ఇందాకనే మా స్నేహితుడు .. ఫోన్ చేసాడు ... ఏమిటి రా విశేషాలు అంటే ... జూలై 26న "నా పెళ్లి అన్నాడు"
పెళ్ళా ? ఎందుకు అన్న?.. వాడికి "మన్మధుడు" సినిమా గుర్తు వచ్చి నట్లుంది .. నవ్వాడు .. ఎమీ ర ? మొన్ననే కదా ర 5 నెలలు కూడా కాలేదు కదా ..నీ పెళ్ళి అయ్యి ... అన్నాడు .. నువ్వు ఎందుకో నేను కూడా అందుకే అన్నాడు ....
సరే పెళ్లి తర్వాత ఏమిటి అన్న? ఏమిటి బాబాయి బాగా రొమాంటిక్ గ తయారయ్యావు? ఏమిటి సంగతి అన్నాడు ...
మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పారు ... "ఎ పని అయిన ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ..ఆ పని ఇంకా ఎక్కువ మనుసు పెట్టి చేస్తాం" అని .. ఆ మాట వాడికి చెప్పా ...
ఏమో బాబాయి .. ఎవరో ఒకరు చెపితేనే కదా తెలిసేది అన్నాడు ... హ హ అని నవ్వి విషెస్ చెప్పి ఫోన్ కట్ చేశా ..
ఇంతకీ పెళ్లి ఎందుకు ఏమిటి ఎలా ? .......... ఇదిగో చదవండి......
ఈ టప ముక్కామల జనార్ధన శర్మ గారు రచించిన "పాణిగ్రహణం" నుండి సంగ్రహించినది ..
సాయి సుసర్ల గారి కి ధన్య వాదములు .. ..అలాంటి ఒక మంచి పుస్తకాన్ని స్కాన్ చేసి అంతర్జాలం లో పెట్టి నందుకు ..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~వివాహం~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
మనువు వివాహ పద్దతులను 8 రకాలు గ విభజించారు ..
1. బ్రాహ్మo 2 దైవం 3. ఆర్షం 4 ప్రాజపత్యం 5 ఆసురం 6 గాoదర్వం 7 రాక్షసం 8 పైశాచం
1) బ్రాహ్మo అంటే అలంకరించిన కన్యను పoడితుడు, శిలవతుడు, అయిన వరుడిని పిలిచి దానం ఇవ్వడం ...
అంటే మనం ఈ రోజుల్లో చేసుకునే పెద్దలు నిర్ణయించిన పెళ్లి అన్న మాట
6) గాoదర్వం అంటే వధు వరులు ఇరువురు పరస్పర అనురాగంతో మంత్రములు లేకుండా చేసుకోవడం ..
అంటే ప్రేమ పెళ్లి అన్నమాట ...
వివాహం ఎందుకు?
మనిషి పుడుతూనే 3 రుణాలు తో పుడతాడు ...
1) రుషి ఋణం 2) దేవ ఋణం 3) పితృ ఋణం
ఋషి ఋణం మంచి విద్యను, పురాణాలను అభ్యసించి వాటిని తరవాత తరం వారికీ అందిచటం ద్వారా ఈ ఋణం తీరుతుంది.
దేవ ఋణం మన యజ్ఞము లు , క్రతువులు నిర్వహించుట ద్వారా ఈ ఋణం తీరుతుంది ..
పితృ ఋణం మంచి సంతానం కనటం ద్వారా ఈ ఋణo తీరుతుంది..
వేద అధ్యయనం, యజ్ఞo చేయటం, సంతానం కనటం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలిసిన విధులు.
ప్రతి మానవుడి జీవితం లో నాలుగు దశలు ఉంటాయి
అవి 1) బ్రహ్మచర్యం 2) గృహస్తం 3) వానప్రస్తం ఇంకా 4) సన్యాసం
బ్రహ్మచర్య దశ లో నియమ నిష్ఠలతో విద్యాబ్యాసం చేయాలి ..
గృహస్త ఆశ్రమం లో.. వివాహం చేసుకొని చక్కని సంతానాన్ని కలిగి వారిని సమాజం లో మంచి వ్యక్తులు గ తీర్చిదిద్దాలి ..
వానప్రస్తం లో పిల్లలకు వివాహాది కార్యక్రమములు నిర్వహించి మన భాద్యతలని నేరేవేర్చాలి .
సన్యాసం లో రాగా ద్వేషాలని విడిచి భగవంతుని ధ్యానం లో నిమగ్నమవటం ...
పెళ్లి ఎవరితో.... ఎప్పుడు .....?
భారతీయులకి, వివాహం ఒక వేడుక, ఉత్సవం కాదు అది ఒక సంస్కారం .. అందుకే మన లో వివాహానికి అంతటి విలువ.
వివాహ వయస్సు ఈ నాటి పరిస్తితుల లో 18-25 ఉత్తమం.
ఎంపిక ఎలా ?
బుద్దిమంతులు, తెలివిగల 4 మిత్రులను వెదుకుటకు పంపుతారు, వారు నలుగురిని విచారించి అటు వైపు వారికీ , ఇటు వైపు వారికీ కనీసం 3 తరాలు తక్కువ కాకుండా వివరములు తెలుపుతారు.
అలా తెలుసుకున్నట పిమ్మట తమ అంగీకారం తెలుపుటకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు..
మంగళ సూత్ర ధారణ , దాని విశిష్టత

No comments:
Post a Comment