Monday, January 25, 2010

గుర్తొచ్చింది ........

నేను ఇవ్వాళ ఆఫీస్ నుండి రాగానే మా వదిన రేపు మీకు "సెలవేనా" అని అడగగానే నాకు గుర్తొచ్చింది. రేపు జనవరి 26 కదా.. సెలవే మరి .. సెలవు కాబట్టే గుర్తు ఉంది.. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది..వెంటనే నేను అర్జంట్ గా రేపు పొద్దున్నే లేచి నాకు దేశభక్తి ఉంది అని నిరుపించుకోవాలి.. అంటే ఎం చేయాలి చెప్మా? ఆ గుర్తొచ్చింది.. ఎర్రకోట మీద భారి భద్రతల మద్య ..మనం జెండ మనం ఎగరవేయాటానికి ఎన్ని కష్టాలు రా అనుకుంటూ ... పాపం "చటోపాద్యయా" 100 సంవత్సరాల క్రితం రాసిన వందే మాతర గీతానికి వచ్చిన కష్టాలు తలుచుకుంటు..ఆ పాట కూడ విని కొంచెం దేశభక్తి నాకు ఉంది అని ఫీల్ అయిపొయ్ సెలవు కదా పేపర్ తెచ్చుకుందాం అని బయటకి బయలు దేరి ..దారి లో రేపు మాత్రమే కనపడే మన జెండా ఒకటి లేదా రెండో కొని ఒకటి మన జేబు కి పెట్టూకొని ఇంకొకటి మన వాళ్ళకి ఎవరి కి అయిన ఇచ్చి హమ్మయ్య వాళ్ళ లో కూడ దేశభక్తి పెంచాం అనుకొని.. ఏ "ఖడ్ఘం" మో , మేజర్ చంద్రకాంత్ సినెమా నో చూసేసి హమ్మయ్య మనకు చాలా దేశభక్తి ఉందిరా అని నాలో నేనే పొంగిపోయి .. ఇంకా నేను ఇండియన్ గా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని వచ్చే 2,3 "ఫార్వార్డ్" మెయిల్స్ నా లిస్ట్ లో ఉన్న స్నేహితులకి పంపి ..వారి లో కూడ దేశభక్తి పెంపొందించాము అని సంబరపడి .... రేపు మాత్రమే గుర్తుకు వచ్చే మన రియల్ హీరోస్ అదేనండి మన ఆర్మి పీపుల్ కి సలాం చేసి ....హమ్మయ్య నాకు చాలా దెశభక్తి ఉంది రా అని నాకు నేనే ఒక సర్టిఫికేట్ జారి చేసుకొని .. మళ్ళి ఎళ్ళుండి రాగానే .... మళ్ళి దేశాన్ని గురించి దేశభక్తి గురించి మరిచిపోయి 7 నెలల తర్వాత వచ్చే సెలవు రోజు అదేనండి ఆగష్ట్ 15 రోజు వచ్చేదాక మాములే... రేపు జరగపోయేది ఇలా కళ్ళకు కట్టినట్లు చెపుతున్నావిమిటి అని ఆశ్చర్య పోతున్నారా ? ప్రతి సంవత్సరం నేను, నా లాంటి వాళ్ళు చాలా మంది ఇదేగ చేసేది.

9 comments:

Phani Yalamanchili said...

బావున్నాయి మీ జనవరి 26 విశేషాలు ... నిజం గా నేనూ ఇలానే చేసి పని అయ్పోయిందని చేతులు దులిపెసుకుంటాను .... :):)

జయ said...

మేముమాత్రం అలా కాదండి. పిల్లలూ, పెద్దలూ అందరం కలసి చాలా 'దేశభక్తి' తో సెలెబ్రేట్ చేసుకుంటాం.

నలుగురి లో నాలుగోవాడు said...

@జయ గారు ..

దేశభక్తి తో అంటే ఎమిటో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెబుతారా కొంచెం ?

జయ said...

తప్పకుండా చెప్తాను. దేశభక్తికి రాజకీయ నాయకులే కానక్కరలేదు. మనం పుట్టిన గడ్డని మనం గౌరవిస్తే అదే దేశభక్తి. మన చుట్టూ ఉన్న చిన్న పిల్లలకు దేశం పట్ల సద్భావం కలిగించి వారిలో సేవాతత్పరత పెంచినా అది నాద్రుష్టిలో దేశభక్తే. మనదేశ నాగరికత, సంస్కృతివాళ్ళకు తెలియచేస్తూ ఉంటే వ్యతిరేక శక్తులుకు తట్టుకొని ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, తన దేశాన్ని మాత్రం అగౌరవించరు. తనదేశాన్ని తల్లిగా గౌరవిస్తారు. దేశభక్తి అంటే ఏంటి అని అడిగే దశకు రారు. ఈ లాంటి ప్రత్యేక రోజుల్లో అందరిలాగానే మేము కూడా జెండా ఎగురవేస్తాం. ఈ రోజు ప్రత్యేకత ఏమిటో పిల్లలకు తెలియజేస్తాం. ఆనాటి త్యాగమూర్తుల గురించి వాళ్ళకు తెలియ జేస్తాం.మహామహుల సందేశాలు వాళ్ళకు వినిపిస్తాము.వాళ్ళు నేర్చుకున్న దేశభక్తి గీతాలను ఆ రోజు వాళ్ళు పాడి, భరతమాతకు ప్రత్యేక వందనసమర్పణ చేస్తారు. మేము తరచుగా చేసే సేవా కార్యక్రమాలను ఈ రోజు కూడా కొనసాగిస్తాం. ఒంటరిగా కాకుండా ఆ రోజంతా పదిమందితో కలిసే వాళ్ళకు ఇంకా ఉత్సాహం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి పండగల వలన అన్ని రకాల శిక్షణ వాళ్ళు పొందగలుగుతారు. ఎంత చెట్టుకి అంత గాలి. మేము త్రుప్తిగా చేసుకునే ఈ కార్యక్రమాలు మాద్రుష్టిలో దేశభక్తే.

నలుగురి లో నాలుగోవాడు said...

@జయ గారు చాలా బాగా చెప్పారు. మరి అందరికి దేశభక్తి ఇవ్వాళే ఎందుకు గుర్తు వస్తుంది? మరి ఇక ఏ రోజు గుర్తు రాదు ఎందుకని? మీకు ఉన్న దేశభక్తి కి నా సలాం .. మనకు తెలిసిన దేశభక్తులలో సుభాష్ చంద్రబోస్ మీకు తెలిసే ఉండి ఉంటారు . ఆయన జన్మదినం ఎప్పుడో మీకు తెలుసా ? గూగుల్ లో వెతక్కండి ఇప్పుడు .. మీకు తెలిసిన చాలా మందికి తెలియదు ..ఎందుకో చెప్పనా ? ఆయన పుట్టిన రోజు మనకు సెలవు లేదు కనక ? మన దేశభక్తి అంత వరకే ..సెలవు ఇచ్చారు కనుక గుర్తు ఉంది...లేకపోతే ఆయన గుర్తు పెట్టుకునేంత సమరయోదుడు కాదా ?

జయ said...

మొన్న 23 న టి.వి. లో సుభాష్ చంద్ర బోస్ బర్త్ డే ప్రోగ్రాంస్ చూసి మీరడుగు తున్నారని నేను కూడా అనుకోవచ్చుగా. నాయకుల పుట్టిన రోజులు వేరు, జాతీయ పండుగలు వేరు. అందరు నాయకుల్ని, అందరూ ఇష్టపడకపోవచ్చు. రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.గూగుల్ చూస్తే తప్ప నాకే పరిజ్ణానం లేదని మీ ఉద్దేశమా? వీలైనంత మటుకు విలువలు కాపాడాలనే నా లాంటి వాళ్ళ ప్రయత్నం. ఇంక మీకు నేను ఎటువంటి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. ఎదుటి మనుషుల్ని చులకన చేయకండి.

నలుగురి లో నాలుగోవాడు said...

@జయ గారు నన్ను క్షమించాలి. మిమ్మల్ని లేక ఎదుటి వారిని చులకన చేసి మాట్లేడంత కుసంస్కారం కలిగిన వాడిని కాదు నేను. ఏది ఎమైన మీరు ఎవిధముగా అయిన నా రాతల వలన బాధ పడి వుంటే క్షమించండి. మీరు గూగుల్ చుస్తే తప్ప తెలియదు అని కాదు నా ఉద్దేశ్యము ..మీ గురించి ఎమీ తెలియకుండ మీ పరిజ్ఞానం గురించి మాట్లాడే అంత జ్ఞానిని కాదు నేను. నేను కేవలం నా గురించి నాలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. కాని మీరు నిజంగా దేశభక్తి గురించి చెప్పిన(రాసిన) తీరు బాగుంది ఎంతైన మీరు అధ్యాపుకులు గదా?

Sarwa said...

Hi Friend,

Ninna monnati varaku nenu meelage alochinche vadine.... kaani... work pressure lo padi... naku nene respect ichukoleka potunna... But one thing... when i went to any movie in mumbai.. before starting that movie they will play our National anthem... at that time everyone stand and be silent at that moment... I enjoyed that environment... appudu anipistundhi... This is INDIA (I Never Do It Again) anakunda chesedhi... idhi okkate ani.... Our Indians they are doing mistakes.. but they never repeat the mistake... they r doing the mistake differently... :) ... I think edho cheppalanukoni.. edhedho cheppesa... try to delete it after read this... ledante.. nijamaina desa bhaktulaki kopam raavochu...

నలుగురి లో నాలుగోవాడు said...

@Dear Sarwa

You are almost correct. That's what I wanna say. We respect india .. we show our Patriotism where we don't deserve .. like movies .. cricket .. we feel ourself that we are so patriotic because we repetedly see movies which come as some patriotic background ..we love to see india winning .. by these things .. I believe this is not actually it meant to be.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి