Thursday, November 22, 2012

ఇది ఒక గుణపాఠం


కసాబ్ ఉరి  ఉగ్రవాద సంస్థల కి  ఒక గుణపాఠం కావాలి. ఇక నుండి ఎవరు అయిన భారత్ లో అల్లర్లు , విద్రోహాలు చేస్తే మనం ఇంకా ఏ మాత్రం ఉపేక్షించ బోము అని అందరికి తెలియాలి.

భారతీయులు అంత సెంటిమెంట్ కి పడిపోతారు, శరణం కోరితే శత్రువుని కూడా వదిలివేస్తారు అని మన మంచితనాన్ని చేతగానితనం గా తీసుకుంటున్న ప్రతిఒక్కరికి ఇది  ఒక గుణపాఠం కావాలి.

వాళ్ళ వల్ల  ఏమి కాదు, సాక్షాత్ పవర్ లో ఉన్న ప్రధానమంత్రి ని లక్షలాది ప్రజల సాక్షి గ మనవ బాంబ్ తో పేల్చినా , పట్టుకొని కూడా ఎదో సాదారణ శిక్ష మాత్రమే  వేసారు. వాళ్ళు మనల్ని ఏమి చేస్తారు అనుకునే వాళ్ళకి ఇది ఒక గొడ్డలి పెట్టు కావాలి.

విద్రోహులకి భారత్ పేరు చెపితే వెన్నుల్లో వణుకు పుట్టాలి అన్న , భారత్ లో ఏమి తప్పు చేయడానికి అయిన భయపడాలి అన్న ఇది ఇక్కటి తో ఆగ కూడదు.

 దేశ భద్రత విషయం లో మనం యిసుమంత కూడా ఏమరిపాటు చూపకూడదు, అలాంటి విషయాలలో ఏమాత్రం దయ దాక్షిణ్యాలు చూపకూడదు. ఆవేశం లో హత్య చేసినవారిని క్షమించి ఉరి తీయక పోయిన పర్లేదు కానీ దేశభద్రత విషయం లో అలాంటి వాటికీ చోటు ఇవ్వకూడదు.

అల్లర్లు సృష్టించిన, విద్రోహ , ఉగ్రవాద చర్యలు చేసిన వారిని పట్టుకున్న వెంటనే ప్రాధమిక విచారణ పూర్తీ అవ్వగానే మరణశిక్ష విధిస్తే గాని మిగత వారు దడవారు.

భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న "లష్కర్ ఎ తో యి బా" లాంటి సంస్థల తో సంబంధం ఉన్నట్లు తెలిసినవారిని కూడా కటినం గ శిక్షించాలి.

తప్పు చేస్తే చంపుతారు అనే అంత కటినం గ శిక్షలు విదించి , వీలు అయినంత త్వరగా వాటిని విదిస్తే , ఖచ్చితం గ ఆ పనులు చేసే వారు భయపడతారు.

మనం విషపు చెట్టు ని చంపాలి అంటే కొమ్మలు కత్తిరిస్తే సరిపోదు, దాని మొదళ్ళ నుండి పికాలి అలానే ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం అనే విషపు మొక్కల్ని మొదళ్ళ నుండి ఏరి పరేయల్సిన అవసరం ఎంత అయిన ఉంది

ఇప్పటి కి అయిన 4 సంవత్సరాల సుదీర్గ వీరామం తర్వాత ఆ నిచుడ్ని ఉరి తీసి మంచి పని చేసింది,

ఆ రోజు ఆ దుర్గటన లో ప్రాణం కోల్పోయిన వారి ఆత్మా శాంతి0చాలి అని కోరుకుంటూ 

 మీ నలుగురి లో నాలుగోవాడు 


No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి