Wednesday, July 18, 2012

నువ్వు అక్కడ ఉంటే ....నేను ఇక్కడ ..

గోపి గోపిక గోదావరి సినిమాలో .. ఒక పాట ఉంది .. ఆ  సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు కనపడలేదు కానీ , ఈ పాట "నువ్వు అక్కడ ఉంటే  ..నేను ఇక్కడ ఉంటె ప్రాణం విల విల " అనే పాట డయలర్ పాట గ పెట్టు కున్న వాళ్ళు చాల మందినే చూసా..

ఇక్కడ పాట మాటర్ కాదు కానీ ... ఆ లిరిక్స్ ఎందుకో బాగా ఒక నెల నుండి ..బాగా తలుచుకున్న .. ఎందుకబ్బా ? అని మరి  ఎక్కువగా "చించకండి" .. విషయం ఏమిటంటే .. :"ఆషాడ మాసం" .

హమ్మయ అయిపొయింది అనుకుంటే ... ఇప్పుడు  "శ్రావణ మాసం"  నోములు వ్రతాలూ ..

మళ్లి  ఇంకో నెలన "ఓ................. నో ...... " నాకు కుదరదు, నా వల్ల కాదు ..అని గట్టిగ అరిచి చెపుదాం అనుకుందాం .. కానీ

అక్కడ  "బొమ్మరిల్లు" ఫాదర్ కదా ...నాకు డైలాగ్ ఒక్కటే ఇచ్చారు చిన్నప్పటి నుండి "సరే నాన్న, అలానే చేస్తా "

మళ్లి అదే సీన్, అదే డైలాగ్  ... సరే నాన్న , అలానే అని ..

ఈ  పెద్దోళ్ళు ఉన్నారే చిన్న వాళ్ళని అర్ధం చేసుకోరు ....


అదే మాట అన్నయ్య తో అంటే .. "ఎడబాటు లోనే అసలు ప్రేమ చిగురిస్తుంది" అని చెప్పాడు, అనుభవం నేర్పిన పాఠం అనుకుంట.. 


వదిన తో అంటే,  మేము ఏమి చేసిన అది బర్త, పిల్లలు బాగుండాలి అనే బాబు, మేము ఉపవాసం చేసిన మీ కోసమే   
పూజలు చేసిన మీ కోసమే... అన్నారు..

అవును అనాలేమో ... కాదు . అనకుండ ఉండ్లేమేమో ..

ఈ పాట "నువ్వు అక్కడ ఉంటే  ..నేను ఇక్కడ ఉంటె ప్రాణం విల విల " ఇంకో నెల తప్పదేమో ....


ఐడియా వాడికి నెలకి ఒక వెయ్యి , 1500, తప్పదేమో ..........
      
అదిగో  ఫోన్  మ్రోగుతుంది  ......"ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్లు ఉందే ...."   

No comments:

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి