....... !!

నలుగురి లో నాలుగోవాడు said...

విరజాజి గారు నిజం చెప్పారు. ఆ సినిమా నేను చూసాను చాలా సినిమాలలో చాలా రోజుల నుండి జరుగుతుంది. దీనికి అంతం ఎప్పుడో ...ఆ దేవుడే కే తెలియాలి.

Saahitya Abhimaani said...

అవును ఈ చెత్త సినిమాని పిల్లల గొడవ వల్ల నేను చూడవలసిన ఖర్మ పట్టింది. ఏమిటి అది సినిమానా. కథేమన్న ఉందా. ఏమిటా గోల సన్నివేశాలు. అవన్ని కలగలపుచేసి సినిమా అంటారా పైగా పొగరుమోత్తనంగా ఆ పేరా!! అటువంటి సినిమాలో నటించినందుకు ఆ మనుష్యులందంరూ సిగ్గుపడాలి (అదేమిటో తెలిస్తే). తనికెళ్ళ భరణి బ్రాహ్మడేకదా. వాడికేమి రోగం అందులో నటించటానికి. డబ్బులిస్తే ఏ వేషం పడితే ఆ వేషం వెయ్యటమే. మండలధీశుడులో వేషం వేసినందుకు కోట శ్రీనివాసరావును విజయవాడ రైల్వే స్టేషన్లో కిందపడేసి తన్నారుట. కొట్టింది ఎవరు? కొట్టించింది ఎవరు? అందరికి తెలుసు ఎవరో. అటువంటి పని చెయ్యటానికి మనకు మనస్సూ ఒప్పదు, దమ్మూ లేదు. ఏమి చేస్తాం భరించాలి. ఖర్మ తప్పుతుందా నాయనా!!!! పరిస్థితి అది.

మన బ్రాహ్మణ సంఘాలన్ని ఒకళ్ళతో ఒకరు కొట్టుకోవటం మాని, ఇటువంటి చెత్త సినిమాలు వచ్చినప్పుడు, కోర్టుకు వెళ్ళి స్టే తీసుకు రావాలి.

ఏది ఏమైనా సినిమా అట్టర్ ప్లాప్ అయినందుకు నేను హర్షం ప్రకటిస్తున్నాను.

minabe said...

Manadaakaa vaste
I sympathize and feel for your feelings.
This is entertainment, leave a blind eye and deaf ear to these scenes.
Didn't we laugh and enjoy when they portrayed reddys as factionists, didn't we enjoy the East Godavari language as comedy language or the north andhra language for just servent maids....
Have a big heart to embrace many more in the future..
yes, nobody can touch 36s and survive in this society.
you don't want to throw a stone in mud.

నలుగురి లో నాలుగోవాడు said...

@Siva Thanks for your comment

మన వాళ్ళ లోనే ఐకమత్యం లేనప్పుడు ఇక ఎవరు ఏమి చెస్తారు లెండి. అయిన మిగిలిన వర్గాలకి చందిన వారు చేసే గొడవలకి ఇచ్చేఅంత ప్రాముఖ్యత మన వారకి ఇవ్వరు కదా ఈ మీడియా వారు. మీకు గుర్తు ఉందో లేదో "ఆజా నచలే" మాదురీ దీక్షిత్ రీ ఎంట్రి సినిమా లో టైటిల్ సాంగ్ గురించి ఎంత హడావుడి చేసింది మీడియా ?

నలుగురి లో నాలుగోవాడు said...

Dear minable

మీరు అన్నది నిజమే కాని అది కొంత వరకే దేనికి అయిన ఒక హద్దు ఉండాలి. రెడ్డి కులస్తులు ఫాక్షనిజం చేసిన సినిమలు అన్నిటి లోను మరో రెడ్డి కులస్తుడే హీరో. మరియు వారు ఎంత రాయలసీమ పౌరషం గురించి చెప్పుకుంటారు కాని ఎక్కడ రెడ్డిజం గురించి కాదు. గోదావరి జిల్లాల హాస్యము ఎవరిని బాదపెట్టదు ఎందుకు అంటే మరి నిజం బాష గురించి ఎన్ని సినిమాలు చేయలేదు. ప్రదేశం వేరు ఒక సామాజిక వర్గం వేరు. అయిన కూడ మా వారే డబ్బుల కోసం అంత హీనంగా నటిస్తున్నప్పుడు (తనికెళ్ళ భరణి) వేరే వారిని నిందించి ప్రయోజనం ఏముంది. అదే పాత్ర లో వేరే మతాలకి చెందిన వారి(ఏ క్రిస్టియన్ ఫాదర్) గ వేయమనండి అప్పుడు ఇప్పటిలా "సినిమాని సినిమాలా చూడండి" అని మీరు కూడ అనే సాహసం చేయరు.
నాకు బాగా విన్నట్టు గుర్తు ఎప్పుడో ఏ సందర్బం లోనో ..ఇక ఏ సినిమాలోను ఏ కుల ప్రస్తావన రాకూడదు కోర్ట్ ఒక తీర్పు ఇలా ఇచ్చినట్లు.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి