Saturday, November 24, 2012

మీకు తెలుసా సెక్షన్ 66 A ( Section 66 A details )


తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు కాలుతుంది.
అది ఏ మాత్రం తెలియని అంబాడే పాపాయి అయిన  కాటికి కాలు చాచిన పండు ముసలి అయిన.
గాలికి  పోయే కంపని మన ముడ్డి కి  మనమే తగిలించుకుంటే ?
సరదాగా మనం చేసే పని మన మెడ కు కొండచిలువ లా చుట్టుకుంటే ?
 అలాంటిదే మన చట్టం సెక్షన్ 66 A , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. 

 సెక్షన్ 66 A మన లో చాలా మందికి (అందులో నీను కూడా ఉన్న లెండి) తెలియదు , కాదు తెలుసు కోవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు వచ్చింది మరి తెలుసుకోవాలి కదా. కనీసం చేతులు కాలాక అయిన .... పట్టుకోవాలి కదా.

అది ఏమిటో ఎందుకో మనల్ని ఏమి ఏమి చెయ్యగలదో చదవండి మరి.

మొన్న మరాఠి బొబ్బిలి స్వర్గీయ బాలసాహెబ్ అదేనండి, టైగర్ బాలథాకరే స్వర్గాస్తులు అయినప్పుడు శని , ఆది వారలు ముంబై తో పాటు , పూణే ఇంకా మిగత మహారాష్ట్ర అంతట అప్రకటిత బంద్  జరిగింది. ఆయన అనుచరులు అంత పాపం దుఖ సాగరం లో ఉన్నారు, మిగత వారు మనకు ఎందుకులే అని ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. 
అన్ని మూసిన మన FB దుకాణం ఎవ్వరు కట్టలేదు కదా అందుకే సరదాగా బయటకి వెళ్ళలేక పోతున్న అనుకుందో ఏమో ఒక అమాయకురాలు   బంద్ భయపెట్టి చెయ్యకూడదు , ప్రేమతో చెయ్యాలి అని ఒక పోస్ట్ చేసింది.దానికి వాళ్ళ స్నేహితురాలు ఒక Like ఇచ్చింది , ఇంకేముంది సెక్షన్ 66 A వాళ్ళ ఇంటికి పోలిస్ లని  తీసుకురావటం , జైలు కి తోలుకు పోవటం చక చక జరిగాయాయి.

అదేమరి సెక్షన్ 66 A అంటే,  మీకు గుర్తు ఉండే ఉంటుంది అప్పట్లో కొన్ని రోజులు bulk SMS లు పంపడం కుదరదు అన్ని బ్యాంకు లు, మొబైల్ ఆపరేటర్లు మూసుకొని కూర్చున్నారు అది కూడా మన సెక్షన్ 66 A వల్లనే. 

అస్సలు సెక్షన్ ఏమి చెపుతుంది అంటే  Punishment for sending offensive messages through communication service, etc..  అనగా ఇంటర్నెట్ , ఫోన్ ల నుండి ఇతరులకి ఇబ్బంది కలిగించేలా సందేశాలు పంపడం, గొడవల్ని ప్రేపించడం , ఇతురల మనోభావాలు దెబ్బతినేల సందేశాలు పంపిచడం వగైరా అన్న మాట చేస్తే వారిని ఈ చట్టం కింద  గరిష్టం గ 3 సంవత్సరాల వరకు బొక్కలో వేయోచ్చు అన్నమాట.

ఇందులో ఫోన్ నుండి పంపే సందేశాలు పంపడం , ఈ-మెయిల్స్ పంపడం ,  మన ట్విట్టర్ , FB లాంటి వాటిలో పోస్ట్ చెయ్యడం అన్ని వస్తాయి,

కావున  నా ప్రియ మిత్రమా, ఏది పడితే అది రాసి , దానిని share చేసి దానికి like ఇచ్చుకుంటూ పొతే, సెక్షన్ 66 A , కుయి కుయి అనుకుంటూ పోలీసు లను ఇంటికి తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.    

దీనికి Like కొట్టి share చెయ్యోచు ఇందులో అందరిని జాగ్రత పరవడమే కానీ ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టలేదు కదా..

మీ నలుగు రి లో నాలుగో వాడు ...





Thursday, November 22, 2012

ఇది ఒక గుణపాఠం


కసాబ్ ఉరి  ఉగ్రవాద సంస్థల కి  ఒక గుణపాఠం కావాలి. ఇక నుండి ఎవరు అయిన భారత్ లో అల్లర్లు , విద్రోహాలు చేస్తే మనం ఇంకా ఏ మాత్రం ఉపేక్షించ బోము అని అందరికి తెలియాలి.

భారతీయులు అంత సెంటిమెంట్ కి పడిపోతారు, శరణం కోరితే శత్రువుని కూడా వదిలివేస్తారు అని మన మంచితనాన్ని చేతగానితనం గా తీసుకుంటున్న ప్రతిఒక్కరికి ఇది  ఒక గుణపాఠం కావాలి.

వాళ్ళ వల్ల  ఏమి కాదు, సాక్షాత్ పవర్ లో ఉన్న ప్రధానమంత్రి ని లక్షలాది ప్రజల సాక్షి గ మనవ బాంబ్ తో పేల్చినా , పట్టుకొని కూడా ఎదో సాదారణ శిక్ష మాత్రమే  వేసారు. వాళ్ళు మనల్ని ఏమి చేస్తారు అనుకునే వాళ్ళకి ఇది ఒక గొడ్డలి పెట్టు కావాలి.

విద్రోహులకి భారత్ పేరు చెపితే వెన్నుల్లో వణుకు పుట్టాలి అన్న , భారత్ లో ఏమి తప్పు చేయడానికి అయిన భయపడాలి అన్న ఇది ఇక్కటి తో ఆగ కూడదు.

 దేశ భద్రత విషయం లో మనం యిసుమంత కూడా ఏమరిపాటు చూపకూడదు, అలాంటి విషయాలలో ఏమాత్రం దయ దాక్షిణ్యాలు చూపకూడదు. ఆవేశం లో హత్య చేసినవారిని క్షమించి ఉరి తీయక పోయిన పర్లేదు కానీ దేశభద్రత విషయం లో అలాంటి వాటికీ చోటు ఇవ్వకూడదు.

అల్లర్లు సృష్టించిన, విద్రోహ , ఉగ్రవాద చర్యలు చేసిన వారిని పట్టుకున్న వెంటనే ప్రాధమిక విచారణ పూర్తీ అవ్వగానే మరణశిక్ష విధిస్తే గాని మిగత వారు దడవారు.

భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న "లష్కర్ ఎ తో యి బా" లాంటి సంస్థల తో సంబంధం ఉన్నట్లు తెలిసినవారిని కూడా కటినం గ శిక్షించాలి.

తప్పు చేస్తే చంపుతారు అనే అంత కటినం గ శిక్షలు విదించి , వీలు అయినంత త్వరగా వాటిని విదిస్తే , ఖచ్చితం గ ఆ పనులు చేసే వారు భయపడతారు.

మనం విషపు చెట్టు ని చంపాలి అంటే కొమ్మలు కత్తిరిస్తే సరిపోదు, దాని మొదళ్ళ నుండి పికాలి అలానే ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం అనే విషపు మొక్కల్ని మొదళ్ళ నుండి ఏరి పరేయల్సిన అవసరం ఎంత అయిన ఉంది

ఇప్పటి కి అయిన 4 సంవత్సరాల సుదీర్గ వీరామం తర్వాత ఆ నిచుడ్ని ఉరి తీసి మంచి పని చేసింది,

ఆ రోజు ఆ దుర్గటన లో ప్రాణం కోల్పోయిన వారి ఆత్మా శాంతి0చాలి అని కోరుకుంటూ 

 మీ నలుగురి లో నాలుగోవాడు 


Thursday, November 1, 2012

అవును.. వీరు దేనికైనా రెడి..



నిజమేనండి వారు పెట్టిన సినిమా పేరు సార్ధకం చేసుకుంటున్నారు.. వారు దేనికైనా రెడి.
ఒక కులానికి చెందిన వారిని కించపరచడానికి రెడి.
అలా ఎందుకు చేసారు అని అడిగితే సెక్యూరిటీ వారితో, వీలు అయితే పొలీస్ వారితో కొట్టించడానికి రెడి  
వాళ్ళే  కొట్టించి మళ్లి మా ఇంటి అద్దాలు పగలు గొట్టారు అని చెప్పడానికి రెడి.
అస్సలు ఆందోళన చేసిన వారు నిజామైన వారు కాదు అని చెప్పడానికి కూడా రెడి

 సెన్సార్ వారు ఒప్పుకో పొతే వాళ్ళని బెదిరించడానికి రెడి
 చేసిన వెధవ పనిని సమర్ధించుకోవడానికి రెడి.
చేసిన తప్పు అంత చేసి మళ్ళి తిరిగి వారె కేసు పెట్టడానికి రెడి.
చేసినది అంత చేసి వారు అంటే మాకు గౌరవం అని సిగ్గు లేకుండా చెప్పడానికి రెడి  
వారి ఇంటి ఆడపడుచు ఏమో  ఆ కులం గురించి వచ్చిన "C"  గ్రేడ్ సినిమా గురించి తప్పు ఏముంది అని చెప్పడానికి రెడి.


  అస్సలు మాటార్ ఏమిటి అంటే 


 కమెడియన్ తో కాసేపు నవ్వించాల ? అయితే వాడికి ఆ కులపోడి వేషం వేయండి, వాడి చేత అన్ని తింగర పనులు చేయించండి, మాంసాహారం తినిపించండి, 
ప్రపంచం లో ఎవ్వరికి రావేమో, వారి చేత "అపానవాయువు" విడిపించండి. ఎంతటి దయనియం అంటే "మూవీ మొఘల్",  గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహిత..  అని గొప్పగా చెప్పుకునే ఒక పెద్ద నిర్మాత కూడా ఇటువంటి హేయమైన పని చేయడానికి వెనకడుగు వేయలేదు. ఛి.. వీరికి ఇన్ని బిరుదులూ ఎందుకు .సత్కారాలు ఎందుకు?    

ఒక స్టార్ కమెడియన్ అయితే ప్రతి 4,5 సినిమా లలో ఒక సినిమా ..ఆ కులవృత్తి వేషం వేసి ...వెధవ పనులు అన్ని చేస్తూ దానినే నటన, హాస్యం అని చెప్పుకోవడం ఎంతటి సిగ్గుచేటు.. వారు దానికి గాను  "పద్మ శ్రీ" లు .. నంది అవార్డులు .. ఆ కులం లో పుట్టి ఉంటే తెలిసేది అది ఎంతటి మహోన్నతమైన వృత్తో ...

 పురాణాల లో .. జంతువు లలో కల్ల "ఆవు" శ్రేష్టమైనది ,  మనుషుల లో ఆ వ్రుత్తి ఎంతో పవిత్ర మైనది అని చెప్పి వుంది.

75 సంవత్సరాల తెలుగు సినిమాల లో అనాదిగా ఆ కులాన్నే కమెడియన్స్ గా మార్చేసిన  తర్వాత ఇప్పుడన్నా ఎదురిద్దం ఇలాంటివి ఇంకా జరగకుండా చూద్దాం అని పాపం ఇన్నాళ్ళకి వారు రెడి అయిన .. అన్నిటిని పెద్ద పెద్ద బూతాద్దలు వేసి చూపించే  "పేరుగొప్ప వార్తలు దిబ్బ"  t.v. వార్త ఛానల్స్ వారు మాత్రం అన్ రెడి.

 అదేదో (కంత్రి ) సినిమాలో ఎదో ఒక సీన్ లో.. రోడ్డు మీద ఒక జాతీయ నాయకుడి విగ్రహం వుంది కాబట్టి , ఆ సదరు జాతీయ నాయకుడు ఒక కులపోడే కాబట్టి.. ఆయన విగ్రహం వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కావున  మీరు సిన్మా లో ఆ ముక్క తీసిన దాక, పాపం ఆ తొమ్మిదో  నంబర్ చానల్ హడావుడి అంత ఇంత కాదు.మరి ఆ హడావుడి ఇప్పుడు ఏమైంది.

"పురం"( గ్రామం, నగరం, పట్టణం , దేశం , రాష్ట్రం , విశ్వం)  హితం కోరే ఈ వ్రుత్తి చేసే అటువంటి వారిని ఇలా అవహేళన చెయ్యడం ఎంతటి ధవుర్భాగ్యం


 ఇలాంటివి ముందు ముందు అన్నా జరగకుండా ఆపాలని అ దేవుడిని ప్రార్దిస్తూ..

 మీ నలుగురి లో నాలుగోవాడు ..

Saturday, August 11, 2012

జులాయి సినిమా రివ్యు Julayi movie review



చాల రోజుల తర్వాత , కాదు చాల సంవత్సరాల తర్వాత నేను మొదటి రోజు, మొదటి అట సినిమా చూసా.
అది త్రివిక్రమ్ మీద ఉన్న అభిమానం. అయన నా లాంటి ఎందఱో అభిమానుల నమ్మకం వమ్ము చేయలేదు.
         
రవి (అల్లు అర్జున్ ) పట్టభద్రుడు అయిన ఒక జులాయి, ఒకే రోజులో బాగా ధనవంతుడు అవ్వాలని ఆశ తో వాళ్ళ నాన్న (భరణి) తో గొడవ పడి, 10 వేలు తీసుకోని, క్రికెట్ బెట్టింగ్ కి వెళ్తాడు. అక్కడ నుండి కథ మొదలు అవుతుంది.
వెళ్ళే దారి  లో, అతనికి "సోను సుద్" మరియు ఇతర వ్యక్తులు తారస పడతారు, వారు ఒక బ్యాంక్ దోచు కోవడం మొత్తం 1500 కోట్ల దోచుకొని, దాని తో దేశం దాటి వెళ్ళటం అతని ప్రణాళిక దానిని మన రవి ఎలా ఆపాడు అన్నది స్టోరి.



                                                  
కథనం:  త్రివిక్రమ్ తన పదునైన పంచ్ మాటల తో మరో సారి మనల్ని సమ్మోహితుల్ని చేస్తాడు.
 "లాజిక్ లు ఎవరూ నమ్మరు.. అందరకీ మ్యాజిక్ లే కావాలి... అందుకే మన దేశంలో సైంటిస్టు కన్నా బాబాలే ఫేమస్..."  అని అందరితో  విసిల్స్ వేయించి   

హాస్పిటల్ సీన్ లో తనికెళ్ళ  భరణి తో చెప్పించిన , "నువ్వు ఆ పదివేలు తిసుకేల్లకపోతే , మీ అమ్మ నీ కోసం ఇష్టమైన పకోడీ లు  చేసిది, మీ చెల్లెలు అల్లరి చేస్తూ ఉండేది, మనం హాయ్  టీవీ చూస్తూ ఉండేవాళ్ళం అది ర నిజమైన ఐశ్వర్యం " అందరి చేత కంట తడి పెట్టించింది.

నేను తెలివైన వాణ్ణి అని చెప్పించడం, బాగా వచ్చింది.

హిరోయిన్ తో స్టోరి కి ఒరిగింది ఏమి లేదు,  ఇంకా ఆలీ ఎందుకో ఏమిటో ఎవ్వరికి తేలేదు. తెలివి లేని దొంగ గ బ్రహ్మానందం బాగా చేసారు.

  మొత్తం మిద ఇంట్లోని వారందరు  సరదాకి వెళ్లి చూడగలిగిన  సినిమా.

నా రేటింగ్   3.5 /5        
     

Saturday, July 21, 2012

తొలిచూపు, తొలివలపు....ఇంకా జీలకర్ర బెల్లం

తొలిచూపు   తొలివలపు  Love at first Site ...
ఈ  పదములు లేకుండా , ఏ  సినిమా ఉండదు అనుకుంటా ...ఎందుకంటే  వాటికీ అంత క్రేజ్ ఉంది .. యువతరం లో ..
నాకు తెలిసి ప్రతి ఒక్కరి జీవితం లో అది జరుగుతుంది , మీకు తెలియకుండా జరిగి ఉంటుంది. కాదంటారా ? చదవండి .. నాకు చెప్పండి ... తోలి చూపు ... తోలి వలపు మీకు ఉందొ లేదో ...


మీకు పెళ్లి అయ్యిందా? నాకు  కొత్త గ పరిచయం చేయిన సహోద్యోగి ప్రశ్న వేసాడు?  
నా  సమాధానం హ అయ్యింది. 


అతని తరవాతి ప్రశ్న  ప్రేమ పెళ్లి ? పెద్దలు నిర్నయిచినదా  ..?
సమాధానం . పెద్దలు  నిర్ణయించిన ప్రేమ పెళ్లి ... 


"వావ్" అయితే మీరు పెద్దల్ని ఒప్పించార మీ పెళ్లి కి?
 లేదు వాళ్ళు మాకు "గ్రీన్ సిగ్నల్" ఇచ్చాక ప్రేమించా


అంటే అందరి లాగా నే మీది మాములే అన్న మాట? ప్రేమ , తొక్క అంత కవరింగ్ ...
కాదు,నాకు తొలిచూపు, తోలి వలపు జరిగింది, కాబోతే కాలేజ్ లోనో , ఆఫీస్ లో నో.... దొంగ చాటుగ కాదు ..


అబ్బ చ? నిజామా ? ఇంకా చెప్పు ... వాడి మాట లో వెటకారం నాకు అర్ధమయ్యింది.
నా సమాధానం .వాడి కి అర్ధమయ్యేలా ఉండాలి .అనుకున్న


నువ్వు ఎప్పుడైనా శుభలేఖ చూసావా ? అందులో బాగా ముఖ్యమైనది ఏమిటి ?   ఇది నా  ప్రశ్న
Ya, ముహూర్తం 
అప్పుడు, అంటే ఆ టైం కి కరక్ట్ గా ఏమి  చేస్తారు ?
తాళి కడతారు , ఓహ్ నో .. జీలకర్ర, బెల్లం పెడతారు 


yes, అప్పటి దాక , ఎదురు ఎదురుగ కూర్చోబెట్టి , ఇద్దరి మధ్య లో తేర ఒకటి ఉంచి, జీలకర్ర బెల్లం తల మిద ఉంచి అప్పుడు తెర తీస్తారు..ఎందుకో తెలుసా? మన మాడు మీద భ్రహ్మ రంద్రం ఉంటుంది, అది ఎప్పుడు మూసుకొని ఉంటుంది, ఎప్పుడయితే , అది తల మిద పెడతారో అది తెరుచుకొని మన ఎదురుగ ఉన్న వారి రూపం మిద తొలిచూపు లోనే తొలివలపు చిగురిస్తుంది .. అది జన్మ జన్మలకు గుర్తు ఉంటుంది.

అందుకే మన పెళ్ళిళ్ళు ఒక్క రోజు కూడా పరిచయం లేని వాళ్ళ మధ్య కూడా 7 జన్మలు మీరే కావాలి అనేలా చేస్తుంది.. అర్ధమయ్యింది అనుకుంటా ?

ఇప్పుడు అర్ధమయ్యింది,  పెళ్లి లోని మ్యాజిక్ అండ్ మ్యూజిక్

మీరేమి అంటారు ?

Wednesday, July 18, 2012

నువ్వు అక్కడ ఉంటే ....నేను ఇక్కడ ..

గోపి గోపిక గోదావరి సినిమాలో .. ఒక పాట ఉంది .. ఆ  సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కనపడలేదు కానీ , ఈ పాట "నువ్వు అక్కడ ఉంటే  ..నేను ఇక్కడ ఉంటె ప్రాణం విల విల " అనే పాట డయలర్ పాట గ పెట్టు కున్న వాళ్ళు చాల మందినే చూసా..

ఇక్కడ పాట మాటర్ కాదు కానీ ... ఆ లిరిక్స్ ఎందుకో బాగా ఒక నెల నుండి ..బాగా తలుచుకున్న .. ఎందుకబ్బా ? అని మరి  ఎక్కువగా "చించకండి" .. విషయం ఏమిటంటే .. :"ఆషాడ మాసం" .

హమ్మయ అయిపొయింది అనుకుంటే ... ఇప్పుడు  "శ్రావణ మాసం"  నోములు వ్రతాలూ ..

మళ్లి  ఇంకో నెలన "ఓ................. నో ...... " నాకు కుదరదు, నా వల్ల కాదు ..అని గట్టిగ అరిచి చెపుదాం అనుకుందాం .. కానీ

అక్కడ  "బొమ్మరిల్లు" ఫాదర్ కదా ...నాకు డైలాగ్ ఒక్కటే ఇచ్చారు చిన్నప్పటి నుండి "సరే నాన్న, అలానే చేస్తా "

మళ్లి అదే సీన్, అదే డైలాగ్  ... సరే నాన్న , అలానే అని ..

ఈ  పెద్దోళ్ళు ఉన్నారే చిన్న వాళ్ళని అర్ధం చేసుకోరు ....


అదే మాట అన్నయ్య తో అంటే .. "ఎడబాటు లోనే అసలు ప్రేమ చిగురిస్తుంది" అని చెప్పాడు, అనుభవం నేర్పిన పాఠం అనుకుంట.. 


వదిన తో అంటే,  మేము ఏమి చేసిన అది బర్త, పిల్లలు బాగుండాలి అనే బాబు, మేము ఉపవాసం చేసిన మీ కోసమే   
పూజలు చేసిన మీ కోసమే... అన్నారు..

అవును అనాలేమో ... కాదు . అనకుండ ఉండ్లేమేమో ..

ఈ పాట "నువ్వు అక్కడ ఉంటే  ..నేను ఇక్కడ ఉంటె ప్రాణం విల విల " ఇంకో నెల తప్పదేమో ....


ఐడియా వాడికి నెలకి ఒక వెయ్యి , 1500, తప్పదేమో ..........
      
అదిగో  ఫోన్  మ్రోగుతుంది  ......"ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్లు ఉందే ...."   

Tuesday, July 17, 2012

ఇంటి పేరు కస్తూరి వారు...... ఇంట్లో.....

నేను  మా అమ్మ గారి తో రోజు లాగానే మాట్లుడుతూ ఉండగా , ఏదో విషయం గురించి ప్రస్తావిస్తూ  "ఇంటి పేరు కస్తూరి వారు...... ఇంట్లో....గబ్బిలాల కంపు" అన్నారు..

నాకు ఆ సామెత వినగానే అమ్మ చెప్పిన విషయం కన్నా దానికి సరిగ్గా సరిపోయే పరిస్తితి మన రాష్ట్రానిది అనిపించింది. అది ఎలానో .. నా ఈ వర్షన్ లో ...

దేశం లో నాలుగో అతిపెద్ద రాష్ట్రం విస్తీర్ణం లో ... వార్షిక బడ్జెట్ లక్ష కోట్లు పై మాటే ,..

జనాభా లో 5 వ స్తానం  ... అక్షరాస్యత లో .. 24 వ స్తానం

ఎయిడ్స్ లో 3 వ స్తానం .... నేరాలు ఘోరాలు లో మొదటి 10 లోపే ..

దేశం తరుపున అడ గల ఆటగాళ్ళు, దశాబ్దానికి ఒక్కరు మాత్రమే ..అది ఎ రంగం అయిన...కానీ అవినీతి ఆరోపణల తో కోర్టు గుమ్మం ఎక్కినా వాళ్ళ లో రాష్ట్రం కాబినెట్ తరుపున .. దేశం లోనే అందరికన్న ముందు ...


రాష్ట్రాన్ని పరిపాలించేది 130 సంవత్సరాల కాంగ్రెస్స్ ... కేంద్రం మరియు రాష్ట్రం లో ఒకే ప్రభుత్వం .. 33 మంది అధికార MP లు ...ఒకటి , అర  రైల్వే ప్రాజెక్ట్ తోనే సరి .. కొత్త రైలు ఒక కల , ఒక పరిశ్రమ అది అందని ద్రాక్ష   


రాష్ట్రం లో రైతు లందరికి  ఉచిత విద్యుత్ ...9 గంటల నిర్విరామ విద్యుత్ ప్రసారం .. 
ఇది ఎన్నికల ముందు ఒక వాగ్దానం .

రాష్ట్రం లో కరెంట్ లేక చిన్న పరిశ్రమ ల నుండి ..పెద్ద వాటి వరకు  సరఫరా 4,5 రోజులు మాత్రమే .. కేవలం రాష్ట్రం లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు మరియు  జలం నుండి మాత్రమే ..వానలు పడక పొతే .. విద్యుత్ సంక్షోభం ..
అప్పుడు అన్నదాతల కే కాదు ..అందరికి కరెంట్ కట్ .. 


కానీ వాస్తవానికి రాష్ట్రం లో ఇసుమంత లోటు లేకుండా ప్రవహించేది .. మద్యం ఒక్కటే ..


కష్టాల కడలి లో ఆంధ్ర ప్రదేశ్ 

రాష్ట్రం లో  అర్హులు అందరికి  ఫీజ్ ..రీఎమ్బర్స్    చేస్తాం .. ఇది మరియొక ఎన్నికల వాగ్దానం ,  ఇంకా రాష్ట్రం బి.సి, యస్.సి , యస్.టి ఉపకార వేతనాలు 2010 సంవత్సరానివి .పూర్తిగా ఇవ్వలేదు ..చాల ప్రభుత్వ బడులలో ఇంకా పుస్తకాలూ , యూనిఫం లు ఇవ్వలేని ప్రభుత్వం ..


హైదరాబాద్ ని ఒక గొప్ప పారిశ్రామిక నగరం గా తిర్చిదిద్దుతం, ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తాం  -- వా స్తవానికి గత 5,6 సంవత్సరాలు గ బాగా వెనక పడిన ప్రాంతం ఏదైనా ఉంటె అది మన హైదరాబాద్ మాత్రమే ..ఎ ఒక్క కొత్త కంపెని రాలేదు , పెట్టుబడి పెట్టలేదు ..ఆంధ్ర ప్రదేస్ లో అభివృద్ధి ఏమైనా జరిగింది అంటే అది కేవలం అవినీతి లోనే ..


అర్హులైన నిరు పేదల అందరికి, వికలాంగులకి ఫించన్ సౌకర్యం ఇస్తాము ,  -- చాల చోట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయలేని ప్రభుత్వం .. 

రాష్ట్రం లో తెల్ల కార్డు ఉన్న వారందరికి ఉచిత కర్పోరేట్  స్తాయి వైద్యం కానీ 104, 108 ఉద్యోగులకు జితాలకు డబ్బులు కట్టలేదు, 108 వాహనాలకు మరమత్తు చేయించలేదు ...

నితివంతమైన , అవినీతి రహిత , పారదర్సక మైన ప్రభుత్వం మాది, ---- వాస్తవానికి, అవినీతి కి పాలుపడి, నోటిసులు అందుకున్న కళంకిత మంత్రులకి .. అవసరం అయిన న్యాయ సహాయం ..

మహిళా అభివృద్ధి కోసం ప్రత్యెక మైన ప్యాకేజి లు ... కానీ మహిళ ల పై అత్యాచారాలను అదుపు లో ఉన్చేలేని ప్రభుత్వం ...

సాక్షాత్త్  హొo మినిష్టర్ ఒక మహిళా అయి ఉoడి,  ఒక అయేషా, ఒక ప్రత్యూష, ఒక శ్రీ లక్ష్మి విజయవాడ , గుంటూరు, వరంగల్ , తిరుపతి , హైదరాబాద్ , విశాఖ .ఏ ఒక్క నగరం, పట్టణం లో  ఆడ పిల్ల లకి ,  చిన్న పిల్లలకి రక్షణ లేదు, స్కూల్ కి, లేదా కాలేజి కి వెళ్ళిన పిల్లలు తిరిగి ఇంటికి వస్తారో రారో అని భయపడాల్సిన పరిస్తితి ..  

జలయజ్ఞo మొదలు పెడతామ్   , ప్రాజెక్ట్ లు పూర్తీ చేస్తాం .. కానీ పక్క రాష్ట్రాల నుండి మనకు రావాల్సిన నీటి ని మాత్రం తీసుకురాలేము .  

మద్యం  దుకాణాల పైన అదుపు లేదు , ప్రైవేట్ స్చూల్స్ పైన హద్దు  లేదు, ప్రైవేట్ వాహనాల పైన నియత్రణ లేదు .. 


ఉన్నదల్ల ఒక్కటే ..  పదవి కాంక్ష   .. అధికార వ్యామోహం .. ధన దాహం.  



Sunday, July 15, 2012

వివాహం .. పెళ్ళి .. పరిణయం ..







ఇందాకనే మా స్నేహితుడు .. ఫోన్ చేసాడు ...  ఏమిటి రా  విశేషాలు అంటే ...  జూలై 26న  "నా పెళ్లి అన్నాడు" 

పెళ్ళా ? ఎందుకు అన్న?..  వాడికి  "మన్మధుడు" సినిమా గుర్తు వచ్చి నట్లుంది .. నవ్వాడు .. ఎమీ ర ? మొన్ననే కదా ర 5 నెలలు కూడా కాలేదు కదా ..నీ  పెళ్ళి  అయ్యి ... అన్నాడు ..  నువ్వు ఎందుకో నేను కూడా అందుకే అన్నాడు ....

సరే పెళ్లి తర్వాత ఏమిటి అన్న? ఏమిటి బాబాయి బాగా రొమాంటిక్ గ తయారయ్యావు? ఏమిటి సంగతి అన్నాడు ...

మా నాన్నగారు చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పారు ... "ఎ పని అయిన ఎందుకు చేస్తున్నామో తెలిస్తే ..ఆ పని ఇంకా ఎక్కువ మనుసు పెట్టి చేస్తాం" అని .. ఆ మాట వాడికి చెప్పా ...


ఏమో బాబాయి .. ఎవరో ఒకరు చెపితేనే కదా తెలిసేది అన్నాడు ... హ హ అని నవ్వి విషెస్  చెప్పి ఫోన్ కట్ చేశా ..

ఇంతకీ  పెళ్లి ఎందుకు ఏమిటి ఎలా ?  .......... ఇదిగో చదవండి......

ఈ  టప ముక్కామల జనార్ధన శర్మ గారు రచించిన  "పాణిగ్రహణం" నుండి సంగ్రహించినది ..

సాయి సుసర్ల గారి కి ధన్య వాదములు .. ..అలాంటి ఒక మంచి పుస్తకాన్ని స్కాన్ చేసి అంతర్జాలం లో పెట్టి నందుకు ..
 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~వివాహం~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మనువు వివాహ పద్దతులను 8 రకాలు గ  విభజించారు ..

1. బ్రాహ్మo  2 దైవం 3. ఆర్షం 4 ప్రాజపత్యం 5 ఆసురం 6 గాoదర్వం  7 రాక్షసం 8 పైశాచం

1) బ్రాహ్మo అంటే    అలంకరించిన కన్యను పoడితుడు, శిలవతుడు, అయిన వరుడిని పిలిచి దానం ఇవ్వడం ...

అంటే మనం ఈ రోజుల్లో చేసుకునే పెద్దలు నిర్ణయించిన పెళ్లి అన్న మాట   

6) గాoర్వం  అంటే వధు వరులు ఇరువురు పరస్పర అనురాగంతో మంత్రములు లేకుండా చేసుకోవడం ..
 అంటే  ప్రేమ పెళ్లి అన్నమాట ...


వివాహం ఎందుకు?


మనిషి పుడుతూనే 3 రుణాలు తో పుడతాడు ...

1) రుషి ఋణం 2) దేవ ఋణం 3) పితృ ఋణం

ఋషి ఋణం మంచి విద్యను, పురాణాలను అభ్యసించి వాటిని తరవాత తరం వారికీ అందిచటం ద్వారా ఈ ఋణం తీరుతుంది.

దేవ ఋణం మన యజ్ఞము లు , క్రతువులు నిర్వహించుట ద్వారా ఈ ఋణం తీరుతుంది ..

పితృ ఋణం మంచి సంతానం కనటం ద్వారా ఈ ఋణo తీరుతుంది..

వేద అధ్యయనం, యజ్ఞo  చేయటం, సంతానం కనటం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలిసిన విధులు.

ప్రతి మానవుడి జీవితం లో నాలుగు  దశలు ఉంటాయి

అవి 1) బ్రహ్మచర్యం 2) గృహస్తం 3) వానప్రస్తం  ఇంకా 4) సన్యాసం

బ్రహ్మచర్య దశ లో నియమ నిష్ఠలతో విద్యాబ్యాసం చేయాలి ..

గృహస్త ఆశ్రమం లో.. వివాహం చేసుకొని చక్కని సంతానాన్ని కలిగి వారిని సమాజం లో మంచి వ్యక్తులు గ తీర్చిదిద్దాలి ..

వానప్రస్తం లో  పిల్లలకు వివాహాది కార్యక్రమములు నిర్వహించి మన భాద్యతలని నేరేవేర్చాలి .

సన్యాసం లో రాగా ద్వేషాలని విడిచి భగవంతుని ధ్యానం లో నిమగ్నమవటం ...

పెళ్లి  ఎవరితో.... ఎప్పుడు .....? 


భారతీయులకి, వివాహం ఒక వేడుక, ఉత్సవం కాదు అది ఒక సంస్కారం .. అందుకే మన లో వివాహానికి అంతటి విలువ.
వివాహ వయస్సు ఈ నాటి పరిస్తితుల లో 18-25 ఉత్తమం. 


ఎంపిక  ఎలా ? 


బుద్దిమంతులు, తెలివిగల 4 మిత్రులను వెదుకుటకు పంపుతారు,  వారు నలుగురిని విచారించి అటు వైపు వారికీ , ఇటు వైపు వారికీ కనీసం 3 తరాలు తక్కువ కాకుండా వివరములు తెలుపుతారు.


అలా  తెలుసుకున్నట పిమ్మట   తమ  అంగీకారం తెలుపుటకు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు..


మంగళ సూత్ర ధారణ , దాని విశిష్టత



   







   

EEGA Movie Review --- ఈగ సినిమా రివ్యూ.....



చాలా  రోజుల తర్వాత నాకు ఎందుకో  సినిమా రివ్యూ రాయాలని అనిపించింది .. కాదు "ఈగ" సినిమా,  రాసేలా నన్ను పురిగొల్పింది. కేవలం "ఈగ" మీద  నా కున్న అభిమానమే ఈ టప ...


నాన్న, తాతయ్య , బామ్మా , అమ్మ వీళ్ళందరూ బాగా బిజి అయ్యారు ... ఎంత లా  అంటే .. పిల్లలు "కథ" చెప్పమంటే  కార్టూన్ ఛానల్ లేపోతే కామిక్ బుక్ చదువుకో మని చెపుతున్నారు ... అది వాళ్ళ తప్పు  కూడా కాదు మన లైఫ్  మనల్ని అలా లిడ్ చేస్తుంది ... అలాంటి దగ్గరే మొదలయిన ఈ సినిమా "ఈగ"  

కాస్త  ఎమోషన్  ,  కాస్త రిలీఫ్ .. , కా స్త  ఆశ్చర్యం  ..   మన "ఈగ" .....

 స్పైడర్ మాన్, అద్బుతం అమోఘo .. హ్యరిపోట్టర్ ..అద్వితీయం అని పరాయి వా ళ్ళ సినిమాని మన బాష లోకి అనువదించి చూసుకోవడం ... రోబో  సినిమా ని మన సినిమా అనుకోవడమే మన సంతృప్తి ... తెలుగు లో మంచి సినిమాలు  రావు ర ... మన వాళ్ళ కి మన అంత సినిమా లేదు అనే వాళ్ళకి మన "ఈగ" .సమాధానం ..


రాజమౌళి   స్టాంప్ , వేస్తె అది అద్భుతం అని అందరకి తెలిసిన విషయమే .......... 

ఒక భారి బడ్జెట్ సినిమాని "super star " అనే హోదా లేని ఒక చిన్న హీరో ని పెట్టి చేయడం .... అందులోను 5% మాత్రమే హిట్ పర్సెంట్ ఉన్న తెలుగు లో తీయడం నిజం గ కథ మిద రాజమౌళి కి ఉన్న నమ్మకమే ... 

ఈగ ఒక మాములు ప్రేమకథ .. చిన్నప్పుడు ..చూసి  కేరింతలు కొట్టిన "విటలాచర్య" సినిమా లాంటి సినిమా ..

తెలుగు లో తీసిన ఒక "అవతార్", ఒక "స్పైడర్ మాన్", ఒక "జురాసిక్ పార్క్"  ..ఒక "గాడ్జిల్ల " .. 

సోది చెప్పా కదా  .. కథ చెప్పలేదు కదా  ... 

ఇది కధ ఏమిటి అని అడగవలసిన సినిమా కాదు, కేవలం హీరో పోస్టర్ చూసి వెళ్ళవలసిన సినిమా అస్సలే కాదు ..

అందరు ... ఇంటిల్లిపాది  "సినిమా హాల్" లో మాత్రమే చూడవలసిన సినిమా ...




         



 

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి