Friday, December 25, 2009

మతాలు వాటిని అనుసరించే మనుషులు



  మనుషులు ఎప్పుడు పుట్టారో ...మతం అప్పుడే పుట్టింది. అనాదిగా మానవుడు తను చేయలేని ప్రతి పనిని ఏదో ఒక శక్తి చేస్తున్నది,నడిపిస్తున్నది అని భావిస్తు వచ్చాడు.ఆ భావన కొన్ని రోజులకు నమ్మకం గా మారింది. ఆ నమ్మకం గురించి తన వాళ్ళాకు చెప్పి ఒప్పించాడు. అలా ఒకే నమ్మకం కలిగిన వాళ్ళు మేమంత ఒక మతం అన్నారు. వారందరు కలిసి ఆ శక్తి కి దైవం అని పేరు పెట్టారు. అప్పటి నుండి తనకు తెలియని పనిని చేశేది ఆ దైవమే అని భావించారు. ఆయనను పూజిస్తే (అనుసరిస్తే) మంచి జరుగుతుంది అని నమ్మారు. సాదారణం గా ఒకే ప్రాంతం లో ఉండే వారు,ఒకే వేషధారణ,ఒకే విధమైన భౌగోళీక పరిస్తితులు కలిగిఉంటారు.కాబట్టి వారు అలా ఒకే మతం గా జీవించారు.
మతం అనుసరించడం లేద పాటించడం అంటే ఒక శక్తి మీద నమ్మకం కలిగిఉండటం.ఎలా అనుసరించాలో చెప్పటానికి కొన్ని సూచనలు చెప్పబడ్డాయి. మతం ఎదైన మంచి ని బోధిస్తుంది,మంచి మార్గము లో నడవమంటుండి. రాముడు అయిన అల్లా అయిన ఏసు అయిన మంచి మార్గము లో నడిచారు కాబట్టి వాళ్ళు దైవం గా కొలవబడుతున్నారు. దైవం ఏమి చేసిన మంచే చేస్తాడు అని మనం బావిస్తున్నాము కాబట్టి మంచి పనులు చేసే ప్రతి ఒక్కరు దైవం తో సమానం. మతం అంటే దైవాన్ని చేరే మార్గం. ఎవరి మార్గం వారిది,అలాంటప్పుడు మన మార్గమే(మతమే) గొప్ప అనుకొవడం తప్పు. ఆ తప్పుని అందరిచేత ఒప్పించడం కోసం తమదే గొప్ప మతమని,మా మార్గం అనుసరిస్తే డబ్బులు ఇస్తామని,లేద కాలిజి లో సీట్ ఇస్తామని చెప్పి వారికి ఆశ చూపి వారిని మార్గం మార్చుకోమనడం ఇంకా పెద్ద తప్పు.ఏ దైవం ఎప్పుడు తప్పుని ప్రోత్సహించదు. ప్రతి ఒక్కరి దైవం చేసిన విధంగా మంచి ని ప్రచారం చేయండి అంతే కాని మతాన్ని కాదు.ఏ మార్గానికి విలువలేదు కేవలం గమ్యానికే విలువ. అది తెలిసిన నాడు ఏ మార్గమైన ఒకటే మనం దేనికోసమో మన మార్గాన్ని మరల్చుకోవల్సిన అవసరం ఉండదు.మతం కోసం కోట్లాటలు ఉండవు.

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి