Saturday, November 24, 2012

మీకు తెలుసా సెక్షన్ 66 A ( Section 66 A details )


తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు కాలుతుంది.
అది ఏ మాత్రం తెలియని అంబాడే పాపాయి అయిన  కాటికి కాలు చాచిన పండు ముసలి అయిన.
గాలికి  పోయే కంపని మన ముడ్డి కి  మనమే తగిలించుకుంటే ?
సరదాగా మనం చేసే పని మన మెడ కు కొండచిలువ లా చుట్టుకుంటే ?
 అలాంటిదే మన చట్టం సెక్షన్ 66 A , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. 

 సెక్షన్ 66 A మన లో చాలా మందికి (అందులో నీను కూడా ఉన్న లెండి) తెలియదు , కాదు తెలుసు కోవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు వచ్చింది మరి తెలుసుకోవాలి కదా. కనీసం చేతులు కాలాక అయిన .... పట్టుకోవాలి కదా.

అది ఏమిటో ఎందుకో మనల్ని ఏమి ఏమి చెయ్యగలదో చదవండి మరి.

మొన్న మరాఠి బొబ్బిలి స్వర్గీయ బాలసాహెబ్ అదేనండి, టైగర్ బాలథాకరే స్వర్గాస్తులు అయినప్పుడు శని , ఆది వారలు ముంబై తో పాటు , పూణే ఇంకా మిగత మహారాష్ట్ర అంతట అప్రకటిత బంద్  జరిగింది. ఆయన అనుచరులు అంత పాపం దుఖ సాగరం లో ఉన్నారు, మిగత వారు మనకు ఎందుకులే అని ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. 
అన్ని మూసిన మన FB దుకాణం ఎవ్వరు కట్టలేదు కదా అందుకే సరదాగా బయటకి వెళ్ళలేక పోతున్న అనుకుందో ఏమో ఒక అమాయకురాలు   బంద్ భయపెట్టి చెయ్యకూడదు , ప్రేమతో చెయ్యాలి అని ఒక పోస్ట్ చేసింది.దానికి వాళ్ళ స్నేహితురాలు ఒక Like ఇచ్చింది , ఇంకేముంది సెక్షన్ 66 A వాళ్ళ ఇంటికి పోలిస్ లని  తీసుకురావటం , జైలు కి తోలుకు పోవటం చక చక జరిగాయాయి.

అదేమరి సెక్షన్ 66 A అంటే,  మీకు గుర్తు ఉండే ఉంటుంది అప్పట్లో కొన్ని రోజులు bulk SMS లు పంపడం కుదరదు అన్ని బ్యాంకు లు, మొబైల్ ఆపరేటర్లు మూసుకొని కూర్చున్నారు అది కూడా మన సెక్షన్ 66 A వల్లనే. 

అస్సలు సెక్షన్ ఏమి చెపుతుంది అంటే  Punishment for sending offensive messages through communication service, etc..  అనగా ఇంటర్నెట్ , ఫోన్ ల నుండి ఇతరులకి ఇబ్బంది కలిగించేలా సందేశాలు పంపడం, గొడవల్ని ప్రేపించడం , ఇతురల మనోభావాలు దెబ్బతినేల సందేశాలు పంపిచడం వగైరా అన్న మాట చేస్తే వారిని ఈ చట్టం కింద  గరిష్టం గ 3 సంవత్సరాల వరకు బొక్కలో వేయోచ్చు అన్నమాట.

ఇందులో ఫోన్ నుండి పంపే సందేశాలు పంపడం , ఈ-మెయిల్స్ పంపడం ,  మన ట్విట్టర్ , FB లాంటి వాటిలో పోస్ట్ చెయ్యడం అన్ని వస్తాయి,

కావున  నా ప్రియ మిత్రమా, ఏది పడితే అది రాసి , దానిని share చేసి దానికి like ఇచ్చుకుంటూ పొతే, సెక్షన్ 66 A , కుయి కుయి అనుకుంటూ పోలీసు లను ఇంటికి తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.    

దీనికి Like కొట్టి share చెయ్యోచు ఇందులో అందరిని జాగ్రత పరవడమే కానీ ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టలేదు కదా..

మీ నలుగు రి లో నాలుగో వాడు ...





No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి