Sunday, July 15, 2012

EEGA Movie Review --- ఈగ సినిమా రివ్యూ.....



చాలా  రోజుల తర్వాత నాకు ఎందుకో  సినిమా రివ్యూ రాయాలని అనిపించింది .. కాదు "ఈగ" సినిమా,  రాసేలా నన్ను పురిగొల్పింది. కేవలం "ఈగ" మీద  నా కున్న అభిమానమే ఈ టప ...


నాన్న, తాతయ్య , బామ్మా , అమ్మ వీళ్ళందరూ బాగా బిజి అయ్యారు ... ఎంత లా  అంటే .. పిల్లలు "కథ" చెప్పమంటే  కార్టూన్ ఛానల్ లేపోతే కామిక్ బుక్ చదువుకో మని చెపుతున్నారు ... అది వాళ్ళ తప్పు  కూడా కాదు మన లైఫ్  మనల్ని అలా లిడ్ చేస్తుంది ... అలాంటి దగ్గరే మొదలయిన ఈ సినిమా "ఈగ"  

కాస్త  ఎమోషన్  ,  కాస్త రిలీఫ్ .. , కా స్త  ఆశ్చర్యం  ..   మన "ఈగ" .....

 స్పైడర్ మాన్, అద్బుతం అమోఘo .. హ్యరిపోట్టర్ ..అద్వితీయం అని పరాయి వా ళ్ళ సినిమాని మన బాష లోకి అనువదించి చూసుకోవడం ... రోబో  సినిమా ని మన సినిమా అనుకోవడమే మన సంతృప్తి ... తెలుగు లో మంచి సినిమాలు  రావు ర ... మన వాళ్ళ కి మన అంత సినిమా లేదు అనే వాళ్ళకి మన "ఈగ" .సమాధానం ..


రాజమౌళి   స్టాంప్ , వేస్తె అది అద్భుతం అని అందరకి తెలిసిన విషయమే .......... 

ఒక భారి బడ్జెట్ సినిమాని "super star " అనే హోదా లేని ఒక చిన్న హీరో ని పెట్టి చేయడం .... అందులోను 5% మాత్రమే హిట్ పర్సెంట్ ఉన్న తెలుగు లో తీయడం నిజం గ కథ మిద రాజమౌళి కి ఉన్న నమ్మకమే ... 

ఈగ ఒక మాములు ప్రేమకథ .. చిన్నప్పుడు ..చూసి  కేరింతలు కొట్టిన "విటలాచర్య" సినిమా లాంటి సినిమా ..

తెలుగు లో తీసిన ఒక "అవతార్", ఒక "స్పైడర్ మాన్", ఒక "జురాసిక్ పార్క్"  ..ఒక "గాడ్జిల్ల " .. 

సోది చెప్పా కదా  .. కథ చెప్పలేదు కదా  ... 

ఇది కధ ఏమిటి అని అడగవలసిన సినిమా కాదు, కేవలం హీరో పోస్టర్ చూసి వెళ్ళవలసిన సినిమా అస్సలే కాదు ..

అందరు ... ఇంటిల్లిపాది  "సినిమా హాల్" లో మాత్రమే చూడవలసిన సినిమా ...




         



 

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి