Tuesday, December 29, 2009

ఆందోళనాంధ్ర ప్రదేశ్ - 2009

ఈ యేడు ఆందోళనలు జరిగినట్లు గా,నాకు తెలిసి ఈ దశాబ్దం లో మరే సంవత్సరం జరగలేదు అనుకుంటా?.ఒకే సంవత్సరం రెండు సూర్య గ్రహణాలు వస్తే చాలా అరిష్టం అని చాలా మంది భావించినట్లే ఈ యేడు అంత చాలా ఆందోళన కరం గా సాగింది.

               జనవరి 7 సత్యం స్కాం తో మొదలైన మన రాష్ట్ర ఆందోళనలు ఈ సంవత్సరం అంతట ఏదో ఒక రూపం లో కనిపిస్తునే ఉంది. ఈ సంవత్సరం మనకు మొదటి ఆందోళన "సత్యం స్కాం".


జనవరి 7 శ్రీ రామలింగరాజు తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి రాసిన లేఖ తో మన రాష్ట్రం తో పాటు మన దేశం మొత్తం తల దించుకోవల్సిన పరిస్తితి ఏర్పడింది."సత్యమేవ జయతే" అని గొప్పగా చెప్పుకునే మన దేశం లో "సత్యం" అంటే "మోసం" అనే పరిస్తితి కి వచ్చింది. అమేరికా లో ఏర్పడిన ఆర్దిక మాంద్యం మన దేశాన్ని,రాష్ట్రాన్ని ఒక్క కుదుపు కుదిపి ఎంతో మంది బడా బడా బాబులు తో పాటు మన రాష్ట్ర మద్య తరగతి ప్రజానికం వరకు ఆందోళనకు గురిచేసింది.

ధరలు ఇస్రో ప్రయొగించిన రాకెట్స్ లా ఒక పక్క దూసుకుపొతున్న తరుణం లో మన రాష్ట్ర,మరియు దేశ సార్వత్రిక ఎన్నికల తో ప్రజల పరిస్తితి మరి దయనీయం గా సాగింది.మంచో?చెడొ? అందరు అనుకున్నట్లు గా కాకుండ రాష్ట్రం లో,దేశం లో సుస్తిర ప్రభుత్వం ఏర్ఫాటు తో ప్రజలు ఊపిరి పీలుస్తున్న తరుణం లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం లో మరణించటం తో మళ్ళి ప్రజల లో భయం,ఆందోళన లు ఎక్కువ అయ్యాయి. ఆయన మరణించి 10 రోజులు కూడ కాకండానే జగన్ ను మ్య్ఖ్య మంత్రి ని చెయ్యాలి అని కొందరు చేసిన ఆందోళనలు , అల్లర్లు మన రాష్ట్ర ప్రజల్ని మరో మారు ఆందోళనలకు గురిచేసాయి.ఈ ఆందోళనలు జరుగుతు ఉండగానే ఉవెత్తున ఎగిసి పడిన వరదలు కర్నూలు,మహబూబ్ నగర్,కృష్ణ,గుంటూరు జిల్లాల్ని, మన రాష్ట్ర ప్రజల్ని మరింత ఆందోళన లోకి నెట్టాయి.


ఇవి అన్ని ఒక ఎత్తు అయితే Last but not Least అన్నట్లు గా నవంబర్ 30 నుండి తెలంగాణా అంశం మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఈ ఆందోళనలు మనల్ని ఎక్కడకు తీసుకువెళ్తాయో తెలియదు కాని ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రం హరితాంద్ర ప్రదేశ్ గానో,స్వర్ణాంద్ర ప్రదేశ్ గానో , సామజికాంద్ర ప్రదేశ్ గానో కాకుండ ఆందోళనాంద్ర ప్రదేశ్ గా మిగిలి పోయింది 

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి