Thursday, November 1, 2012

అవును.. వీరు దేనికైనా రెడి..



నిజమేనండి వారు పెట్టిన సినిమా పేరు సార్ధకం చేసుకుంటున్నారు.. వారు దేనికైనా రెడి.
ఒక కులానికి చెందిన వారిని కించపరచడానికి రెడి.
అలా ఎందుకు చేసారు అని అడిగితే సెక్యూరిటీ వారితో, వీలు అయితే పొలీస్ వారితో కొట్టించడానికి రెడి  
వాళ్ళే  కొట్టించి మళ్లి మా ఇంటి అద్దాలు పగలు గొట్టారు అని చెప్పడానికి రెడి.
అస్సలు ఆందోళన చేసిన వారు నిజామైన వారు కాదు అని చెప్పడానికి కూడా రెడి

 సెన్సార్ వారు ఒప్పుకో పొతే వాళ్ళని బెదిరించడానికి రెడి
 చేసిన వెధవ పనిని సమర్ధించుకోవడానికి రెడి.
చేసిన తప్పు అంత చేసి మళ్ళి తిరిగి వారె కేసు పెట్టడానికి రెడి.
చేసినది అంత చేసి వారు అంటే మాకు గౌరవం అని సిగ్గు లేకుండా చెప్పడానికి రెడి  
వారి ఇంటి ఆడపడుచు ఏమో  ఆ కులం గురించి వచ్చిన "C"  గ్రేడ్ సినిమా గురించి తప్పు ఏముంది అని చెప్పడానికి రెడి.


  అస్సలు మాటార్ ఏమిటి అంటే 


 కమెడియన్ తో కాసేపు నవ్వించాల ? అయితే వాడికి ఆ కులపోడి వేషం వేయండి, వాడి చేత అన్ని తింగర పనులు చేయించండి, మాంసాహారం తినిపించండి, 
ప్రపంచం లో ఎవ్వరికి రావేమో, వారి చేత "అపానవాయువు" విడిపించండి. ఎంతటి దయనియం అంటే "మూవీ మొఘల్",  గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహిత..  అని గొప్పగా చెప్పుకునే ఒక పెద్ద నిర్మాత కూడా ఇటువంటి హేయమైన పని చేయడానికి వెనకడుగు వేయలేదు. ఛి.. వీరికి ఇన్ని బిరుదులూ ఎందుకు .సత్కారాలు ఎందుకు?    

ఒక స్టార్ కమెడియన్ అయితే ప్రతి 4,5 సినిమా లలో ఒక సినిమా ..ఆ కులవృత్తి వేషం వేసి ...వెధవ పనులు అన్ని చేస్తూ దానినే నటన, హాస్యం అని చెప్పుకోవడం ఎంతటి సిగ్గుచేటు.. వారు దానికి గాను  "పద్మ శ్రీ" లు .. నంది అవార్డులు .. ఆ కులం లో పుట్టి ఉంటే తెలిసేది అది ఎంతటి మహోన్నతమైన వృత్తో ...

 పురాణాల లో .. జంతువు లలో కల్ల "ఆవు" శ్రేష్టమైనది ,  మనుషుల లో ఆ వ్రుత్తి ఎంతో పవిత్ర మైనది అని చెప్పి వుంది.

75 సంవత్సరాల తెలుగు సినిమాల లో అనాదిగా ఆ కులాన్నే కమెడియన్స్ గా మార్చేసిన  తర్వాత ఇప్పుడన్నా ఎదురిద్దం ఇలాంటివి ఇంకా జరగకుండా చూద్దాం అని పాపం ఇన్నాళ్ళకి వారు రెడి అయిన .. అన్నిటిని పెద్ద పెద్ద బూతాద్దలు వేసి చూపించే  "పేరుగొప్ప వార్తలు దిబ్బ"  t.v. వార్త ఛానల్స్ వారు మాత్రం అన్ రెడి.

 అదేదో (కంత్రి ) సినిమాలో ఎదో ఒక సీన్ లో.. రోడ్డు మీద ఒక జాతీయ నాయకుడి విగ్రహం వుంది కాబట్టి , ఆ సదరు జాతీయ నాయకుడు ఒక కులపోడే కాబట్టి.. ఆయన విగ్రహం వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కావున  మీరు సిన్మా లో ఆ ముక్క తీసిన దాక, పాపం ఆ తొమ్మిదో  నంబర్ చానల్ హడావుడి అంత ఇంత కాదు.మరి ఆ హడావుడి ఇప్పుడు ఏమైంది.

"పురం"( గ్రామం, నగరం, పట్టణం , దేశం , రాష్ట్రం , విశ్వం)  హితం కోరే ఈ వ్రుత్తి చేసే అటువంటి వారిని ఇలా అవహేళన చెయ్యడం ఎంతటి ధవుర్భాగ్యం


 ఇలాంటివి ముందు ముందు అన్నా జరగకుండా ఆపాలని అ దేవుడిని ప్రార్దిస్తూ..

 మీ నలుగురి లో నాలుగోవాడు ..

4 comments:

voleti said...

Thanks as your comment is same as me..

Anonymous said...

బాగా చెప్పారు.

Truely said...

నీచ మైన ఈ సినిమా ని మరి ఎవ్వరు ఖండించక పోవటం . మిగతా వర్గాల వారు ఎంటువంటి సంకోచెం లేకుండా వినోదించటం ఎంతో విచారకరము . తమిళ సినిమా లో భ్రాహ్మణుల ను ఎక్కడ కించపరచకుండా చూపిస్తున్నారు. చాల సినిమాల్లో హీరోలు గా కూడా చిత్రీకరించారు . తెలుగు భ్రాహ్మణులు సమాజంలో ఎందుకు ఇంత చులకన ఔతున్నారో ఒక సారి ఆత్మ విమర్శ చేసుకోవటం ఏంటో అవసరం వుంది.

నలుగురి లో నాలుగోవాడు said...

Thank you all for your comments!.
@Truely its really true.
@LBS Thank you!.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి