Monday, January 25, 2010

గుర్తొచ్చింది ........

నేను ఇవ్వాళ ఆఫీస్ నుండి రాగానే మా వదిన రేపు మీకు "సెలవేనా" అని అడగగానే నాకు గుర్తొచ్చింది. రేపు జనవరి 26 కదా.. సెలవే మరి .. సెలవు కాబట్టే గుర్తు ఉంది.. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది..వెంటనే నేను అర్జంట్ గా రేపు పొద్దున్నే లేచి నాకు దేశభక్తి ఉంది అని నిరుపించుకోవాలి.. అంటే ఎం చేయాలి చెప్మా? ఆ గుర్తొచ్చింది.. ఎర్రకోట మీద భారి భద్రతల మద్య ..మనం జెండ మనం ఎగరవేయాటానికి ఎన్ని కష్టాలు రా అనుకుంటూ ... పాపం "చటోపాద్యయా" 100 సంవత్సరాల క్రితం రాసిన వందే మాతర గీతానికి వచ్చిన కష్టాలు తలుచుకుంటు..ఆ పాట కూడ విని కొంచెం దేశభక్తి నాకు ఉంది అని ఫీల్ అయిపొయ్ సెలవు కదా పేపర్ తెచ్చుకుందాం అని బయటకి బయలు దేరి ..దారి లో రేపు మాత్రమే కనపడే మన జెండా ఒకటి లేదా రెండో కొని ఒకటి మన జేబు కి పెట్టూకొని ఇంకొకటి మన వాళ్ళకి ఎవరి కి అయిన ఇచ్చి హమ్మయ్య వాళ్ళ లో కూడ దేశభక్తి పెంచాం అనుకొని.. ఏ "ఖడ్ఘం" మో , మేజర్ చంద్రకాంత్ సినెమా నో చూసేసి హమ్మయ్య మనకు చాలా దేశభక్తి ఉందిరా అని నాలో నేనే పొంగిపోయి .. ఇంకా నేను ఇండియన్ గా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని వచ్చే 2,3 "ఫార్వార్డ్" మెయిల్స్ నా లిస్ట్ లో ఉన్న స్నేహితులకి పంపి ..వారి లో కూడ దేశభక్తి పెంపొందించాము అని సంబరపడి .... రేపు మాత్రమే గుర్తుకు వచ్చే మన రియల్ హీరోస్ అదేనండి మన ఆర్మి పీపుల్ కి సలాం చేసి ....హమ్మయ్య నాకు చాలా దెశభక్తి ఉంది రా అని నాకు నేనే ఒక సర్టిఫికేట్ జారి చేసుకొని .. మళ్ళి ఎళ్ళుండి రాగానే .... మళ్ళి దేశాన్ని గురించి దేశభక్తి గురించి మరిచిపోయి 7 నెలల తర్వాత వచ్చే సెలవు రోజు అదేనండి ఆగష్ట్ 15 రోజు వచ్చేదాక మాములే... రేపు జరగపోయేది ఇలా కళ్ళకు కట్టినట్లు చెపుతున్నావిమిటి అని ఆశ్చర్య పోతున్నారా ? ప్రతి సంవత్సరం నేను, నా లాంటి వాళ్ళు చాలా మంది ఇదేగ చేసేది.

ఇదేమి న్యాయం ............

నేను నిన్న ఆదివారం కావడం తో ..సినిమా కి వెళ్ళి చాలా రోజులు అయ్యింది అని ..మా అన్న,వదిన లతో కలిసి "అదుర్స్" అనే సినిమాకి వెళ్ళాను. సినిమా మొదలయిన 5,10 ని"లు నుండి నా మనసు లో ఒకటే ఆలొచన... ఒకటే బాధ. సినిమా మొత్తం నా వాళ్ళ గురించి,మా వేషధారణ గురించి అవహేళన చేస్తున్నారు అని ఒకటే బాధ. "నాకు తెలిసి ఒకరిని చూసి మనం నవ్వుతున్నాము అంటే వారిని మనం అవహేళన,హేళన చేస్తున్నాము అనే". ప్రతి సన్నివేశం లోను మా నుండి వెకిలి నవ్వులు పుట్టిచ్చడనికి ప్రయత్నించారు అనే బాధ.







అప్పుడెప్పుడో "కంత్రి" సినిమా రిలీజ్ అయిన కొత్తలో అనుకుంట .. కేవలం ఒకే ఒక సన్నివేశం లో అది కూడ అంబేద్కర్ విగ్రహం చూపించారు అని అవి కేవలం దళిత వాడల్లోనే ఉంటాయి అని ..వారికి వారే ఊహించుకొని శ్రీ మందా కృష్ణ మాదిగ (..పేరు పూర్తిగ పైకి చదవకండి .. కేసు వేసి బొక్కలో తోస్తారు) గారు నాన గొడవ చేసి డైరెక్టర్ చేత సారి చెప్పించి ఆ సదరు సన్నివేశం తీసివెసే దాక మీడియా తో కలిసి బీబత్సం సృష్టించారు.

ఏమి ఇదేమి న్యాయం? సినిమా మొత్తం మా గురించి ఇలా మాట్లాడతారు ..ఇలా చేస్తారు .. అలా ఉంటారు అని వెకిలి చేష్టలు చేయిస్తే ఎవరు మాట్లడరే ..? ఎందుకు అంటే వారు 22% ఉన్నారు ఓట్లు రాలవు అనా ..మేము అయితే కేవలం 4% ఉన్నారు వెస్తే ఎంత వేయకపోతే ఎంత అనా? అయిన కథా రచయతలకి మమ్మల్ని కించపరచకుండ సినిమా కథలు రాయటం రాదా? కామెడి అంటే ఇలా ఒక సామజిక వర్గం వారిని కించపరచడమేనా? ఇది ప్రతి ఒక్కరు సిగ్గు పడాల్సిన విషయం. సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఇలా ఒక సామాజిక వర్గానికి చెంది న వారిని ఇలా అవహేళన చేయటం తగునా ..? ఇదేమి న్యాయం భగవంతుడా ?

Thursday, January 21, 2010

సార్ 5 నిమిషాలు.. ప్లీజ్ సార్ 5 ని"లు ..... ఆలొచించండి.

ఆచార్యా కోదండరాం గారు, ప్లీజ్ 5 నిమిషాలు ఆలోచించండి. మీరు ఇలా శ్రీకాంత్ కోసం ఒక సారి, వేణు గోపాల్ కోసం ఒకసారి బంద్ చేసుకుంటు పోతే .. విద్యార్దుల కి తప్పుడు సమాచారం పంపినట్లు అవుతుంది. ఇలా చేస్తే నిజం గా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి "తెలంగాణ" సాదించ వచ్చు అని అపోహ కలిగించిన వాళ్ళు అవుతారు. శ్రీ గౌరవనీయులైన " కె సి ర్" గారు ఇలా చేద్దమనే 3 పర్యాయాలు రాజినామ సమర్పించి చివరికి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గా ఎదో గెలిచాం అంటే గెలిచాము అని అనిపించుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అని ఒక్క 5 నిమిషాలు ఆలొచిస్తే మీకే అవగతం అవుతుంది. ఆయన మొదటి సారి రాజినామా సమర్పించినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇది ఎదో బాగుంది అని 2 వ సారి , 3 వ సారి కూడ అలానే చేస్తే చివరకు ఇంకోలా జరిగింది. రాజినామ చేయటం వల్ల జరిగే నష్టం ప్రభుత్వానికి ఎంత వుందో ప్రజలకి పరోక్షము గా అలానే ఉంది అనే విషయం ఆలస్యము గా అయిన వాళ్ళాకి తెలిసింది. ఇప్పుడు ఈ విషయం అంతే, ఇలా మీరు బంద్ అని పిలుపునిస్తే ప్రభుత్వానికి ఎంత నష్టమో ప్రజలకి ( ముఖ్యము గా విద్యార్డులకి) అంతకన్నా ఎక్కువ నష్టం. వారి పరీక్షలు వాయిద వేయించి ఎదో సాదించాం అని మీరు అనుకుంటే దాని వల్ల వాళ్ళా విలువైన జీవితం ఇబ్బంది పాలు అవుతుంది,ఒక సారి జైల్ కి వెలితే తర్వాత వారు ఇక ప్రపంచం లో ఎక్కడా ఏ ఉద్యోగం, కనీసం చదవటానికి కూడా అనుమతి దొరకదు. ఈ విషయము ఈ క్షనికావేశంలో తెలియకపోయిన, తెలిసిన నాడు మీకు విశ్వ విద్యాలయ విద్యార్దులు కాదు కదా కనీసం "అ ఆ" లు దిద్దే వాళ్ళు కూడా మద్దతివ్వరు అప్పుడు మీకు తెలంగాణా లో ఈ 2 సీట్లు కూడా రావు.





కావున ఆచార్య కోదండరాం గారు విద్యార్దుల జీవితాలతో ఆడకండి.వాళ్ళు రెండు వైపుల పదునున్న కత్తుల లాంటి వారు వారితో జాగ్రత్తగా మసలటం మీకు ..తెలంగాణ ఉద్యమానికి ఎంతో మంచిది.




మీరు ఆచార్యులు అయిఉండి ఏంతో ఉన్నత వ్యక్తిత్వం కిలిగిఉన్న మీకు నేను చెప్పేవాడిని ఏ మాత్రం కాదు. కాబట్టి సార్, ఆచార్యా ! 5 నిమిషాలు .. కేవలం 5 నిమిషాలు ఆలొచించండి.

Monday, January 18, 2010

Foot Prints

Many people will walk in and out of your life, but only true friends will leave footprints in your heart.--  "Eleanor Roosevelt "


                  ఆ రోజు జూన్ 29 2009,కొత్త కంపెని లో నేను జాయిన్ అయిన రోజు. నాతో పాటు నవీన్,మోహన్ ఇంకా తుషార్,సొనం వీళ్ళు కూడ అదే రోజు జాయిన్ అయ్యారు. మేము అందరం ఒకే రోజు జాయిన్ అవ్వటం వల్ల రెండు,మూడు రోజులలోనే చాలా దగ్గర అయ్యాం. ముఖ్యం గా నేను,నవీన్ అయితే చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ లా ఎప్పుడూ కలిసి ఉండే వాళ్ళం. కలిసి తినే వాళ్ళం,ఆడే వాళ్ళం ఆఫిస్ లో ఉన్నంత సేపు అతుక్కొని ఉండే వాళ్ళం. జాయిన్ అయిన 15 రోజులకి మా ఇద్దరిని ఒకే ప్రాజెక్ట్ లో వేసారు. ఇక మేము పరస్పరం పని లో కూడ ఎంతో సహాయకరం గా ఉండే వాళ్ళం.నా కన్న తనకి బేసికల్ గా కొంచెం కాదులెండి, బాగానే నాలెడ్జ్ ఎక్కువగా ఉండటం వల్ల నేను నా ప్రతిపని ఆఫిస్ ది అయిన సొంత పని అయిన తనని సలహా ఆడిగి చెసేవాడిని. తను కూడ ఏమి చేసిన నాకు చెప్పి చేసే వాడు కుదరకు పోతే చేసిన తరవాత చెప్పేవాడు.అన్ని విషయాలలో నాకు వెన్నుదన్ను గ ఉండే వాడు.

                  ఆ రోజు డిసెంబర్ 17 2009, తనకి "యు స్ ఎ " హెచ్1బి వీసా ఉండటం తో మా కంపెని కి రిసైన్ చేసాడు. ఇక అప్పటి నుండి నాకు ఈ కంపెని లో ఉండాలి అనిపించలేదు నేను గట్టిగ ట్రై చేశా నాకు వేరే కంపెని లో మంచి ఆఫర్ వచ్చింది. ఆ రోజు 12 జనవరి 2010 నేను రిసైన్ చేసా.

ఈ రోజు జనవరి 18 2010 తనకి మా కంపెని లో లాస్ట్ వర్కింగ్ డే. మళ్ళి తనకి నేను కనపడతానో లేదో కనపడిన ఇప్పటి లా కలిసి పని చేస్తామో లేదో తెలియదు కాని తను నాతో గడిపిన ఈ 7 నెలల స్నేహాన్ని నేను ఎప్పటికి మరువను.

అందుకే  Many people will walk in and out of your life, but only true friends will leave footprints in your heart.

చెప్పటం మరిచా నేను,నవీన్ కొన్ని గంటల వ్యవది లో జన్మించాం. తను 20 ఫిబ్రవరి అయితే నేను 21 ఫిబ్రవరి.  
 
ఫోటో లో ఎడమ వైపు నవీన్,పక్కన నేను[నలుగురి లో నాలుగో వాడిని]                      

                       

Wednesday, January 13, 2010

అ-అరిసె, ఆ - ఆమ్మ(పెద్దమ్మ)


అ- అమ్మ అనగానే ప్రేమా,మాదుర్యం,ఆప్యాయత అని ఎలా తెలుస్తుందో అలానే సంక్రాంతి పండగ అంటే భోగి పండ్లు,గొబ్బెమ్మలు,ముగ్గులు ఇంకా గుర్తువచ్చిందా? నోరు ఊరుతోందా ? అదేనండి అరిసెలు. హా! పలికితేనే నోరు అంత తియ్యగ అవుతుంది. ఇంకా తింటుంటే ఆహా ! నా రాజ ! .. మరి ఇంక ఏ- స్వీట్ దాని దక్కరకు రాదు. మనలో అరిసెలు చేయటం రాని వారు ఉన్నారేమో కాని తినడం ఇష్టం లేని వాళ్ళు ఉండరు అంటే అతిసోయక్తి కాదు. నాకు అరిసె అన్న, సంక్రాంతి అన్న ముందు గుర్తుకు వచ్చేది మా ఆమ్మ.
     నాకు ఇంకా గుర్తు ఉంది.ప్రతి సంక్రాంతి పండగ కి కొత్తపాలెం (వెలది కొత్తపాలెం,చందర్లపాడు (మ),కృష్ణ(జి) మా సొంతూరు లేండి ) వెళ్ళడం. మేము వెళ్ళగానే మాకోసమే ఎదురు చూసే ఆమ్మ(కొంత మంది పెద్దమ్మ అని కూడ అంటారు),ఆమ్మ వేసే రంగు రంగుల ముగ్గులు, ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు,వాటి మీద చల్లే బంతి పూలు , పొలం గట్ల నుండి కోసుకు వచ్చే రేగ్గాయలు నిజం గా మా మేము ఉండే వీది వైపు వచ్చి న వారు ఎవరైన సరే కళ్ళు తిప్పే వారు కాదంటే నమ్మండి.


మేము వెళ్ళిన రోజు నుండి మా ఆమ్మ పెట్టే పరుగులు,ఉరుకులు, మా చిన్నోడి కి అవి అంటె ఇష్టం ,ఇవి ఆంటే ఇష్టం అని చెప్పి తను చేసే వంటలు , స్వీట్లు . నేను నిజం గా (పెట్టి పుట్టాడు ఆంటారు చూడండి) అంత కన్న ఎక్కువ అన్నమాట. ఇంకా తను భోగి కి రెండు రోజుల ముందు అరిసెలు చేసేది.నన్ను పక్కన కూర్చొ పెట్టుకోని మా నాన్న చిన్నప్పటి విశేషాలు, మా అమ్మ చిన్నప్పటి కబుర్లు అని చెబుతూ బియ్యప్పిండి రోట్లో దంచుతు .... బెల్లం పాకం పడుతు మద్య మద్య లో మా అమ్మ కి .. లక్ష్మి ఇలా చెయ్యి .. అలా చెయ్యి అని ట్రైనింగ్ ఇస్తూ ...ఇంకా నెయ్యి లో వేయిస్తూ .. ఇవి కాస్త వత్తరా అని చిన్న హెల్ప్ అడిగి .. ఇవ్వాల పని అంతా మా వాడే చేసాడు అని ఇంటి ముందు అరుగు మీద కుర్చొని, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి చెప్పేది. ఇంకా కనుము పండగ అయిపోగానే మేము ఊరికి బయలు దేరగానే ..మళ్ళి మా కోసం ఉగాది పండగ ఎన్నిరోజులకి వస్తుందో అని లెక్కలు వేసి, చేసిన పిండి వంటలు అన్ని ఒక సంచి లో పెట్టి . బాగ చదువుకో అని ఒక వందో, 2 వంద లో జేబులో పెడుతు కంటి నిండా నీళ్ళతో .. మనసు నిండా ప్రేమ తో చేయి ఊపుతు ఉగాది కి తప్పకుండ రార అని టాటా చెప్పేది.

 ఆమ్మ ఇప్పుడు బౌతికము గా మా మద్య లేక పోయిన, నేను చూసే ప్రతి ముగ్గు లో ఉంది,నాకు ఇష్టమైన అరిసె లో ఉంది. నా గుండెలు నిండా ఎప్పుడు ఉంటుంది

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి