Sunday, July 31, 2016

అమేరికా లో నాకు బాగ నచ్చినది ..........


అందరికి అమెరికా ఒక కలల దేశం, ముఖ్యంగ మన తెలుగు రాష్ట్రాలలో అది ఇంకా చెప్పాల్సిన పని లేదు ... అందుకు నేను మినహాయింపు కాదు ...

నేను అమెరికా లో ఉండబట్టి 1 సంవత్సరం అయ్యింది ... 30 సంవత్సరాలు మన దేశం లోనే  ఉన్నాను ...

అక్కడ ఉంది, మన దగ్గర లేనిది కేవలం డబ్బు ఒక్కటే కాదు ... ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ...

వివిధ శతకాలలో  ఇంకా , మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మంచి ఎక్కడ ఉన్న దానిని గ్రహించి ఆచరించడం లో తప్పు లేదు.....  అందుకోసం నాకు అనిపించిన కొన్ని మంచి విషయాలు మీ కోసం ...

1+ ) సాటి మనిషిని గౌరవించడం ...అది చెత్త డబ్బాలు తీసుకు వెళ్లే garbage collctors అయినా .. స్టోర్స్ లో పని చేసేవారు అయినా . పెద్ద బిజినెస్ లు చేసేవారు అయినా ... .అందరం సమానమే అన్న విషయం ...

1 )  ఎమర్జెన్సీ ... 911, ఈ నెంబర్ ..అమెరికా ప్రజలకు ఆక్సీజన్ ... ఎక్కడ ..ఎప్పుడు..  ఏ ఆపద,కష్టం వచ్చిన ఆదుకునే నెంబర్ .... ఇది ఎలాంటి సందర్భాలలో ..ఎలా ఉపయోగించాలో .. 3 సంవత్సరాల పిల్లలు నుంచి అందరికి తెలియ చెపుతారు ... ఈ నెంబర్ డయల్ చేయడానికి.. బాలన్స్,సిగ్నల్స్ ..ఫోన్ లాక్ ..ఏది అక్కర్లేదు... మన దేశం లో 100,101,108 మూడు నంబర్స్ ని కలిపి ఒక నంబర్ గ మార్చాల్సిన అవసరం చాలాఉంది .. ఇంకా అన్ని ఫోన్స్ ఆ నంబర్ ని ఎమర్జెన్సీ గ ఉంచాలి...

2) ట్రాఫిక్ రూల్స్ పాటించడం.... .. నేను 2,3 నగరాలు చూసాను ... ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలిస్ ఉండరు ..కానీ ఎవ్వరు వాటిని అధిగమించరు. .... కొన్ని కూడలిలో సిగ్నల్స్ కూడా ఉండవు .. ఎవరు ముందువస్తే వాళ్లు వెళ్ళాలి , అందరు తూ .చ.  తప్పకుండా పాటిస్తారు ..

3) మెడికల్ విధానం...  ఇది అన్నిటికన్నా నాకు నచ్చింది.... మెడికల్ షాపు (ఫార్మసీ) కి వెళ్లి  తెచ్చుకోగలిగిన మందులు .కొన్ని ఉన్నా .. ఇంకా చాలా వరకు .. డాక్టర్ నుంచి తీసుకున్న   ప్రిస్క్రిప్షన్ కి మాత్రమే ఇచ్చే మందులు... ఇవి డాక్టర్స్ .మనకి ఇష్టమైన .. మనం కోరుకున్న ఫార్మసీ కి ఇమెయిల్ చేస్తారు... మనం వెళ్లి మన పేరు, డీటెయిల్స్ ఇచ్చి తెచ్చుకోవాలి...  ఆ ప్రిస్క్రిప్షన్ లో నే మనం ఎన్ని సార్లు రీఫిల్స్..  అంటే ఎన్ని సార్లు కొనవచ్చు కూడ చెపుతారు .. అంటే మనం డాక్టర్స్ కి తెలియకుండా మనకి నచ్చినవి వేసుకోవడానికి ఉండవు ...  షాపు కి పోయి ఖాళీ బాటిల్స్ చూపించి తెచుకోవడాలు .. పోయిన సరి కొన్నవే కొనడం.. మనకి తెలియకుండా .. డోస్ లు వేసుకోవడాలు.. ఉండవు...

4) పిల్లల్ని స్వతంత్రం గ ఎదగనివ్వడం....ఇక్కడ 3 సంవత్సరాలు వస్తే .. తన పనులు తానే చేసుకునేలా నేర్పుతారు... 5 సంవత్సరాలు నిండేదాకా వారికీ ఏమి చదువులు వారిపై రుద్దారు .. వారు ఎలా మెలగాలి,ఎలా మాట్లాడాలి ..అండ్ ఇంకా మన పనులు ..బ్రష్, స్నానం చేయడం... డ్రెస్సింగ్ ...undressing .. టాయిలెట్ ఎథిక్స్ ..ఇవే ...

5) ఇంకా విద్యా విధానము , కుడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది .. కేజీ కేజీ ల పుస్తకాలు కాదు కావాల్సింది.. కుసిరింత ప్రాక్టికల్ ... అందుకే ..మన పిల్లలు కేవలం ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు... ఆవిష్కరణ లో వెనక పడుతున్నారు...


ఇవి అండి నాకు ఇక్కడ నచ్చిన విషయాలు.....  కొన్ని విషయాల లో మన దేశం లో ఉన్న అన్ని సౌకర్యాలు ..పద్ధతులు.. ఇక్కడ లేవు అనుకోండి....
    



Tuesday, July 26, 2016

చట్టం డబ్బున్నవాడి చుట్టం.

మా చట్టం డబ్బున్నవాడి చుట్టం, పలుకుబడి ఉన్నవాడికి కడుతుంది పట్టం

పేదలు, సామాన్యుల ది పట్టుకుంటుంది జుట్టు, నాయకులకి, డబ్బున్న మదోన్మాదులతో కడుతుంది జట్టు.

 పైసా ఉంటే వస్తుంది మీకు బెయిలు, లేపొతే అవుతుంది మీ జీవితం కటకటాలాపాలు..

అదేమీటో భారతదేశం లో డబ్బుల్లున్న ఖైదీలు అందరు, సత్ప్రవర్తన కలవారు ... మనీ లేని వారు దుష్టులు, ఎప్పటికి మారని నేరగాళ్ళు..

పదవి ఉందా?, పలుకుబడి ఉందా ? రెండిటిని మించి కొనగలిగే శక్తి ఉందా? అయితే మా దేశం లో మీకు అమ్ముడుబోని వ్యవస్త లేదు ..మీ అడుగలకి మడుగులు వత్తని స్థలం లేదు ...

న్యాయస్ఠానం లో న్యాయనికైన  , దేవస్థానం లో దైవానికి అయిన, డబ్బులు , పదవి ఉన్నవారే ముఖ్యులు (వీ.ఐ.పీ ), ఇష్టులు..

మా దేశం లో డబ్బులు ఉంటే కార్లు కొనవచ్చు , రోడ్ తో పాటు మనుషల పైన అయిన పోనిచ్చి న్యాయాన్ని కొనవచ్చు..

వన్యప్రాణుల్ని చంపి తినవచ్చు, ఆపైన తిరిగ్గ చట్టాన్ని కొనవచ్చు.

ఆడవారి పైన నడి రోడ్ పై అసభ్యం గ , ప్రవర్తించ వచ్చు ...ఆపై కుక్కల పై నెట్టవచ్చు..

5000 లు లంచం తీసుకున్న జూనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యండెడ్ అరెస్ట్ ... 5000 కోట్లు దోచుకున్న వారు .....???

మా దేశం లో డబ్బులుంటే మీకు అరగంట, లేకుంటే ప్రతి చోటా మీరు Q లో నిలబడి చావాలి గంట గంటా..

మీరు మీ కాసుల కోసం తీసిన సినిమా కోసం పన్ను రాయితీ , కానీ ..పన్ను మీద పన్ను వేసి సామాన్యుల నాడ్డి విరగ గొట్టు ..తీ ....

మీ నాన్నకు బాగా డబ్బులున్నాయ ? మీది బాగా బలిసిన ఫ్యామిలి నా ..? కార్ తో "రమ్య" లాంటి వాళ్ళని   చంపు .. బెయిలు పై వచ్చి వ్యవస్తని చంపు ..

     
      మా చట్టం డబ్బున్నవాడి చుట్టం, పలుకుబడి ఉన్నవాడికి కడుతుంది పట్టం.


Sunday, July 10, 2016

తెలుగు సినిమా లో "కోటా" ..


తెలుగు సినిమా లో  తనకు అంటు "కోటా" (భాగం) ఎర్పరుచుకున్న కొద్ది మంది నటుల లో కోటా శ్రీనివాస రావు గారు ఒకరు..

చేసిన సినిమాల లెక్క పెడితే ..ఆయన టాప్ 10,20 లో ఉండక పోవచ్చు ..కాని ఆయన నటించిన విబిన్న పాత్ర ల లోతు గ్రహించిన వారికి ..ఆయన తప్పకుండ తమ టాప్ లిస్ట్ లో చేరుస్తారు ..

ఆయన కామెడి చేసిన , విలనిజం చూపించిన, లేద ఒక క్యారక్టర్ చేసిన ...ఆయన పాత్ర కి ప్రాణం పోశారు..

పిసినారి అయిన, అచ్చ తెలుగు బాష మాట్లాడిన .. సినిమా పై అభిమానం ఉన్న తెలంగాణ యాస మాట్లాడే వ్యక్తి గ చేసినా .. నవ్వు రాని జోక్స్ వెసే హింసరాజు గ చేసిన ...ఆయన నటన నవ్వుల పుయిస్తుంది ..

గణేష్ సినిమా లో ఆయన నట విశ్వరుపం ... అద్బుతం ..

బద్రం becareful brother  అన్న... ఆయన నటన కి మన చప్పట్లు తప్ప ఇంక ఏమి ఇవ్వగలం ..


నా తరుపున .. తెలుగు ప్రేక్షకుల తరుపున .. కోటా గారికి .. జన్మదిన శుభాకాన్షలు ..        
   

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి