Monday, September 7, 2009

మన పయనం ఎటు ?

ప్రపంచము మొత్తం అభివృద్ధి లో పురోగమనంలో ఉంటే మనం మాత్రం తిరోగమనం లో ఎందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది? కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువే ఒక నిమిషం అలోచించిన మనకు గోచరిస్తాయి. అవినీతి,లంచగొండితనం,బంధుప్రీతి వీటిలో సముచిత స్తానాన్నే ఆక్రమించాయి. ఒక సామెత "మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి" అన్న చందాన రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడే అవ్వవచ్చుగాక, ఆయన కొడుకుని ముఖ్యమంత్రి గా ఎలా ఆహ్వానిస్తాము ? CM పదవి ఏమైన ఇడుపులపాయ ఎస్టేట? ఆయన పోగానే ఆయన కొడుకు గారికి అప్పచెప్పడానికి ?
                               
                             100 సంవత్సరాలా చరిత్ర ఉన్న పార్టీ లో కేవలం 100 రోజుల అనుభవమే ఉన్న జగన్ తప్ప వేరే నాయకుడే లేడా ? అసలు జగన్ కి ఉన్న అర్హత ఎమిటి? "నాయకులు పుడతారు,తయారు గారు" అని మనం నమ్మితే రాజరికాన్ని వదిలి ప్రజాస్వామ్యం లోకి రావడం ఎందుకు ? కందిపప్పు కేజి రూ 100/-, పచదార రూ 50/- అయినప్పుడు మాటలు రాని ఈ మంత్రులు అనబడు వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జగన్ కొసం అదిష్టానం దగ్గరికి పరుగులు తీస్తున్నారు ?
                           ఇప్పటి కైన వారు ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తే తర్వతా అయ్యే CM కోసం మట్లాడటానికి మిగులుతారు . లేకపోతే శాస్వతముగా ప్రజల మనసుల నుండి ఆ తర్వాత పదవుల నుండి దూరం గాక తప్పదు .

2 comments:

Anonymous said...

>>>>100 సంవత్సరాలా చరిత్ర ఉన్న పార్టీ లో కేవలం 100 రోజుల అనుభవమే ఉన్న జగన్ తప్ప వేరే నాయకుడే లేడా ?<<<
ఇంకెక్కడి చరిత్ర. ఆ పార్టీకి ఎప్పుడో నూరేళ్ళు నిండాయి. గాందీ భవన్ లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అదీ వై ఎస్ సంస్మరణ సభలో కూడా మాట్లాడలేని దౌర్భాగ్యం, దుడ్డున్న వాడిదే ఎద్దు .. రాజసేకరుడు మరణించి రాచరికాన్ని పునరుద్ధరించాడు. ఇది రాచరికం కూడా కాదు అరాచరికం. గాందీ మళ్ళీ మళ్ళీ చావాల్సిందే ఈ రాష్ట్రం లో! .

Anonymous said...

కందిపప్పు కేజి రూ 100/-, పచదార రూ 50/- అయినప్పుడు మాటలు రాని ఈ మంత్రులు అనబడు వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జగన్ కొసం అదిష్టానం దగ్గరికి పరుగులు తీస్తున్నారు ? Well Said.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి