Thursday, September 3, 2009

జనం మెచ్చిన నాయకుడికి అశ్రునివాళి



 ఎందరో నాయకులు వస్తారు , పొతారు. కాని కొంత మంది మాత్రమే జనం హ్రుదయం లో చెరగని ముద్ర వేసి దశాబ్డాలు , శతబ్దాలు , చరిత్రలో నిలిచి పోతారు . ఒక ఐందిరమ్మ , ఒక రాజీవ్ , ఒక యన్ టి ఆర్ , ఒక పీవీ  , ఇలా ఎందరో. వీళ్ళు జనం దగ్గర  ఓట్లు   మాత్రమే కాదు వాళ్ళ  మనసుల్ని గెలిచారు . అందుకనే వాళ్ళు మరణించి దశబ్దాలు గడుస్తున్నా వారిని నిత్యం గుర్తు తెచ్చుకుంటున్నాం . సరిగ్గా ఇలాంటి కోవలోకే  వై యస్ ఆర్ వస్తారు . ఆంధ్ర రాష్ట్ర ప్రియతమ ముఖ్య మంత్రి గా ఎన్నో పధకాలు శ్రీకారం చుట్టి అందరి మనసులు దోచారు . "ఆరోగ్య శ్రీ"  పధకం దేశస్థాయి లో అందరి మన్ననలు పొందినది . "రైతే రాజు"  అని నమ్మిన శ్రీ స్వర్గీయ వై యస్ ఆర్  మృతి మన రాష్ట్రనికే కాదు దేశ రాజకీయానికి తీరనిలోటు .

                       ఇంతటి ప్రజా రంజకము గా పాలించే నాయకుడు పాపం స్వర్గం లో లేడెమో అందుకే మన ప్రియతమ నాయకుడ్ని ఆ దేవుడు త్వరగా తీసుకువెళ్ళాడు.

ఆ రాజసేఖరుడి ఆత్మ శాంతిచాలని కోరుకుంటు మన ఘనమైన నాయకుడి కి ఘన నివాళి. 

2 comments:

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అప్పుడు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్.టి.ఆర్., ఇప్పుడు వైయస్సార్. వీరిపైన నాకు ఏనాడు సరైన అభిప్రాయం లేదు. కానీ, వీరి మరణవార్త మాత్రం కంట తడి పెట్టించింది. ఎందుకో మాత్రం చెప్పలేను. ఆంధ్ర రాజకీయాలను ఈమధ్య కాలంలో ఇంతలా ప్రభావితం చేసిన నాయకుడు లేదనేది యథార్ధం. రాబోయే సంవత్సరాల్లో కేంద్రంలో కూడా మంచి నేత అవుతాడనుకున్న వ్యక్తి ఇక లేరనుకుంటే నిజంగానే బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్ కు నా ప్రగాఢ సంతాపం.

పరిమళం said...

ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా..

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి