Sunday, May 29, 2011

ఉపనయనము ..ముందు..ముందుగా ..

 మనందరికి ..చిన్నప్పటి నుండి జరగబోయే దాని గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం... నేను కూడ అందరి లాంటి వాడినే.. రాబోయే.. తరగతి పాఠాలు ముందే వేశవి సెలవలలో.. చదవటం ..వాటి గురించి తెలుసుకోవటం ఒక చిన్న కుతుహలం .. ఇలానే అందరికి ఉంటుంది లేండి లేపోతే ..ఈ జ్యోతిష్యాలు .. జాతకలు .ఎక్కడినుండి వస్తాయి ...  అస్సలు సంగతి లోకి వస్తే ..మా అమ్మ నాన్న, నాకు ఉపనయం చేస్తామన్నారు..నేను సరే అన్నాను ..

   అస్సలు ఉపనయనం అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు ? కేవలం జన్మత: బ్రాహ్మణ అయినందుకు ..పెళ్ళికి ముందు జరిగే చిన్న తంతు మాత్రమేనా ? అని చిన్న సందేహం వచ్చి.. అస్సలు ఉపనయనం ఎందుకు? ఎమిటి? ఎలా? అని చిన్న పరిశోధన.. దాని ఫలితం ..ఇదిగో ఇలా .......

మన సనాతన హిందు ధర్మం అనుసరించి ..ప్రతి మనిషి ..పుట్టకు ముందు 3,జన్మించిన తరవాత 12, మరణించిన తర్వాత 1 ..ఇలా మొత్తము 16 ..వీటిని వైదిక సంస్కారాలు అని .. షోడశ సంస్కారాలు ..అంటారు ..  వాటి లో ..ఒకటి  ఉపనయనం ముఖ్యమైనది..ఈ కాలం లో కేవలం కొన్ని కులాలు మత్రమే ఆచరిస్తున్నాయి ..    .


అర్ధం - అంతరార్ధం ..

ఉప+నయనము.  అనగా జ్ఞాన నేత్రమును పొందుటకు  గురువు వద్దకు  తీసుకువెళ్ళుట  అని అర్ధము.  ప్రతి మనిషి తల్లి గర్భము నుండి  పుట్టుట మొదటి జన్మ కాగా, గురువు ద్వారా  ఐహికముష్మిక విద్య  అభ్యసించి  గురుకులమునుండి  బయటికి వచ్చుట రెండవ జన్మ  అంటారు.   దీనినే మనిషికి మూడవ నేత్రము - జ్ఞాన  నేత్రమును ప్రసాదించే సంస్కారము అందురు.

ఉపనయన సంస్కార ప్రారంభమున  వటువు మూడు సమిధలను తీసుకొని గురువు వద్దకు వెళ్ళును.   గువుగారు వాని యొక్క  భుజస్కందాల  పైఉన్న త్రివిధ ఋణములు  తీర్చుకొను  విధానమును బోధిస్తూ, తన చేతిలో  గల మూడు సమిధలను అగ్ని సాక్షిగా  ప్రమాణము చేయిస్తూ యజ్ఞములో  ఆ మూడు సమిధలు  వేయించును. ఆ మూడు ఋణములు ఏమిటంటే ౧. పితృఋణము    ౨.  ఋషిరుణము  ౩. దేవరుణము.  ఈ మూడు ఋణములు తీర్చుకొనుటకై  ప్రతిక్షణము  గుర్తుచేయుటకు గురువుగారు ఆ వటువుకు మూడు పోగులు  గల దీక్షాచిహ్నము - యజ్ఞోపవీతమును  వేయుదురు.  ఇది జ్ఞాన చిహ్నము .


ఎలా - ఎందుకు ..


అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.
ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాతే మారుతూ వచ్చాయి. అథర్వవేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించబడింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:
బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం(జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.


విధి .. విధానం ..



ఉపనయన విధులు బ్రాహ్మణులకు,క్షత్రియులకు మరియు వైశ్యులకు విధులు వేరు వేరుగా ఉంటాయి.
బ్రాహ్మణులకు 8 సంవత్సరాలవయసులో [ అనగా పుట్టిన రొజుకు 7 సంవత్సరాల 3 నెలల లొపు ] క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో,వైశ్యులకు 12 సంవత్సరాల వయలో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం.ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నారవస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి.అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి.ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డి నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు.మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి.నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి.అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి.ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి.గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి తరవాత గురువు అనుమతితో భుజించాలి.అవశిస్ఠాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి.భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి.ఆతరవాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి.ముందుగా తల్లిని కానీ,సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమమం.అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం.ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు.ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు.అందరూ గురు శుశ్రూషలో సమానమే.ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం



 ఉపనయనం అయిన తర్వాత ఆచరించ వలిసిన ధర్మాలు ... విధులు ..



బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి.

ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట.
ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట.
శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట.
శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట.
దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట.
మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు.
బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను.
బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను.
బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను.
బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను.
బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు.
బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును.
బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును.
ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు.
బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును.

బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే.

ఇతర నియమములు: చివరకు వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది.

బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు.
బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు.



నా ఈ సేకరణ ..లో సహకరించిన ..వికిపిడియ..మరియు ఇతర బ్లాగరులకు ..నా హృదయ పూర్వక ..ధన్యవాదాలు .. 



Sunday, May 8, 2011

100% లవ్ - ఇది నా మొదటి రివ్యు [100% love movie review]


వేయి అడుగుల ప్రయాణం అయిన మొదటి అడుగు తో మొదలు పెడతాము.. నేను కూడ నా బ్లాగ్ లో మొదటి సినిమా రివ్యు ఈ సినిమా తో మొదలు పెడుతున్నా.. ఇది 100% నా స్వంత రివ్యు ..ఈ రివ్యు మా అమ్మ దీవెనలతో ..
నా రేటింగ్   :   3 / 5  ( జస్ట్ ఫర్ టైం పాస్  ) 

Casting : నాగచైతన్య , తమన్నా మరియు  ఇతరులు 
డైరెక్టర్ : సుకుమార్ 

కథ - కథనం :  అనగా అనగా ..ఎప్పుడు 1st ర్యాంక్ వచ్చే బాలు (  నాగచైతన్య ) మిగతావాళ్ళని చిన్నచూపు చూస్తూఉంటాడు.. అలాంటి సమయం లో మహాలక్ష్మి (మన బాలు కి మరదలు ) ఊరి నుండి వస్తుంది. 

 మొదటి పార్ట్ ( ) ఆంద్యంతం ..మిక్కి మౌస్ గొడవలా ..సాగిపోతుంది .. కామెడి చాల బాగుంది .. కాని సెకండ్ హాఫ్ చాల అయోమయం గా ఉంది .. డైర్ క్టర్ అయోమయం ..మనమీద రుద్దెసాడు ..ప్రేమ గొప్పదా .కాదా?  .అహం ని నిజంగా జయిస్తుందా ..అన్నది సినిమాలో అసలు పాయింట్..అది చెప్పటానికి మద్యలో షారుఖ్ ..కాజోల్ అంటు ..ఇంకో అయోమయం..
హీరో, హీరోయిన్ మద్య కెమిస్ట్రి చాల బాగుంది..        

చిన్న పిల్లల కామెడి ..ఫస్ట్ హాఫ్ లో ..అందరి చేత విజిల్స్ వేయించింది ... కాని నెనే గ్రేట్ అని అనిపించుకోవటానికి ..హీరో చేసే పనులు ..మన స్వార్ధం కోసం ఏమి చేసిన తప్పులేదు అని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి .. 

ఫస్ట్ హాఫ్ అంత కామెడి గా ..సెకండ్ హాఫ్ అంత బోరింగ్ బోరింగ్ ..గా సాగింది ..

ఈ సినిమా యుత్ ని , కాలేజ్ స్టుడెంట్స్ ని టార్గెట్ చేసి తీశారు అని స్పష్టం గా అర్ధం అవుతుంది ..ఇది వాళ్ళకే ఎక్కుతుంది ..మిగతవాళ్ళకి ఎక్కటం కొంచెం కష్టం ..

ఫైనల్ (బాటం లైన్): ఇంట్లో బొర్ కొడితే ..చెయడానికి ఏ పనిలేక పొతే ..ఒక సారి చూడొచ్చు ...        

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి