Thursday, December 23, 2010

ఫిజిక్స్ సారు, నేను, గాడిద ..

నాకు తెలిసి ప్రపంచం లో అతి ఎక్కువ మెమొరి ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ..మన మెదడే అనుకుంట....

ఈ ఉపోద్ఘాతం ..ఎందుకు అనుకుంటున్నారా ...?

నాకు ఇవ్వాళ కార్యాలయానికి వెళ్ళే దారి లో ..ఒక గాడిద కనిపించింది...

అందులో వింత ఏముంది ..కదా ?

నాకు 2000 సంవత్సరం నుండి గాడిద ..కనిపిస్తే ..ఫిజిక్స్ సార్ గుర్తొస్తారు ...

మాములుగ అయితే అందరి దౄష్టి లో ఫిజిక్స్ కి ..గాడిద లకి ఏమి సంబందం ఉండదు ..

కాని ఆ రోజు జరిగిన సంఘటన ..నన్ను జీవితం లో గాడిద ని ..ఫిజిక్స్ సార్ ని మరిచి పోకుండ చేసింది ...

~~~~ ం ం ం ం ~~~~ కంగారు పడకండి .. మీమ్మల్ని నాతో మా కాలేజి కి తీసుకు వెళ్తున్న అన్నమాట ~~~


ఆ రోజు ..అర్ధం కాని ఫిజిక్స్ క్లాస్ లో ..ఏ ముక్క చెవికి ఎక్కదు అని తెలిసిన ..తదేకంగా బోర్డ్ వైపే చూస్తున్న ...
అప్పుడు మా ఫిజిక్స్ సార్ [.. ఆయన కూడ నా లానే "బి.జె.పి" అనుకుండి .. "బి.జె.పి" అంటే అదేదో జాతియ పార్టి కాదు .. "భూమికి జానెడు పొడుగు" ]

లేపి బాబు IS PUSHING EASIER OR PULLING?  అని అడిగారు .. మనమా అస్సలే గవర్నమెంట్ వారి సర్కారు స్కూల్ ..అందు లోను ... కొత్త పాలెం నుండి కొత్త గా ఎర్ర బస్ దిగా .. అస్సలే ఏ ముక్క రాని ఇంగ్లిష్ మీడియం .. అందు లో అర్ధం కాని ఫిజిక్స్ ...


sun / son   లా ఒకే లా ఉన్నాయి .. రెండు ( pushing and pulling) మొదటి సారి వింటున్న ..ఏమి చెప్పా లో తెలియదు ... "తెలియదు సార్" అని కూడ ఇంగ్లీష్ లోనే చెప్పాలి అందుకే బెల్లం కొట్టే రాయి లా .. అలా నిలబడ్డా ...


అప్పుడా ఆయన నన్ను "గాడిద ..అది కూడా తెలియద" అని తిట్టారు..

వెంటనే ఆయనే  ఒక్క నిమిషం ఆలోచించి చెప్పటం మరిచి పోయ గాడిద లు నా కల లోకి వచ్చి ..రోజు సార్ మరి వాడి తో పోలుస్తున్నారు ఎమిటి సార్ ..మా పరువేం గాను అని బాధ పడుతున్నాయి .. అని అన్నారు ...

ఆ మాటలకి క్లాస్ మొత్తం విపరీతం గ నవ్వుతుండగానే .... నా చూపు అలవాతు అలవాటు లో పొరపాటు లా జ్యోతి వైపు చూశ .. జ్యోతి విపరీతంగా నవ్వుతుంది  ..ఎలా అంటే చిన్న పిల్లలు సర్కస్ లో భఫూన్ ని చూసి నవ్వుతారే అలా అన్న మాట .. అదేదొ సామెత [ " మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వింది అని బాధ అంట" ]  అన్నట్లు గా నాలో "జల్" తుఫాన్ నా తేనే కళ్ళ దగ్గర తీరం దాటింది ...

వెంటనే మా సార్ .. ఒరెయి మరి ఇలా ప్రతి దానికి ఫీల్ అయితే "టీచర్" అవి అవుతావు అన్నారు ..

 అది అన్నమాట "గాడిద".. "నేను" .. "మా ఫిజిక్స్ సార్ ..."

పదేళ్ళు అయిన ..నాకు గాడిద ని చూడ గానే అదే గుర్తు వచ్చింది .. ఎంత గొప్ప మెమరి నాది ...


కొసమెరుపు ...  ఆయనని మేము ఇప్పుడు ముఖ్య ప్రశ్నలు చెప్పండి సార్ అన్నా ..నే చెపితే రావు .. జరగదు  అనే వారు ..ఆయన అన్నట్లు గానే నేను టీచర్ ని కాలేదు .. అప్పడ్నించి "తిట్లు" అలవాటు అయిపోయి ..దున్న పోతు మీద వాన పడ్డట్లు ..ఫీల్ అవ్వటం మానేసాను ...

 PUSH /  PULL అని బోర్డ్ ని చూసిన కూడ నాకు ఇదే సీన్ గుర్తొస్తుంది ....



        
        

6 comments:

Apparao said...

పుష్ కి పుల్ కి నాకు ఎప్పటికీ తికమకే
ఎన్ని బండ గుర్తులు పెట్టుకున్న డోర్ దగ్గర తికమక పడుతుంటా
బాగా రాసారు , కామెంట్ వెరిఫికేషన్ ఎందుకండీ ?

నలుగురి లో నాలుగోవాడు said...

@శాస్త్రి గారికి ..ధన్యవాదములు .. నేను కూడ..ఇప్పటికి ..పుష్.. నెట్టు ..అని అనుకుంటు డోర్ నెట్టుతు ఉంటా....

Indian Minerva said...

మీరు కూడానా... మా వాడొకడు నాకు చెబుతుండేవాడు "push means to apply force 180 degrees "away" from your direction and pull is towards your direction" అని :). నాకింకా బోల్డు confusions వున్నాయ్ రైటు-లెఫ్టు అందులో ఒకటే.

Apparao said...

@ మినర్వా గారు
నేను కూడా అంతే,
లెఫ్ట్ రైట్ కి తికమక
మా కాబ్ డ్రైవర్ , ఆటో వాళ్ళు అప్పుడప్పుడు నన్ను విసుక్కుంటారు ఈ విషయం లో

నలుగురి లో నాలుగోవాడు said...

@indian garu .. ఇలాంటి నిర్వచనాలు ఇవ్వటం వల్లనే మా లాంటి ఎర్ర బస్సు బ్యాచ్ కి అర్ధం కానిది ...

మా సొంత ఉళ్ళో ..నా కు ముందు ..నా తర్వాత ఇంటర్మీడియట్ తెలుగు చదివినట్లు నాకు తెలియదు ...

నలుగురి లో నాలుగోవాడు said...

@శాస్త్రి గారు ... నేను రైట్ , లెఫ్ట్ అనగానే వాచ్ చూసుకుంట .. వాచ్ ఉన్న వైపు లెఫ్ట్ అని ....నా బండ మెదడు పెట్టుకున్న బండ గుర్తు ..

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి