Thursday, September 24, 2009

దసరా [వికీపీడియా నుండి]



దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
              దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది

మహిషాసురమర్ధిని
కలకత్తా ఉత్సవాలలో ప్రతిష్టించిన మహిసాసుర మర్దిని దుర్గామాత విగ్రహంబ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.
శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దిము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.

నరాత్రులు నవరూపాలు


నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు

నవదుర్గలు             
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.

గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత "నవదుర్గ". గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.

1.ప్రథమం శైల పుత్రీతి

2.ద్వితీయం బ్రహ్మచారిణీ

3.తృతీయం చంద్ర ఘంటేతి

4.కూష్మాండేతి చతుర్థకం

5.పంచమం స్కందమాతేతి

6.షష్ఠం కాత్యాయనీతి చ

7.సప్తమం కాలరాత్రీతి

8.మహాగౌరీతి చాష్టమం

9.నవమం సిద్ధిదా ప్రోక్తా

నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

శైలపుత్రి
బ్రహ్మచారిణి
చంద్రఘంట
కూష్మాండ
స్కందమాత
కాత్యాయని
కాళరాత్రి
మహాగౌరి
సిద్ధిధాత్రి



Saturday, September 12, 2009

వన్ డే ల్లో మనం నంబర్ వన్



100 కోట్ల భారత్ ప్రజలు అందరు ఆనందించవలసిన క్షణాలు . ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురుచూస్తున్న నంబర్ వన్ స్థానం, ధోని నాయకత్వం లో మనం సాధించాం; మారిన "ఐసిసి" నిబందనల ప్రకారం గడిచిన 2 సంవత్సరాలలో మన ఘణాంకాల ప్రకారం ఆస్ట్రేలియ ని ,దక్షిణాఫ్రికా ని వెనక్కి నెట్టి మనం మొట్టమొదటి సారి మనం నంబర్ వన్ అయ్యాం . ఎప్పుడు వక్తిగతముగా నంబర్ వన్ లో ఉండే మన ఆటగాళ్ళు సమిష్టిగా భారత్ ని నంబర్ వన్ లో నిలబెట్టారు . ఇది  అంతా ఒకరు ,ఇద్దరు ఆటగాళ్ళ వల్ల నో కేవలం ధోని నాయకత్వం  వల్లనో సాధ్యం కాలేదు కేవలం తుది 11 మంది సమష్టి గా ఆడితేనే ఇది ఈనాడు సాధ్యం అయ్యింది . పెద్దలు అన్నట్లు "నంబర్ వన్ అవ్వటం తేలికనే దానిని నిలబెట్టుకోవటం కష్టం "  మన ధోని నాయకత్వం లోని సీనియర్ మరియు జూనియర్ ఆటగాళ్ళ అందరి మీద ఇంకా బాధ్యత పెరిగింది . ఇక మీదట కూడ వాళ్ళు మన అందరి కలలు నిజం చేస్తు 2011 వరల్డ్ కప్ ని కూడా సాదిస్తారు ని కోరుకుందాము

కొత్త CM రేస్ లో ఎవరు ?

 జగన్ కోసం అధిష్టానం దగ్గరికి పరిగెత్తిన మన నాయకుల కి సోనియ గాంధి బాగానే గడ్డి పెట్టినట్లు ఉంది మళ్ళి ఎవరు నోరు ఎత్తట్లేదు. ఆమె ప్రకారం మన కొత్త CM రేస్ లో జైపాల్ రెడ్డి , డి ఎస్ , కేశవరావు , రోశయ్య మరియు జగన్ ఉన్నారు అనే ఊహాగానాలు వినవస్తున్నాయి.ఈ సందర్బం లో వాళ్ళ ప్రజా ప్రస్థానమేమిటో ఒక సారి పరిశీలిద్దాము.
                    ముందుగా రోశయ్య,   1933 జూలై 4 న గుంటూరు జిల్లా వేమురు లో జన్మించారు. ఆయన 1968 ,1974,1980 లో MLC గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి సారి 1979 లో కాబినెట్ మినిష్టర్ అయ్యారు . మొత్తం 13 సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 1995 నుండి 1997 వరకు PCC  ప్రెసిడెంట్ గా పనిచేసారు . ఆయన ఒక సారి MP గా కూడ ఎన్నికయ్యారు . ఆయన  "వై ఎస్"  మరణానికి ముందు ఆర్ధిక శాఖ మంత్రిగ ఉన్నారు. ఆయన వివాద రహితుడి గా , ఆంద్రప్రదేశ్ లో ఉన్న  సీనియరు రాజకీయనాయకుడిగా. ఎంతో అనుభవం ఉన్న ఆయన CM రేస్ లో కూడా ముందే ఉన్నారు.
                సూదిని జైపాల్ రెడ్డి .. will update soon ..... little busy at work .......
                           

Monday, September 7, 2009

మన పయనం ఎటు ?

ప్రపంచము మొత్తం అభివృద్ధి లో పురోగమనంలో ఉంటే మనం మాత్రం తిరోగమనం లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది? కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఒక నిమిషం అలోచించిన మనకు గోచరిస్తాయి. అవినీతి,లంచగొండితనం,బంధుప్రీతి వీటిలో సముచిత స్తానాన్నే ఆక్రమించాయి. ఒక సామెత "మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి" అన్న చందాన రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడే అవ్వవచ్చుగాక, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి గా ఎలా ఆహ్వానిస్తాము ? CM పదవి ఏమైన ఇడుపులపాయ ఎస్టేట? ఆయన పోగానే ఆయన కొడుకు గారికి అప్పచెప్పడానికి ?
                               
                             100 సంవత్సరాలా చరిత్ర ఉన్న పార్టీ లో కేవలం 100 రోజుల అనుభవమే ఉన్న జగన్ తప్ప వేరే నాయకుడే లేడా ? అసలు జగన్ కి ఉన్న అర్హత ఎమిటి? "నాయకులు పుడతారు,తయారు గారు" అని మనం నమ్మితే రాజరికాన్ని వదిలి ప్రజాస్వామ్యం లోకి రావడం ఎందుకు ? కందిపప్పు కేజి రూ 100/-, పచదార రూ 50/- అయినప్పుడు మాటలు రాని ఈ మంత్రులు అనబడు వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జగన్ కొసం అదిష్టానం దగ్గరికి పరుగులు తీస్తున్నారు ?
                           ఇప్పటి కైన వారు ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తే తర్వతా అయ్యే CM కోసం మట్లాడటానికి మిగులుతారు . లేకపోతే శాస్వతముగా ప్రజల మనసుల నుండి ఆ తర్వాత పదవుల నుండి దూరం గాక తప్పదు .

Thursday, September 3, 2009

జనం మెచ్చిన నాయకుడికి అశ్రునివాళి



 ఎందరో నాయకులు వస్తారు , పొతారు. కాని కొంత మంది మాత్రమే జనం హ్రుదయం లో చెరగని ముద్ర వేసి దశాబ్డాలు , శతబ్దాలు , చరిత్రలో నిలిచి పోతారు . ఒక ఐందిరమ్మ , ఒక రాజీవ్ , ఒక యన్ టి ఆర్ , ఒక పీవీ  , ఇలా ఎందరో. వీళ్ళు జనం దగ్గర  ఓట్లు   మాత్రమే కాదు వాళ్ళ  మనసుల్ని గెలిచారు . అందుకనే వాళ్ళు మరణించి దశబ్దాలు గడుస్తున్నా వారిని నిత్యం గుర్తు తెచ్చుకుంటున్నాం . సరిగ్గా ఇలాంటి కోవలోకే  వై యస్ ఆర్ వస్తారు . ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ ముఖ్య మంత్రి గా ఎన్నో పధకాలు శ్రీకారం చుట్టి అందరి మనసులు దోచారు . "ఆరోగ్య శ్రీ"  పధకం దేశస్థాయి లో అందరి మన్ననలు పొందినది . "రైతే రాజు"  అని నమ్మిన శ్రీ స్వర్గీయ వై యస్ ఆర్  మృతి మన రాష్ట్రనికే కాదు దేశ రాజకీయానికి తీరనిలోటు .

                       ఇంతటి ప్రజా రంజకము గా పాలించే నాయకుడు పాపం స్వర్గం లో లేడెమో అందుకే మన ప్రియతమ నాయకుడ్ని ఆ దేవుడు త్వరగా తీసుకువెళ్ళాడు.

ఆ రాజసేఖరుడి ఆత్మ శాంతిచాలని కోరుకుంటు మన ఘనమైన నాయకుడి కి ఘన నివాళి. 

Wednesday, September 2, 2009

రాజశేఖరా ... నువ్వు ఎక్కడ ?

CM మిస్ అయి అప్పుడే 10 గంటలు దాటి పోయింది. అయిన మనం ఎందుకు గుర్తించలేక పోతున్నాం .? వర్షం , చీకటి , అడవి అని సాకులు వెతుకుతున్నాం . చంద్ర మండలంలో నీళ్ళు ఉన్నాయా ? లేవ అని వెతికే మనం మన నల్లమల అడవిలో  Helicopter  ని గుర్తించలేమ ? 10 గంటలలో మనం సాదించిన ప్రగతి ఏమిటి ?

అసలు "మగధీర" ఎవరు ?







The latest Telugu blockbuster by Director Rajamouli, ‘Magadheera’  63 minutes of enthralling VFX work done by Prasad EFX from its Hyderabad and Chennai facilities.


Produced by Allu Aravind’s Geeta Arts, ‘Magadheera’ has over 890 VFX shots that took nearly one year and 10000 man days to complete. The scope of work included animation, 3D tracking, digital matt backgrounds, complicated rope removals and compositing. The arena sequence is a must see, involving some of the most complicated amalgamation of stunts and graphics.

అసలు "మగధీర" ఎవరు ? డైరక్టర్ ? హీరో ? నిర్మాత ?  మరి  Graffixa ?

హైదరబాదు మహా నగరమా..? మహా నరకమా .. ?

చినుకు పడితె మన నగరం .. నరకంగా మారుతుంది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేని కారణంగా ఎక్కడి కి అక్కడ నీరు నిలిచిపోయి రోడ్లన్ని మురుగు నీటితో నిండి పోతున్నాయి. ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. అమీరుపేట్ , యస్ ఆర్ నగర్ అయితే మరి దారుణం . మన మహా నగరం వాన వస్తే మహా నరకం గా మారుతుంది. GHMC  వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారో మరి.

విజయ్ గాడి బ్లాగు గాధ

   అస్సలు నేను ఒక బ్లాగు రాద్దాం అనుకున్నప్పటి నుంచి ఏమి రాయాలా అని తీవ్రంగా అలోచించి మన బ్లాగు అందరిది కావాలి అన్న సంకల్పం తోను  మళ్ళి నేను అస్సల్లు బ్లాగు ఎందుకు రాద్దం అనుకున్నానో (**ఎందుకు అంటే ఏ విషయం చదివిన, చూసిన,విన్న నా అబిప్రాయం చెప్పాలి అనిపించేది కాని అది వీలు పడదు కద ఎందుకు అంటే మన Source  అంత TV మరియు RADIO కద)  అది గుర్తు వచ్ఛి ఇది నా బ్లాగు, నా అబిప్రాయాలు అందరితో పంచుకోవాలి అని మొదలు పెట్టాను. అందుకే హడావుడి గా మొదలు పెట్టిన న బ్లాగు ఎందుకు ?  ఏమిటి ? ఎలా ? మీకు చెబుదాం అని  ఈ  టపా.

Tuesday, September 1, 2009

PRP జెండా మళ్ళి ఎగురుతుందా ?

PRP జెండా మళ్ళి ఎగురుతుందా ? . మీ కామెంట్ ఏమిటి ?

"Operation Akarsh" వలలో రోజా

పాపం 'TDP'  "Operation Swadesh "  లో దేవేంధర్ గౌడ్ వచ్ఛిన సంతోషం ఎక్కువ కాలం లేకుండానే  "Operation Akarsh " కి మరో Wicket కొల్పోయింది. ఇప్పుడు బాబు మొదటి పని మిగిలిన వాళ్ళని జాగ్రత్తగా చుసుకోవడమే . జనం మరిచి పోయిన "PRP" ని గురించి తర్వాత అలోచించవచ్చు

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి