Wednesday, December 22, 2010

కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం

కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం .. ఏమి చెయ్యాలి ... ఎలా మొదలు పెట్టాలి.
కొత్త సంవత్సరం .. పాత సంవత్సరం లా పాత లా ( రొటీన్) ఉండకూడదు .. కొత్తగా కొత్త పనులు మొదలు పెట్టాలి.


ఇవి రాబోయే సంవత్సరం లో నేను కొత్తగ మొదలు పెడదాము అనుకునే ....సంకల్పాలు ..

1) మా అమ్మ, నాన్న చిన్నప్పటి నుండి చెవి లో ఇల్లు కట్టుకొని మరి చెప్పే మాట .. పొద్దున్నే లేవాలి....

ఇప్పటి దాక ..పొద్దున అంటే వేకువ జామున 8:30, 9:00 అనుకునే నేను ... వచ్చే సంవత్సరం నుండి పొద్దున్నే అంటే 7:30 అని మెదటి బిల్లు గా ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది అని చెప్పుటకు సంతసించడమైనది..        


2)
అరే ఒకసారి అద్దం లో చూసుకో.. బద్దకం ఎక్కువై .. రోజు రోజు కి.. కొబ్బరి బోండం లా తయారు అవుతున్నావు .. అని మా హితులు ..సన్నిహితులు ..కోరడం తో .. అందులోను ఇలా అయితే పిల్ల ని ఎవ్వరు ఇవ్వరు అని పలురకాలు గా భయాందొళనలకు గురిచేయడం వలన

వచ్చే సంవత్సరం నుండి .. క్రమం తప్పకుండ "జిమ్మ్ కి" వెళ్ళడం లేద అందుబాటు లో ఉన్న టీటీ ..వాలీబాల్ వంటి ఆటలు ఆడి అయిన సరే శరీర సౌష్టవం కాపాడుకుంటాను అని మీ అందరి ముందు వాగ్దనం చెస్తున్న..


3) అరే నువ్వు ఏ పెళ్ళాం కాకి, పిల్లలు కాకులు లేని ఏకాకివి ..నీ ఖర్చులు చూస్తే ..
హైదరబాద్ లో  ఒక మంచి ఏరియా లో ఒక చిన్న కుటుంబం చింతలు లేకుండ ఒక నెలంత జీవించడం తేలిక అని మళ్ళి నా హితులు సన్ని హితులు కోరడం ....

మీ ముద్దుల కొడుకు దుబారాలు ఎక్కువ అయ్యాయి అని ..వార్తలు "టీవి9" వాళ్ళు లేకుండనే ఇంట్లో ప్రాదేశిక వార్తలు గా ప్రసారం అవ్వడం వల్లన ..              
                            
ఇలా అయితే నీ .. "ఏ టి యం" కార్డు తీసుకొని పాకెట్ మని లాంటి పాత స్కీములు కొత్తగా మొదలు పెడతాము అని అధిష్టానం నుండి హెచ్చరికలు రావడం తో ...

వచ్చే సంవత్సరం నుండి ప్రతి పైస ఖర్చు పెట్టెముందు .. ఎందుకు ..? అవసరమా? అని రెండు ప్రశ్నలు సంధించుకొని వాటికి సరియైన సమాధానం వచ్చిన పిమ్మట మాత్రమే ఖర్చు చెయ్యాలని ..కొత్త నిభందన ఎర్పాటు చేయడమైనది .. అని విన్నవించుకుంటున్నాను


చివరగా

అధిష్టానం దగ్గర బుద్దిమంతుడు అని పేరు తెచ్చుకున్న నేను ..ఇప్పటి వరకు గడిచిన 26 సంవత్సరములు లాగానే ..ఈ వచ్చే సంవత్సరం కూడ ..ధూమపానం ..మధ్యపానం .. ఇంకా ..ఎమైన మంచి అలావాటులు కి దురంగా ఉండి .. అధిష్టానం నమ్మకాన్ని .. వమ్ము కానియకూడదు అని ప్రతిఞ్ చేయుచున్నాను...



పైన పెర్కొనబడిన నా సంకల్పలు ..కేవలం నా స్వార్జితం అని ఎవరి నుండి తస్కరించనవి కావు అని ... ఒకవేళ ఇవే సంకల్పాలు మీరు చేసిఉంటే దానికి నేను .. నా బ్లాగ్ ఎవిధముగా బాద్యుడిని కాను అని .... ఒకవేళ నా సంకల్పాలు మీకు నచ్చి మీరు కూడ పాటించిన .. నాకు ఏమి రొక్కం .. ఏ రుపం లో కూడ కట్టవలిసిన అవసరం లేదు ...అని విన్నవించుకుంటున్నాను 

ఇట్లు 

నూతన సంవత్సర శుభాకాంక్షల తో 

మీ

నలుగురి లో నాలుగో వాడు. ..

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి