Wednesday, January 13, 2010

అ-అరిసె, ఆ - ఆమ్మ(పెద్దమ్మ)


అ- అమ్మ అనగానే ప్రేమా,మాదుర్యం,ఆప్యాయత అని ఎలా తెలుస్తుందో అలానే సంక్రాంతి పండగ అంటే భోగి పండ్లు,గొబ్బెమ్మలు,ముగ్గులు ఇంకా గుర్తువచ్చిందా? నోరు ఊరుతోందా ? అదేనండి అరిసెలు. హా! పలికితేనే నోరు అంత తియ్యగ అవుతుంది. ఇంకా తింటుంటే ఆహా ! నా రాజ ! .. మరి ఇంక ఏ- స్వీట్ దాని దక్కరకు రాదు. మనలో అరిసెలు చేయటం రాని వారు ఉన్నారేమో కాని తినడం ఇష్టం లేని వాళ్ళు ఉండరు అంటే అతిసోయక్తి కాదు. నాకు అరిసె అన్న, సంక్రాంతి అన్న ముందు గుర్తుకు వచ్చేది మా ఆమ్మ.
     నాకు ఇంకా గుర్తు ఉంది.ప్రతి సంక్రాంతి పండగ కి కొత్తపాలెం (వెలది కొత్తపాలెం,చందర్లపాడు (మ),కృష్ణ(జి) మా సొంతూరు లేండి ) వెళ్ళడం. మేము వెళ్ళగానే మాకోసమే ఎదురు చూసే ఆమ్మ(కొంత మంది పెద్దమ్మ అని కూడ అంటారు),ఆమ్మ వేసే రంగు రంగుల ముగ్గులు, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు,వాటి మీద చల్లే బంతి పూలు , పొలం గట్ల నుండి కోసుకు వచ్చే రేగ్గాయలు నిజం గా మా మేము ఉండే వీది వైపు వచ్చి న వారు ఎవరైన సరే కళ్ళు తిప్పే వారు కాదంటే నమ్మండి.


మేము వెళ్ళిన రోజు నుండి మా ఆమ్మ పెట్టే పరుగులు,ఉరుకులు, మా చిన్నోడి కి అవి అంటె ఇష్టం ,ఇవి ఆంటే ఇష్టం అని చెప్పి తను చేసే వంటలు , స్వీట్లు . నేను నిజం గా (పెట్టి పుట్టాడు ఆంటారు చూడండి) అంత కన్న ఎక్కువ అన్నమాట. ఇంకా తను భోగి కి రెండు రోజుల ముందు అరిసెలు చేసేది.నన్ను పక్కన కూర్చొ పెట్టుకోని మా నాన్న చిన్నప్పటి విశేషాలు, మా అమ్మ చిన్నప్పటి కబుర్లు అని చెబుతూ బియ్యప్పిండి రోట్లో దంచుతు .... బెల్లం పాకం పడుతు మద్య మద్య లో మా అమ్మ కి .. లక్ష్మి ఇలా చెయ్యి .. అలా చెయ్యి అని ట్రైనింగ్ ఇస్తూ ...ఇంకా నెయ్యి లో వేయిస్తూ .. ఇవి కాస్త వత్తరా అని చిన్న హెల్ప్ అడిగి .. ఇవ్వాల పని అంతా మా వాడే చేసాడు అని ఇంటి ముందు అరుగు మీద కుర్చొని, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి చెప్పేది. ఇంకా కనుము పండగ అయిపోగానే మేము ఊరికి బయలు దేరగానే ..మళ్ళి మా కోసం ఉగాది పండగ ఎన్నిరోజులకి వస్తుందో అని లెక్కలు వేసి, చేసిన పిండి వంటలు అన్ని ఒక సంచి లో పెట్టి . బాగ చదువుకో అని ఒక వందో, 2 వంద లో జేబులో పెడుతు కంటి నిండా నీళ్ళతో .. మనసు నిండా ప్రేమ తో చేయి ఊపుతు ఉగాది కి తప్పకుండ రార అని టాటా చెప్పేది.

 ఆమ్మ ఇప్పుడు బౌతికము గా మా మద్య లేక పోయిన, నేను చూసే ప్రతి ముగ్గు లో ఉంది,నాకు ఇష్టమైన అరిసె లో ఉంది. నా గుండెలు నిండా ఎప్పుడు ఉంటుంది

4 comments:

మధురవాణి said...

బాగున్నాయండి మీ సంక్రాంతి జ్ఞాపకాలు.మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

నలుగురి లో నాలుగోవాడు said...

చాలా థాంక్స్ అండి .. మీకు,మీ ఫ్యామిలి కి కూడ సంక్రాంతి శుభాకాంక్షలు

సృజన said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

నలుగురి లో నాలుగోవాడు said...

srujana gAru .. మీకు,మీ ఫ్యామిలి కి కూడ సంక్రాంతి శుభాకాంక్షలు

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి