Tuesday, December 22, 2009

ఎంకీ's Marriage సుబ్బీ's Death

ఎంకి పెళ్ళి సుబ్బి చావు కి వచ్చింది అన్నట్లు తయారు అయింది మన రాష్త్రం సంగతి. ఏమని K C R తెలంగాణ కోసం దీక్ష మొదలుపెట్టారో తెలియదు కాని ఆ రోజు నుండి మన ప్రజల కష్టాలు మొదలు అయ్యాయి.10 రోజులు హైదరబాదు బందులు రాస్థా రోఖో ల తో తల్లడిల్లింది ఇప్పుడు ఎమో "లగడపాటి" గారి రగడం తో మళ్ళి రాష్ట్రం మొత్తం బందులు రాస్థా రోఖో లతో అట్టుడుకుతుంది. దీని వల్ల ఎవరు లాభ పడతారో తెలియదు కాని కాలేజి లు మూతపడి,పరీక్షలు వాయిదపడి మెరిట్ విద్యార్ధులు ఎంతో నష్ట పోయారు. ఈ విలువైన కాలాన్ని వాళ్ళాకి మళ్ళి అందించగలరా? ఎప్పుడో, జన్మకో శివరాత్రి లాగ పడె గ్రూప్ 2 ఈ గొడవల మద్య వాయిద పడింది. ఈ పరీక్షని తమ జీవిత పరీక్షలా భావించి సన్నద్దం అయిన వాళ్ళ పరిస్థిథి ఏమిటి? అసలే నష్టాల ఊబిలో కూరుకుపోయిన R.T.C పరిస్థితి ఏమిటి? R.T.C కి వచ్చిన నష్టాలు చార్జీలు పెంచో ఉన్న రూట్లు తీసివేసో పూడ్చుకోగలదు,గ్రూప్ 2 మళ్ళి పెడతారు అనుకుందాము కాని రెక్క ఆడితే గానిడొక్క ఆడని రోజువారి వారి కూలీల నిన్నటి ఆకలి ఇవాల తీరుస్తారా? సరైన సమయం లో వైద్యం అందక మరణించిన వారి ప్రాణాలు తిరిగి పోస్తారా? మనుషల భావోద్వేగాలని రెచగొట్టి వారి ప్రాణలని పణంగా పెట్టిన(శ్రీకాంత్)లాంటి వారి ప్రాణాల్ని తిరిగి సాదించగలరా?

1 comment:

సంతోష్ said...

annie adistanam chusukuntundi lendi..
mana vallu andhra nunch hastina ku velli vaadaanni vinipistunnarugaa....
mana india future ni italy aavida chetilo pettina desham kada..
:-)

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి