Thursday, December 29, 2011

అనుకున్నంత అయ్యింది

అనుకున్నంత అయ్యింది ... అదే జరిగింది ..మళ్ళి మళ్ళి అదే జరుగుతుంది ... 40  రోజుల పాటు చేసిన సకల జనుల సమ్మె ఇప్పుడు కరెంట్ చార్జీల రూపం లో మన మెడకు చుట్టుకోబోతుంది .... ఇప్పుడు సదరు  "కే.సి.ఆర్", హరీష్ రావ్ , కోదండ రామ్ ఎవ్వరు రారు మీ ఇంట్లో పవర్ బిల్ కట్టడానికి ..ఎందుకు అంటే వాళ్ళకు ఇది వర్తించదు ..వర్తించిన వారిని బాదించదు...

నష్టం ఎవ్వరికి జరగబోతుంది? 

సకల జనుల సమ్మెలో కరెంట్ లేక, బస్సులు లేక ఇబ్బంది పడ్డది ఎవ్వరు? 
ఇప్పుడు కరెంట్ బిల్ బాదించేది ఎవ్వరిని?

మొన్న ఆర్.టి.సి చార్జీలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?

నిత్య అవసర వస్తువులు ధరలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?

రాజకీయ నాయకులు అదే చదరంగం లో పావులు ఎవ్వరు? 

మనం సాదించింది ఏముంది ? తెలంగాణా వచ్చిందా ? ...          


మనం చేసే పనులు మళ్ళి మళ్ళి మనకే ముప్పు తెస్తాయి అని తెలిసి కూడా తప్పు చెయ్యడం కన్నా వేరే ఒక అమాయకత్వం వేరే ఏమి లేదు ....

ఇప్పటికన్నా మేల్కొందాం ...... 


Friday, October 14, 2011

మీరు ఆలోచిస్తున్నార?

మీరు ఆలోచిస్తున్నార?  మీకు ఆలోచించే శక్తి ఉన్నదా?
మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా?

ఇలాంటి ఒక ప్రశ్న మీకు మీరు వేసుకుంటే ఇవ్వాళా ఉన్న ఈ పరిస్తితి లో మార్పు వస్తుంది.

మన జీవితాలను మనమే పణం గ పెడుతున్నాము ... ఇవ్వాల్టి రోజున జరిగే ఈ బందుల వలన ఎంతమంది ఆకలి తీరని రోజులు గడుపుతున్నారో మీకు తెలుసా.  ప్రబుత్వం ఇచ్చే  500 /- ఫించన్ తో గడిపే వారికీ ఈ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయక పోవడం వలన అవి చేతికి రాక ఆకలి తో పడుకునే వారికీ మీరు ఏమి సమాధానం చెబుతారు..


తెరవని కాలేజిలో మన విద్యార్ధుల జీవితానికి మనమే తాళం వేస్తున్నాము...

గిన్నిస్ బుక్ లో స్థానం సాదించిన మన  "ఆర్ టి సి" ని అప్పుల    ఊబి లోకి నేడుతున్నాము ...చివరికి మన సొంత ఉరు వెళ్లటానికి ఒక బస్ లేకుండా చేసుకుంటున్నాము..


నష్టం వస్తుంది అని ..వాళ్ళు రేపు చార్జీలు పెంచితే .... ఇది పక్క రాష్ట్రాల నుండి కొనుక్కివచ్చిన విధ్యుత్ అని మళ్ళి చార్జ్ పెంచితే ... నెల తిరగకుండా లక్ష చేతికి వచ్చే కోదండరామ్  వచ్చి మీ ఇంటి కరెంట్ బిల్ కడతాడ? .. మీరు ప్రయాణం చేసే బస్ టికెట్ కొని పెడతాడ?

ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు జీతం రాకపోయినా తర్వాత కచ్చితం గ ఇస్తారు .. .ఖర్చు పెట్టె ప్రతి రుపాయకి  పని చేయిన్చోకోవాలని చూసే ప్రైవేట్ యాజమాన్యాలు ..ఈ బంద్ జరిగిన రోజులకి జీతం ఇవ్వక పొతే ... మీ ఇంటి రేషన్ "కే సి ఆర్" వచ్చి తెచ్చి పెడతాడ? ...

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ... ప్రతి ఒక్కరికి పిలిచి ఏమైనా ఇస్తార ? .. అప్పుడు కూడా మెరిట్ లోనే సాదించాలి కదా ...? పెట్టుబడులు తగ్గిపోతే ..ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి ..అప్పుడు వాళ్ళ పరిస్తితి ఏమిటి?
రాష్ట్రం విడిపోతే నియామకాలలో లబ్యత కూడా తగ్గుతుంది కదా ? ఆ విషయం ఎవరికీ పట్టదా?

౩౦ రోజుల ఈ సమ్మె లో మీరు ఏమి సాదించారు ...? ఎంతమంది జీవితం పై నీళ్ళు చల్లారు ..?

ఆలోచించండి ... మీకు అ భగవంతుడు పొరపాటున ఆలోచించగలిగే శక్తి ని ఇస్తే?











     
  

దూకుడు సినిమా రివ్యూ ...........[Dukudu movie Review ]

చాలా కాలం తర్వాత నేను నా బ్లాగ్ జోలికి వచ్చా .... ఈ మధ్య బొత్తిగా సమయం దొరకట్లేదు .....కానీ నిన్న నేను చూసిన దూకుడు సినిమా గురించి తప్పకుండ చెప్పాలి ... 

ఈ మధ్య "ఎ సినిమా చూస్తే ఏముంది గర్వకారణం ... సినిమాల చరిత్ర మొత్తం ..రక్తపాతం .." అన్నట్లు సాగుతున్నాయి .. ఒకడు కత్తి పట్టుకొని 100 మందిని ఒక్కసారి చంపితే ..ఇంకో హీరో "గన్" పట్టుకొని 200  మందిని చంపుతున్నాడు .. 

విటన్నిటిని దాటి వచ్చిన సినిమా .. ఈ దూకుడు ............

చాలా బాగుంది ... సినిమా మొత్తం ఒక సన్నటి దారం మీద అల్లిన పూలదండల ..ఒక చిన్న కధని మంచి కామెడి తో చక్కగా అల్లాడు ...

ఈ మద్య కాలం లో వచ్చిన మంచి సినిమా ... మీ ఫ్యామిలి మొత్తం కలిసి కూర్చొని చూడదగిన చిత్రం ..

మహేష్ బాబు మంచి టైమింగ్ ..బ్రహ్మి టాలెంట్ ...m  s నారాయణ కామెడి ఈ సినిమాకి పెద్ద హైలెట్.. 

నా రేటింగ్ .... 4 / 5  ........ 

Sunday, May 29, 2011

ఉపనయనము ..ముందు..ముందుగా ..

 మనందరికి ..చిన్నప్పటి నుండి జరగబోయే దాని గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం... నేను కూడ అందరి లాంటి వాడినే.. రాబోయే.. తరగతి పాఠాలు ముందే వేశవి సెలవలలో.. చదవటం ..వాటి గురించి తెలుసుకోవటం ఒక చిన్న కుతుహలం .. ఇలానే అందరికి ఉంటుంది లేండి లేపోతే ..ఈ జ్యోతిష్యాలు .. జాతకలు .ఎక్కడినుండి వస్తాయి ...  అస్సలు సంగతి లోకి వస్తే ..మా అమ్మ నాన్న, నాకు ఉపనయం చేస్తామన్నారు..నేను సరే అన్నాను ..

   అస్సలు ఉపనయనం అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు ? కేవలం జన్మత: బ్రాహ్మణ అయినందుకు ..పెళ్ళికి ముందు జరిగే చిన్న తంతు మాత్రమేనా ? అని చిన్న సందేహం వచ్చి.. అస్సలు ఉపనయనం ఎందుకు? ఎమిటి? ఎలా? అని చిన్న పరిశోధన.. దాని ఫలితం ..ఇదిగో ఇలా .......

మన సనాతన హిందు ధర్మం అనుసరించి ..ప్రతి మనిషి ..పుట్టకు ముందు 3,జన్మించిన తరవాత 12, మరణించిన తర్వాత 1 ..ఇలా మొత్తము 16 ..వీటిని వైదిక సంస్కారాలు అని .. షోడశ సంస్కారాలు ..అంటారు ..  వాటి లో ..ఒకటి  ఉపనయనం ముఖ్యమైనది..ఈ కాలం లో కేవలం కొన్ని కులాలు మత్రమే ఆచరిస్తున్నాయి ..    .


అర్ధం - అంతరార్ధం ..

ఉప+నయనము.  అనగా జ్ఞాన నేత్రమును పొందుటకు  గురువు వద్దకు  తీసుకువెళ్ళుట  అని అర్ధము.  ప్రతి మనిషి తల్లి గర్భము నుండి  పుట్టుట మొదటి జన్మ కాగా, గురువు ద్వారా  ఐహికముష్మిక విద్య  అభ్యసించి  గురుకులమునుండి  బయటికి వచ్చుట రెండవ జన్మ  అంటారు.   దీనినే మనిషికి మూడవ నేత్రము - జ్ఞాన  నేత్రమును ప్రసాదించే సంస్కారము అందురు.

ఉపనయన సంస్కార ప్రారంభమున  వటువు మూడు సమిధలను తీసుకొని గురువు వద్దకు వెళ్ళును.   గువుగారు వాని యొక్క  భుజస్కందాల  పైఉన్న త్రివిధ ఋణములు  తీర్చుకొను  విధానమును బోధిస్తూ, తన చేతిలో  గల మూడు సమిధలను అగ్ని సాక్షిగా  ప్రమాణము చేయిస్తూ యజ్ఞములో  ఆ మూడు సమిధలు  వేయించును. ఆ మూడు ఋణములు ఏమిటంటే ౧. పితృఋణము    ౨.  ఋషిరుణము  ౩. దేవరుణము.  ఈ మూడు ఋణములు తీర్చుకొనుటకై  ప్రతిక్షణము  గుర్తుచేయుటకు గురువుగారు ఆ వటువుకు మూడు పోగులు  గల దీక్షాచిహ్నము - యజ్ఞోపవీతమును  వేయుదురు.  ఇది జ్ఞాన చిహ్నము .


ఎలా - ఎందుకు ..


అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.
ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాతే మారుతూ వచ్చాయి. అథర్వవేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించబడింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:
బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం(జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.


విధి .. విధానం ..



ఉపనయన విధులు బ్రాహ్మణులకు,క్షత్రియులకు మరియు వైశ్యులకు విధులు వేరు వేరుగా ఉంటాయి.
బ్రాహ్మణులకు 8 సంవత్సరాలవయసులో [ అనగా పుట్టిన రొజుకు 7 సంవత్సరాల 3 నెలల లొపు ] క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో,వైశ్యులకు 12 సంవత్సరాల వయలో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం.ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నారవస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి.అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి.ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డి నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు.మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి.నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి.అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి.ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి.గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి తరవాత గురువు అనుమతితో భుజించాలి.అవశిస్ఠాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి.భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి.ఆతరవాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి.ముందుగా తల్లిని కానీ,సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమమం.అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం.ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు.ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు.అందరూ గురు శుశ్రూషలో సమానమే.ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం



 ఉపనయనం అయిన తర్వాత ఆచరించ వలిసిన ధర్మాలు ... విధులు ..



బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి.

ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట.
ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట.
శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట.
శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట.
దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట.
మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు.
బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను.
బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను.
బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను.
బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను.
బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు.
బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును.
బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును.
ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు.
బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును.

బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే.

ఇతర నియమములు: చివరకు వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది.

బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు.
బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు.



నా ఈ సేకరణ ..లో సహకరించిన ..వికిపిడియ..మరియు ఇతర బ్లాగరులకు ..నా హృదయ పూర్వక ..ధన్యవాదాలు .. 



Sunday, May 8, 2011

100% లవ్ - ఇది నా మొదటి రివ్యు [100% love movie review]


వేయి అడుగుల ప్రయాణం అయిన మొదటి అడుగు తో మొదలు పెడతాము.. నేను కూడ నా బ్లాగ్ లో మొదటి సినిమా రివ్యు ఈ సినిమా తో మొదలు పెడుతున్నా.. ఇది 100% నా స్వంత రివ్యు ..ఈ రివ్యు మా అమ్మ దీవెనలతో ..
నా రేటింగ్   :   3 / 5  ( జస్ట్ ఫర్ టైం పాస్  ) 

Casting : నాగచైతన్య , తమన్నా మరియు  ఇతరులు 
డైరెక్టర్ : సుకుమార్ 

కథ - కథనం :  అనగా అనగా ..ఎప్పుడు 1st ర్యాంక్ వచ్చే బాలు (  నాగచైతన్య ) మిగతావాళ్ళని చిన్నచూపు చూస్తూఉంటాడు.. అలాంటి సమయం లో మహాలక్ష్మి (మన బాలు కి మరదలు ) ఊరి నుండి వస్తుంది. 

 మొదటి పార్ట్ ( ) ఆంద్యంతం ..మిక్కి మౌస్ గొడవలా ..సాగిపోతుంది .. కామెడి చాల బాగుంది .. కాని సెకండ్ హాఫ్ చాల అయోమయం గా ఉంది .. డైర్ క్టర్ అయోమయం ..మనమీద రుద్దెసాడు ..ప్రేమ గొప్పదా .కాదా?  .అహం ని నిజంగా జయిస్తుందా ..అన్నది సినిమాలో అసలు పాయింట్..అది చెప్పటానికి మద్యలో షారుఖ్ ..కాజోల్ అంటు ..ఇంకో అయోమయం..
హీరో, హీరోయిన్ మద్య కెమిస్ట్రి చాల బాగుంది..        

చిన్న పిల్లల కామెడి ..ఫస్ట్ హాఫ్ లో ..అందరి చేత విజిల్స్ వేయించింది ... కాని నెనే గ్రేట్ అని అనిపించుకోవటానికి ..హీరో చేసే పనులు ..మన స్వార్ధం కోసం ఏమి చేసిన తప్పులేదు అని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి .. 

ఫస్ట్ హాఫ్ అంత కామెడి గా ..సెకండ్ హాఫ్ అంత బోరింగ్ బోరింగ్ ..గా సాగింది ..

ఈ సినిమా యుత్ ని , కాలేజ్ స్టుడెంట్స్ ని టార్గెట్ చేసి తీశారు అని స్పష్టం గా అర్ధం అవుతుంది ..ఇది వాళ్ళకే ఎక్కుతుంది ..మిగతవాళ్ళకి ఎక్కటం కొంచెం కష్టం ..

ఫైనల్ (బాటం లైన్): ఇంట్లో బొర్ కొడితే ..చెయడానికి ఏ పనిలేక పొతే ..ఒక సారి చూడొచ్చు ...        

Friday, April 22, 2011

నేను ..నా ఉంగరం ... స్రవంతి ...


ప్రతి ఒక్కరు జీవితం లో ..వారు అందుకున్న బహుమానలకి  ఒకటి రెండు పేజిలు కేటయిస్తారు .. నేను కూడ అంతే ..

చాల మందికి ...బహుమానాలు ..వాళ్ళు ఎవైన సాదించనిప్పుడు ..వస్తాయి .. అప్పుడు అందరు వాళ్ళని మెచ్చుకుంటారు ..కాని నా జీవితం లో ఉంగరం నా చేతికి వచ్చిన తీరే వేరు ..వచ్చిన తర్వాత నేను అందుకున్న మెచ్చుకోలు వేరు ...  


అస్సలు ..సంగతి కి వస్తే 2004 నేను ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రోజుల్లో ... 3/1 లో "పీ.పీ.ఎల్" అనే సబ్జెక్ట్  లో ..మనం జీవితం లో మొట్టమొదటి సారిగ ...ఉత్తీర్ణత సాదించలేకపోయ ... అప్పుడు మా అమ్మ,నాన్న నన్ను తిడతారు అని భయం భయంగా ఇంటికి వెళ్ళిన నాకు ..మొదటి షాక్ మ నాన్న ఇచ్చారు ...మా నాన్న గారు ఏమి అనలేదు ..మా అమ్మగారెమో నువ్వు తప్పడం ఎమిటి రా అన్నారు ... నేను టైం బగలేదు అన్న ..అంతే ..

మర్రోజు నేను కాలేజ్ నుండి రాగానే..నేను అమ్మ,నాన్న గుడి కి వెళ్ళాం ..అప్పుడు మా నాన్న ..ఒక కొత్త ఉంగరం ..పూజారికి ఇచ్చి నా పేరు మీద పూజ చేయించి ... నీ చేతికి ముత్యం ఉంటే కలిసి వస్తుంది అట రా  అని నాకు బహుమతి ఇచ్చారు ..  


అలా మనకి బహుమతి చేతికి వచ్చింది ...మర్రోజు మా మేడం క్లాస్ లో లేపి సబ్జెక్ట్ పోయింది కదమ్మ ..మీ పేరెంట్స్ ఏమి అన్నారు అని అడిగి షాకిచ్చారు .. నేను ఉరుకుంటాన రింగ్ కొనిపెట్టారు అని చెప్పా .. ఇంతలో స్రవంతి ..నాకు మంచి ఫ్రెండ్ లెండి ..  "ఒక సబ్జెక్ట్ పొతేనే రింగ్ ఇచ్చారు ..మొత్తం పొతే చైన్ కొనిచ్చే వాళ్ళు ..ఎమో ? అన్నది " అంతే మా క్లాస్ మొత్తం ఒక్కటే నవ్వులు ...

  అది నేను అందుకున్న బహుమతి ..దానితో పాటు నేను అందుకున్న మెచ్చుకోలు..

నా చేతి రింగ్ చుసినప్పుడల్ల ..నాకు ఈ సరద సన్నివేశం ..గుర్తొస్తు ఉంటుంది..



మానవుడా ... మాధవుడా ...

రాముడు, కృష్ణుడు ..ఏసు, షిర్డి సాయి .. ఇలా మనం నిత్యం కొలిచే ప్రతి దేవుడు ..మానవ జన్మ నెత్తి..అందునున్న కష్ట సుఖాలు అనుభవించి ..తరువాతి తరలా వారు, ఈ మానవాళి మొత్తం ఇహ లోకం నుండి ..పరలోకం వరకు ..రక్షింపబడానికి ఎన్నో రకాల సూచనలు ..మార్గలని ఉపదేసించారు ....

    ఎవరు ఏమి చెప్పిన ..ఏ మార్గం ఉపదేశించిన ... అందులోని అంతరార్ధం ఒక్కటే .."సర్వేజనో సుఖినో భవంతు"   మనుషులు అంత ఒక్కటే ..అందరికి ప్రేమను పంచడం .. ఎదుటివారిని సేవించడం .. వారికి చేతనైనంత సహాయం చేయడం ...వారికి సరియైన మార్గం సూచించగలగటం ..

            ఈ పనులు చేసిన వాళ్ళు మానవులుగా జన్మించిన ..జన్మత: మానవులైన ..మాధవులుగా వెలుగొందుతారు ..పూజింపబడతారు ..     
            ప్రపంచం మొత్తం లో ఎంతమంది చే పూజింపపడతారో ..అంతమంది విమర్శకుల విమర్శలు అందుకున్న ఆద్యాత్మిక గురువు "శ్రీ సత్య సాయి బాబ" మానవ జన్మనెత్తిన ..ఆ మాధువుడి లా మనవాళి కి ఎంతో సేవ చేశారు..

        చైన లో ఒక సామెత ప్రకారం .." చేపని పట్టి ఇస్తే అది ఒక రోజు ఆహరం ..అదే పట్టడం నేర్పిస్తే అది జీవితానికి సరిపడ ఉపకారం"

 అది విద్యాధానం కి ఉన్న గొప్పతనం...శ్రీ సత్యసాయిబాబ అందుకనే ..ఎంతోమందికి తను స్థాపించిన విద్యాలయలతో విద్యను ఉపదేసించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ...

 అనంతపురం చుట్టుపక్కల వూళ్ళ జనాలు రోజు మంచినీరు తాగుతున్నారు అంటే అది శ్రీ సాయి వల్లనే .. ఎంతోమంది నిరుపేదలు ..ఎన్నో భయంకరమైన రోగాలకి ఉచితం గానే చికిత్సపొందుతున్నారు అంటే అది శ్రీ భగవాన్ సత్యసాయి సేవనిరతి వల్లనే ...ప్రపంచం నలుమూలల 178 దేశాలలో ప్రజలు ఆయన ప్రవచనాలు విని ఆద్యత్మిక ప్రబోదనలు అందుకుంటున్నారు ..

శ్రీ భగవాన్ సత్యసాయి మానవళికోసం ఇవి చేసారు కాబట్టి ఆయన మాధవుడే ప్రతి ఒక్కరిచే పూజలు అందుకోగల దేవుడే ..

ఆయన మానవుడు ...ఆయన మానవరూపం లో ఉన్న మాధవుడు ... ఆయన భౌతికంగ మన మద్య ఉన్న లేకున్న ..ఆయన ఎప్పుడు పూజింపగలిగిన వ్యక్తే .. 



Friday, February 11, 2011

వచ్చారుట ....ముంచారుట .....

  ఎప్పుడో  "వచ్చారుట ..వెళ్లారట ..." అని ఒక నొక వ్యాఖ్యము చదివినట్టు గుర్తు .... నేను ఈ మాట ఎందుకు గుర్తు చేసుకున్నానో మీ అందరికి అర్ధం అయి ఉంటుంది..
అప్పుడెప్పుడో అమితాభ్ నటించిన షోలే సినిమా 550  రోజులు ఆడింది ... ఇప్పుడు చిరు జీవించిన  ప్రజారాజ్యం సినిమా దాదాపు 1000 రోజులు నడిచింది .. "ప్రేమే లక్ష్యం .. సేవే మార్గం " అని చెప్పుకొని మొదలుపెట్టిన ఈ ప్రయాణం చివరికి "అధికారమే లక్ష్యం ..విలీనం ఒక మార్గం" అని కాంగి లో కలిసిపోయారు .. మంచి నీళ్ళు కలిసిన ఉప్పుగా మారిపోయే సముద్రం లాంటి కాంగి లోకి ఈ చిరంజీవి లాంటి ..బురద నీళ్ళు కలిస్తే మంచిగ మారతాయి అని ఎవ్వరు అనుకోరు ...

మనం ఎంతపెట్టాము ..ఎంత వచ్చింది అని చూసుకునే బిజినెస్ నుండి వచ్చిన ఈ నేత (మన తలరాత ఈ యన కూడా నేత  అవ్వడం ) తన పేరు ..పలుకుబడి పెట్టుబడి గ పెట్టి కోట్లకు కోట్లు దండు కొని ఇప్పుడు అధికారమే పరమావధి గా  ఈ అవినీతి కాంగి లోకి కలిపారు ..

ప్రజలకి ఏమైతే కల్లబొల్లి మాటలు చెప్పారో అవి అన్ని నోట్ల కోసం అధికారం కోసం నీటి మిద రాతలు గ  మార్చారు ..అది ప్రజారాజ్యం కాదు మోసాల రాజ్యం ...

చిన్నపుడు 6 తరగతి లో తెలుగు పాఠం చదువుకున్న .. "కొత్త గ వచ్చిన వారిని నమ్మరాదు "..
నిజం గ అ కధ ఇప్పుడు నిజం అయ్యింది ...

ఈయన  వచ్చారు ..మనల్ని నమ్మించారు .. వంచిచారు ... మోసగించారు ...

C for Chiranjeevi .. C for Cheating ..............

I hate .. Chiranjeevi ......... I have Congress .. I hate Indian Politicians ....





Thursday, February 3, 2011

ఇది ......చాలా కొత్తది ...సరికొత్తది ...

ఇది నేను రాయబోయే టపాకు ప్రకటన అన్నమాట .. అంటే సినిమా విడుదల అయ్యే ముందు trailers విడుదల చేస్తారే అలా అన్నమాట ...

మీరు చూస్తూనే ఉండండి .. నా ఈ బ్లాగ్ లో ఎవ్వరు ఉహించని విధముగా .. అద్భుతమైన కధ ..అమోఘమైన కధనం ...

ఎవ్వరు ఉహించనంత కొత్తగా ..ఎవ్వరు నమ్మలేనంత వింతగా ఉండబోతుంది ....

మీరు wait చేస్తూ ఉండండి ........

మీ
నలుగురి లో  నాలుగోవాడు ...

Monday, January 3, 2011

నేను ..ట్యూషన్ .. కిట్టిగాడు ..

అది 1990 సంవత్సరం ...

తేది... తెలియదు ..గుర్తులేదు .. మరిచిపోయా...

సమయం 6 కి 7 కి మధ్యలో అవుతుంది అనుకుంటా..

నాకు ఏమో వయస్సు.. 6 నిండి ..7 వచ్చాయి ..

దూరదర్శన్ ఛానల్ లో కిట్టిగాడు ..సీరియల్ ..సీరియస్ గా అందరిని అంటే 6 ఏళ్ళా వాళ్ళ నుండి 60 ఏళ్ళ వరకు ఆకట్టుకొంటు నడుస్తుంది ...

మా రెండో అన్న .. 7 చదువుతున్నాడు ట్యూషన్ లో ఉన్నాడు ...

మా నాన్న గారు ..నేను .అలా ..అలా బయటకి వెళ్ళి ..దారిలో ఉన్న వాళ్ళ ట్యూషన్ కి వెళ్ళాము ..

అక్కడ అందరు చదువుకుంటున్నారు.. మా నాన్న గారు కూడ టీచర్ కావడం తో ట్యూషన్ మాష్టారు ..మా నాన్న గారు ..ఎదో మాట్లాడు కుంటున్నారు..

ఇంత లో మా నాన్న గారు నన్ను ..నాన్న (నన్ను అంతే పిలుస్తారు) నువ్వు, అన్నయ్య కలిసి రండి అని చెప్పి తను వెళ్ళారు ..

అప్పుడు మొదలు అయ్యింది అస్సలు నా టెన్షన్ .. కిట్టిగాడా ? అన్నయ్య వాళ్ళ ట్యూషన్ మాష్టారా ? ...ఎటు తెల్చుకోలేక ..కొంచెం సేపు ఆలోచించాను ....

5 ని"లు .. 10 ని"లు ...

నేను లేచాను ..సార్ టైం ఎంత అయ్యింది .. అని ఆడిగాను .. పాపం ఆయన ఎందుకు అని అడిగారు ..?
వెంటనే 7 అయితే కిట్టిగాడు సీరియల్ వస్తుంది అని చెప్పా ..    

పాపం ఆయన షాక్ ..... ఆ తర్వాత మేము ఆ వూళ్ళో 6 సంవత్సరంలు ఉన్నాము ..

ఈ సంఘటన జరిగినప్పటి నుండి నన్ను .. కిట్టిగాడు ..అనే పిలిచేవారు ...

అది నేను .. ట్యూషన్ మాష్టార్ .. కిట్టిగాడు .... సంగతులు ....

నాన్నగారు అన్నారు .....

నాన్నగారు అన్నారు ... ఏమి రా  బాబు మీ స్నేహితులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపావా అని?

నేను అన్నాను , నా కావల్సిన వారి అందరికి ఫొన్ చేసి చెప్పాను అని. అప్పుడు నాన్నగారు అన్నారు .... శభాష్ రా బాబు, మరి నీ బ్లాగ్ మిత్రులు కి తెలిపావా అని ...

నాన్న గారు అన్నారు .. నువ్వు రాసే రాతలు అన్ని పాపం చదివి తరించే వారందరిని దేవుడు చల్లగా చూడాలని ఇంకా వారికి ఈ సంవత్సరం అంత వారు కోరుకున్నట్లు గా అందరికి మంచి జరగాలని దేవుడికి ప్రార్దించు అని ...

దానికి నేను అన్నాను ..తప్పకుండ నాన్న ..కాని ఆ ప్రార్ధన మన స్టాండర్ద్ కి తగినట్లు ఉండాలి అని ..

అప్పుడు నాన్న గారితో పాటు అమ్మ గారు కూడ అన్నారు ...


శతమానం భవతి! .. శతాయుత్పురుష:

శతెంద్రియ ఆయుష్

యెవెంద్రియే ప్రతితిష్థతి


ఆయుష్మాన్ చిరంజీవ శుఖిభవ శుఖిభవ .. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు ..
అబీష్ట కార్య సిద్దిరస్తు ..
 

ఈ దీవెనలు నీకు, మీ బ్లాగ్ మిత్రులు అందరికి ... ఈ సంవత్సరం అంత మంచి గా జరగాలి అని ......................

Wish you a Happy New Year 2011 

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి