Thursday, December 29, 2011

అనుకున్నంత అయ్యింది

అనుకున్నంత అయ్యింది ... అదే జరిగింది ..మళ్ళి మళ్ళి అదే జరుగుతుంది ... 40  రోజుల పాటు చేసిన సకల జనుల సమ్మె ఇప్పుడు కరెంట్ చార్జీల రూపం లో మన మెడకు చుట్టుకోబోతుంది .... ఇప్పుడు సదరు  "కే.సి.ఆర్", హరీష్ రావ్ , కోదండ రామ్ ఎవ్వరు రారు మీ ఇంట్లో పవర్ బిల్ కట్టడానికి ..ఎందుకు అంటే వాళ్ళకు ఇది వర్తించదు ..వర్తించిన వారిని బాదించదు...

నష్టం ఎవ్వరికి జరగబోతుంది? 

సకల జనుల సమ్మెలో కరెంట్ లేక, బస్సులు లేక ఇబ్బంది పడ్డది ఎవ్వరు? 
ఇప్పుడు కరెంట్ బిల్ బాదించేది ఎవ్వరిని?

మొన్న ఆర్.టి.సి చార్జీలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?

నిత్య అవసర వస్తువులు ధరలు పెరిగితే ఇబ్బంది ఎవ్వరికి?

రాజకీయ నాయకులు అదే చదరంగం లో పావులు ఎవ్వరు? 

మనం సాదించింది ఏముంది ? తెలంగాణా వచ్చిందా ? ...          


మనం చేసే పనులు మళ్ళి మళ్ళి మనకే ముప్పు తెస్తాయి అని తెలిసి కూడా తప్పు చెయ్యడం కన్నా వేరే ఒక అమాయకత్వం వేరే ఏమి లేదు ....

ఇప్పటికన్నా మేల్కొందాం ...... 


6 comments:

raja said...

ఉద్యమం పేరు చెప్పుకుని రాజకీయ కుక్కలు సంపాదించిన దానికి వంద రెట్లు జనాల దగ్గర తప్పుడు ఉద్యమం నివారించలేని చేతగాని గవర్నమెంటు వసూలు చేస్తుంది అమాయక జనాల్లారా రాజకీయ నాయకుల్ని పిచ్చి కొట్టుదు కొట్టండి బవిష్యత్తులొ ఎవరూ ఇలా చేయడానికి సాహసించకుండా

raja said...

ఉద్యమం పేరు చెప్పుకుని రాజకీయ కుక్కలు సంపాదించిన దానికి వంద రెట్లు జనాల దగ్గర తప్పుడు ఉద్యమం నివారించలేని చేతగాని గవర్నమెంటు వసూలు చేస్తుంది అమాయక జనాల్లారా రాజకీయ నాయకుల్ని పిచ్చి కొట్టుదు కొట్టండి బవిష్యత్తులొ ఎవరూ ఇలా చేయడానికి సాహసించకుండా

Jai Gottimukkala said...

ఇన్ని కష్టాలు పడుతున్నా ఇంకా కలిసి ఉండాలని ఎందుకు తాపత్రయం? మమ్మల్ని మా దారిన వదిలేసి తెలంగాణా ఇచ్చేస్తే కెసిఆర్ లాంటి వాళ్ళ నుంచి మీకు విముక్తి.

నలుగురి లో నాలుగోవాడు said...

నాకు మా నాన్నగారు ఎప్పుడు చెబుతుంటారు, ఎవ్వరి చేసిన పనులకు వాళ్ళే అనుభవిస్తారు అని ..మరి మీ అందరు చేసిన బందులకి ..మీరు కాల్చిన బస్సులకి .. మీరు కలిగించిన నష్టానికి మేము అందరం ఎందుకు కట్టాలి ఎక్కువ బిల్లులు .... ఇది ఇవ్వాళ మీకు తెలియకపొవచ్చు ..భారత దేశ బలమైన ఆర్ధిక మూలాలకి కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని ప్రపంచం మొత్తం కొనియాడ బడుతున్న విషయం మీకు తెలిసినట్లు లేదు ..

ఎప్పటికి అయిన "మొట్టినా మొదటి మొగుడే మంచోడు" అనే విషయం తప్పక తెలుస్తుంది ..

Anonymous said...

ధరల పెరుగుదల కీ శ్రిశైలం లొ ఎడమ విద్యుత్ ఉద్పాదన యునిట్ పాడవడానికి సంబందం ఏంటీ.....అవినీతి కేసులలొ దాగిన డబ్బు కీ దరల పెరుగుదల కీ సంబందం ఏంటీ...దేశం మొత్తం లొ దరలు పెరుగుతున్నయి కాని ఆం .ప్ర .లొ దరలకి తెలంగాన నే అడ్డు పొరాటమే అడ్డు,కే.సి.ఆర్ అడ్డూ మ్హ్...స్టార్ట్ చెయ్ కే.సి.ఆర్ ని తిట్టు కాంగ్రేస్స్ వాల్లు చేసే ఏదీ..తప్పు కాదు,అవినీతి,దలరీ తనం ..దలారి తనం తొనె కదా ధరలు పెరుగుతొంది,మన విద్యుత్తు ఉద్పదన నీల్ల పైన అధార పడింది వర్షాలు లేక ఏడుస్తుంటే ..కర్రెంట్ రాదు,కాని ఈలంటి పొస్ట్లు రయడనికీ,కమ్మెంట్లు రాయడనికీ,కర్రెంట్ వృధా చేద్దం జై సమైక్య ఆంధ్రా (తెలంగాణ కూడ అందులొ భగమే...!)

నలుగురి లో నాలుగోవాడు said...

ధరల పెరుగుదల కీ శ్రిశైలం లొ ఎడమ విద్యుత్ ఉద్పాదన యునిట్ పాడవడానికి సంబందం ఏం లేదు కాని రామగుండం లో సమ్మె చెస్తే ఉత్పత్తి ఆగిపొతే ..అప్పుడు పక్క రాష్తాలనుండి కొంటే .. ఎవ్వరిది తప్పు.. కె.సి.ర్ మొన్నటి దాక ఉద్యమాలు చేయటం వల్ల ధరలు పెరగవు.. మరి ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ వాల్లకి వచ్చాయి అవి వాళ్ళు ప్రతిభ తో తెచుకున్నార .. మీరు పోయి ఇప్పించారా ..?

పోని ఎన్ని ప్రాణాలు పోయాయి .. వీళ్ళు ఇచ్చే 1 లక్ష ఎక్స్ గ్రేసీయ వాళ్ళా ప్రాణానికి వెలన?

వెనక్కి పోయిన పెట్టుబడులు.. మీరు వెనక్కి తెప్పిస్తార ..?

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి