నవ్వటం ఒక యోగం .. నవ్వించడం ఒక భోగం .. నవ్వలేక పోవడం ఒక రోగం ... అని స్వర్గీయ జంధ్యాల గారు చెప్పినట్లు .. నిజం గా నవ్వటం అనేది దేవుడు మనిషి కి మాత్రమే ఇచ్చిన ఒక వరం ...దానిని సద్వినియోగం చేసు కోవాల్సిన అవసరం మనకు ఎంతైన ఉంది ....
నిత్యం మనకు ఉన్న పని వత్తిడో .... ఇంకా మరి ఏ ఇతర కారణాల వలన మనం నవ్వటం అనే ఒక మంచి .. వ్యాయామాన్ని మరుస్తున్నాము..
మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నార? లేక మీ పక్కింట్లోనో ..ఎదురింట్లొనో ఖచ్చితంగా ఉండే ఉంటారు లేండి ..వారిని ఒక సారి పరిశీలించండి ..వాళ్ళు ఎప్పుడు ..ఉల్లాసం గా ఉత్సాహం గా ఉండటానికి కారణం ..వారికి ఏ వత్తిడి లేక పోవడం కాదు .. వారిలో హాస్య చతురుత .. తొందరగ స్పందిచే గుణం ... అది మనం అందరం వారి నుండి నేర్చుకోవలిసిన సద్గుణం ...
ప్రతి రోజు అందరి కంటే ఎక్కువ గా నవ్వగలిగిన వాళ్ళు ..నవ్వెవాళ్ళు .. ఎక్కువ కాలం యవ్వనం గా ఉండి ..అందరి కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్టారు అని చాల సర్వేలు తేల్చి చెబుతున్నాయి ...కాబట్టి ఈ కొత్త సంవత్స్రం అయిన మీరు మరింతగ నవ్వి మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు అని కోరుకుంటున్నాను ....
మీ కు తెలిసిన హాస్య సంధర్బాలు మన బ్లాగ్ మిత్రులతో పంచుకొని మీరు నలుగురిని నవ్వించండి ...ఆ నలుగురిని తలా నలుగిరిని నవ్వించమని కోరండి .. ఇలా చేస్తే రెండు మూడు రోజుల లో మన అందరికి నాలుగు , ఐదు సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుంది ...
సర్వే జనో నవ్వో భవతు:
Friday, December 31, 2010
Thursday, December 30, 2010
శ్రీ కృష్ణ గోవిందా ! .. హరే మురారి ....
శ్రీ కృష్ణ గోవిందా ! .. హరే మురారి .... జై వాసు దేవా ...
అని కృష్ణాష్టమి రోజు ఎంతమంది ..భజన చేసారో తెలియదు ..కాని .మన రాష్ట్రం లో గత ఒక సంవత్సరం గా ప్రతి రోజు శ్రీ కృష్ణ నామ జపమే ... గడువు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కటే ఉత్కంఠ ...ఎన్నికలు ముందు చివరి రోజు ప్రచారం కోసం నాయకులు లో ఎంత ఉత్కంఠ ఉంట్టుందో ఇప్పుడు కూడ అంతకన్న ఎక్కువే ఉంది...
ఇన్నాళ్ళు "జస్టీస్ శ్రీ కృష్ణ" కమిటి నీవేదిక అంటు వేచి చూసే ధోరణి అవలంభించిన కాంగ్రేస్ , తెలుగుదేశం పార్టీలు తమ వ్యూహాలని ఎలా మార్చుకుంటాయో చూసే సమయం ఆసన్నమైనది ..
సమైక్య ఆంధ్ర కే కట్టుబడి ఉన్నాము అని చెప్పుకునే ప్రజాధరణ లేని ప్రజారాజ్యం పార్టి, చిన్న రాష్ట్రల తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పే 1 + 1 భారతీయ జనత పార్టి .. తెలంగాణ తన జీవిత ధ్యేయం అని చెప్పి చెప్పి విధ్యార్ధుల జీవాతాల తో చెలగాటం ఆడే "తె రా సా" తమ రాజకీయ లబ్ధి కోసం విధ్యార్ధులని రెచ్చగొట్టీ వారిని హింసాత్మక ధోరణి వైపు నెట్టే పొలిటికల్ "జే.యే.సి" లు ఇప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాయో కదా! ...
ఈ సమయం చాల చిత్రమైనది .. మరియు ఎంతో కీలకమైనది ... ప్రతి ఒక్క రాజకీయ పార్టి తన భవిషత్తు కోసం వేల విధ్యార్దుల ఆవేశాన్ని వారి ఆయుధము గ మార్చుకోవడానికి గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నాయి ..
ఇదే అదునుగా మన రాష్ట్రం లో విచ్చిన్నకర పరిస్తితులు సృష్టించడానికి ఎంతో మంది తీవ్ర వాదులు ఎదురు చూస్తున్నారు ...
సందట్లొ సడేమియా ..తమ "టి.ఆర్.పి" రేట్లు పెంచుకోవడానికి ఏ విలువ లేకుండ ఎటువంటి వార్తలును అయిన ప్రసారం చేసి ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టే వార్త ప్రసరాలు ఇప్పుడు కాచుకొని కుర్చున్నాయి ..
సరిగ్గ ఇదే సమయం మన లోని విజ్ఞత, మన చదువు మనకు నేర్పిన సంస్కారం ..ప్రదర్సించడానికి .. ఒక నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే ఇప్పుడు వచ్చే నివేదిక కూడ ఎదో ఒక వైపు మొగ్గుతుంది.. ఈ నివేదిక అందరి ని ఒప్పించ లేక పోయిన ..మన సంసంస్కారం, సమ్యమనం తో ఎదుటి వారిని నొప్పించ కుండ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైన మన మీద ఉంది ...
వారి స్వార్ధం కోసం మిమ్మల్ని బలి పెట్టే రాజకీయ నాయుకులు ఒక పక్క, మీరు సంతోషం గా ఉండటానికి తమ రెక్కలు ముక్కలు చేసుకొని వారి ఆసలు అన్నీ మీ మీదనే ఉంచుకునే మీ తల్లి తండ్రులు మరో పక్క ఉన్న ఈ సమయం లో సరియైన నిర్ణయం తీసుకోవాలి ..
హే కృష్ణా! .. సంకట స్తితి లో ఉన్నప్పుడు అర్జునికి గీతోపదేశం చేసి అర్జునిడిని ఏ విధము గా అయిటే కార్యోర్ముకుడివి చేసినా వో .. అదే విధముగా ఇప్పుడు ఈ భరతమాత బిడ్డల్ని .. సరి యైన దారి లో ..నడుపు తండ్రి

Thursday, December 23, 2010
మా ఇంటి "ఇంగ్లీష్" చిలక ...
"సుహృద్" మా పెద్ద అన్నయ్య .పెద్దబ్బాయి..వయసు 5 సంవత్సరాలు ..చదువుతున్నది 1 ఇంగ్లీష్ మీడియం ..వాడే మా ఇంటి "ఇంగ్లీష్" చిలక ...
ఒకటి(1) ఇంగ్లీష్ మీడియం .... అని నొక్కి చెబుతున్నా ..ఎందుకు అంటే వాడే మా ఇంట్లో ..మొదటగా ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియం లో చదువుతున్నది ...
అస్సలు మాటర్ లోకి వస్తే .. చిన్న పిల్లలు మాట్లాడుతుంటేనే ..చిలక పలుకుల్లా ముద్దొస్తు ఉంటాయి ...
ఇంక అందులో ఇంగ్లిష్ పలుకుతుంటే .. వినాలే కాని ..ఆ ఆనందం వర్ణనాతీతం..
నేను ఇంటికి వెళ్ళినప్పుడల్ల ...మా అన్నయ్య , వదిన , నేను , మా అమ్మ నాన్న ..అందరం చిన్న ఇంగ్లీష్ లో ఇడుచుకో .. ఇంకోటి ఇడుచుకో ..అంటు మా వాడిని ఉత్శాహపరుస్తాము ...
మేము ఇచ్చే ప్రోత్సాహం ..వాడి ఉత్సాహం ..వల్ల ఇంగ్లిష్ వాడి నోట్లో నుండి ....అలా అలా ముత్యాలు లా జారి పొతాయి ..
మా ఇంటి ఇంగ్లీష్ చిలక పలికిన కొన్ని పలుకులు ...
What Father's brother ...? How are you fine ?
అంటే ఎమిటి బాబాయి ....బాగున్నావా ? అని ...
What grand mother ? Tell to Grand son ..?
అంటే ఎమిటి బామ్మ ..నాకు చెప్పు... అని
What Father's brother ..? What computer ..?
అంటే ఏమిటి బాబాయి ..కంప్యుటర్ లో ఏమి చెస్తున్నావు అని ...
అప్పుడే మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు ..
అప్పుడు మా వాడు ...
అంతకు ముందు రెండు రోజుల ముందు ..మా వదిన.. వాడికి లంచ్ బాక్స్ ఇద్దామని వెళ్ళారు అట ..అదే సమయం లో వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయుడు కనిపించి ..
Hi Suhrudh, How are you ? అని అడిగారు అట ..
వెంటనే మా Hero .. My name is T Venkata Suhrudh Sandilya
అని తడుము కోకుండ చెప్పేశాడు అట...
ఇది చెప్పటం ..మా ఇంట్లో నవ్వటం ...
ఈ షో మా ఇంట్లో .. దాదువు 1 గంట నడిచింది ... ఈ గంట లో వాడికి ..వాళ్ళ బామ్మ, తాతయ్య, న్నాన్న, ఇంక ఈ పిచ్చి బాబాయి ... ఎన్ని ముద్దులు పెట్టామో గుర్తే లేదు ...
ఒక అర్ధ గంట తర్వాత గుర్తు వచ్చింది .. నేను ఇంజినీరింగ్ 2 వ సంవత్సరం లో మొదటి సారి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన తర్వత మా ఇంగ్లీష్ మాష్టార్ నన్ను హత్తుకొని ...
.
I never laugh this much these days.. అన్నారు .. ఆ సమయం లో అర్ధం కాలేదు కాని ... ఈ సంఘటన జరిగినప్పుడు అర్ధం అయ్యింది.. ఎందుకు అంతలా ఫీల్ అయ్యారో ..
మా నాన్న గారు ఎప్పుడు చెబుతు ఉంటారు ..నీకు నేర్చుకునే ధైర్యం ఉండాలి కాని ..ప్రతి ఒక్కరి దగ్గర ఎదో ఒకటి నేర్చుకోవచ్చు అని ....
ఆ మాట నిజం ...
నాకు "సీతఫలపు పండు" ని ... custard apple అంటారు అని ..
ఉయ్యాల ఊపడాన్ని .... waving అంటారు అని నాకు మా ఇంగ్లీష్ చిలకనే నేర్పాడు ...
మళ్ళి రేపు మా ఊరు వెళ్తున్న ....ఈ సారి మరిన్ని పలుకులు మోసుకువస్తా ...
ఒకటి(1) ఇంగ్లీష్ మీడియం .... అని నొక్కి చెబుతున్నా ..ఎందుకు అంటే వాడే మా ఇంట్లో ..మొదటగా ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియం లో చదువుతున్నది ...
అస్సలు మాటర్ లోకి వస్తే .. చిన్న పిల్లలు మాట్లాడుతుంటేనే ..చిలక పలుకుల్లా ముద్దొస్తు ఉంటాయి ...
ఇంక అందులో ఇంగ్లిష్ పలుకుతుంటే .. వినాలే కాని ..ఆ ఆనందం వర్ణనాతీతం..
నేను ఇంటికి వెళ్ళినప్పుడల్ల ...మా అన్నయ్య , వదిన , నేను , మా అమ్మ నాన్న ..అందరం చిన్న ఇంగ్లీష్ లో ఇడుచుకో .. ఇంకోటి ఇడుచుకో ..అంటు మా వాడిని ఉత్శాహపరుస్తాము ...
మేము ఇచ్చే ప్రోత్సాహం ..వాడి ఉత్సాహం ..వల్ల ఇంగ్లిష్ వాడి నోట్లో నుండి ....అలా అలా ముత్యాలు లా జారి పొతాయి ..
మా ఇంటి ఇంగ్లీష్ చిలక పలికిన కొన్ని పలుకులు ...
What Father's brother ...? How are you fine ?
అంటే ఎమిటి బాబాయి ....బాగున్నావా ? అని ...
What grand mother ? Tell to Grand son ..?
అంటే ఎమిటి బామ్మ ..నాకు చెప్పు... అని
What Father's brother ..? What computer ..?
అంటే ఏమిటి బాబాయి ..కంప్యుటర్ లో ఏమి చెస్తున్నావు అని ...
అప్పుడే మా ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు ..
అప్పుడు మా వాడు ...
What Letter man ? who letter ?
అన్నాడు ..
అంటే పోస్ట్ మ్యాన్ ..ఎందుకు వచ్చాడు లెటర్ ఎవరికి వచ్చింది అని...
వెంటనే మా Hero .. My name is T Venkata Suhrudh Sandilya
అని తడుము కోకుండ చెప్పేశాడు అట...
ఇది చెప్పటం ..మా ఇంట్లో నవ్వటం ...
ఈ షో మా ఇంట్లో .. దాదువు 1 గంట నడిచింది ... ఈ గంట లో వాడికి ..వాళ్ళ బామ్మ, తాతయ్య, న్నాన్న, ఇంక ఈ పిచ్చి బాబాయి ... ఎన్ని ముద్దులు పెట్టామో గుర్తే లేదు ...
ఒక అర్ధ గంట తర్వాత గుర్తు వచ్చింది .. నేను ఇంజినీరింగ్ 2 వ సంవత్సరం లో మొదటి సారి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన తర్వత మా ఇంగ్లీష్ మాష్టార్ నన్ను హత్తుకొని ...
.
I never laugh this much these days.. అన్నారు .. ఆ సమయం లో అర్ధం కాలేదు కాని ... ఈ సంఘటన జరిగినప్పుడు అర్ధం అయ్యింది.. ఎందుకు అంతలా ఫీల్ అయ్యారో ..
మా నాన్న గారు ఎప్పుడు చెబుతు ఉంటారు ..నీకు నేర్చుకునే ధైర్యం ఉండాలి కాని ..ప్రతి ఒక్కరి దగ్గర ఎదో ఒకటి నేర్చుకోవచ్చు అని ....
ఆ మాట నిజం ...
నాకు "సీతఫలపు పండు" ని ... custard apple అంటారు అని ..
ఉయ్యాల ఊపడాన్ని .... waving అంటారు అని నాకు మా ఇంగ్లీష్ చిలకనే నేర్పాడు ...
మళ్ళి రేపు మా ఊరు వెళ్తున్న ....ఈ సారి మరిన్ని పలుకులు మోసుకువస్తా ...
ఫిజిక్స్ సారు, నేను, గాడిద ..
నాకు తెలిసి ప్రపంచం లో అతి ఎక్కువ మెమొరి ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ..మన మెదడే అనుకుంట....
ఈ ఉపోద్ఘాతం ..ఎందుకు అనుకుంటున్నారా ...?
నాకు ఇవ్వాళ కార్యాలయానికి వెళ్ళే దారి లో ..ఒక గాడిద కనిపించింది...
అందులో వింత ఏముంది ..కదా ?
నాకు 2000 సంవత్సరం నుండి గాడిద ..కనిపిస్తే ..ఫిజిక్స్ సార్ గుర్తొస్తారు ...
మాములుగ అయితే అందరి దౄష్టి లో ఫిజిక్స్ కి ..గాడిద లకి ఏమి సంబందం ఉండదు ..
కాని ఆ రోజు జరిగిన సంఘటన ..నన్ను జీవితం లో గాడిద ని ..ఫిజిక్స్ సార్ ని మరిచి పోకుండ చేసింది ...
~~~~ ం ం ం ం ~~~~ కంగారు పడకండి .. మీమ్మల్ని నాతో మా కాలేజి కి తీసుకు వెళ్తున్న అన్నమాట ~~~
ఆ రోజు ..అర్ధం కాని ఫిజిక్స్ క్లాస్ లో ..ఏ ముక్క చెవికి ఎక్కదు అని తెలిసిన ..తదేకంగా బోర్డ్ వైపే చూస్తున్న ...
అప్పుడు మా ఫిజిక్స్ సార్ [.. ఆయన కూడ నా లానే "బి.జె.పి" అనుకుండి .. "బి.జె.పి" అంటే అదేదో జాతియ పార్టి కాదు .. "భూమికి జానెడు పొడుగు" ]
లేపి బాబు IS PUSHING EASIER OR PULLING? అని అడిగారు .. మనమా అస్సలే గవర్నమెంట్ వారి సర్కారు స్కూల్ ..అందు లోను ... కొత్త పాలెం నుండి కొత్త గా ఎర్ర బస్ దిగా .. అస్సలే ఏ ముక్క రాని ఇంగ్లిష్ మీడియం .. అందు లో అర్ధం కాని ఫిజిక్స్ ...
sun / son లా ఒకే లా ఉన్నాయి .. రెండు ( pushing and pulling) మొదటి సారి వింటున్న ..ఏమి చెప్పా లో తెలియదు ... "తెలియదు సార్" అని కూడ ఇంగ్లీష్ లోనే చెప్పాలి అందుకే బెల్లం కొట్టే రాయి లా .. అలా నిలబడ్డా ...
అప్పుడా ఆయన నన్ను "గాడిద ..అది కూడా తెలియద" అని తిట్టారు..
వెంటనే ఆయనే ఒక్క నిమిషం ఆలోచించి చెప్పటం మరిచి పోయ గాడిద లు నా కల లోకి వచ్చి ..రోజు సార్ మరి వాడి తో పోలుస్తున్నారు ఎమిటి సార్ ..మా పరువేం గాను అని బాధ పడుతున్నాయి .. అని అన్నారు ...
ఆ మాటలకి క్లాస్ మొత్తం విపరీతం గ నవ్వుతుండగానే .... నా చూపు అలవాతు అలవాటు లో పొరపాటు లా జ్యోతి వైపు చూశ .. జ్యోతి విపరీతంగా నవ్వుతుంది ..ఎలా అంటే చిన్న పిల్లలు సర్కస్ లో భఫూన్ ని చూసి నవ్వుతారే అలా అన్న మాట .. అదేదొ సామెత [ " మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వింది అని బాధ అంట" ] అన్నట్లు గా నాలో "జల్" తుఫాన్ నా తేనే కళ్ళ దగ్గర తీరం దాటింది ...
వెంటనే మా సార్ .. ఒరెయి మరి ఇలా ప్రతి దానికి ఫీల్ అయితే "టీచర్" అవి అవుతావు అన్నారు ..
అది అన్నమాట "గాడిద".. "నేను" .. "మా ఫిజిక్స్ సార్ ..."
పదేళ్ళు అయిన ..నాకు గాడిద ని చూడ గానే అదే గుర్తు వచ్చింది .. ఎంత గొప్ప మెమరి నాది ...
కొసమెరుపు ... ఆయనని మేము ఇప్పుడు ముఖ్య ప్రశ్నలు చెప్పండి సార్ అన్నా ..నే చెపితే రావు .. జరగదు అనే వారు ..ఆయన అన్నట్లు గానే నేను టీచర్ ని కాలేదు .. అప్పడ్నించి "తిట్లు" అలవాటు అయిపోయి ..దున్న పోతు మీద వాన పడ్డట్లు ..ఫీల్ అవ్వటం మానేసాను ...
PUSH / PULL అని బోర్డ్ ని చూసిన కూడ నాకు ఇదే సీన్ గుర్తొస్తుంది ....

Wednesday, December 22, 2010
గూగుల్ ..ఓ మంచి గూగుల్ ..నువ్వు నాకు నచ్చావు ..
గూగుల్
గూగుల్ .. ఓ మంచి గూగుల్ ..

ఉత్తరాలు రాసుకొవడానికి .. జిమేల్ ఇచ్చావు ....
మన ఉత్తరాలు వేరే వాళ్ళు చదవకుండ పాస్ వర్డ్ ఇచ్చావు ..
స్నేహితులు తో మాట్లడటానికి జీటాక్ ఇచ్చావు..
నన్ను ప్రపంచానికి చూపించుకోవడానికి పికాస ఇచ్చావు ..
ఏ ప్రదేశం ఎక్కడ ఉందో చెప్పడనికి గూగుల్ మ్యాప్స్ ఇచ్చావు..
నేను కూడ రాయగలను అని చెప్పడనికి బ్లాగ్స్ ఇచ్చావు ..
మరిచిపోయిన స్నేహితుల్ని కలవడానికి ఆర్కుట్ ఇచ్చావు ...
ఎప్పుడు ఏ అవసరం వచ్చిన వెతుక్కొడానికి సెర్చ్ ఇచ్చావు ..
ఎర్రర్ నేను పోస్ట్ చేస్తే .. సొల్యుషన్ నువ్వు ఇచ్చావు ...
పైస ఖర్చు లేకుండ సినిమాలు చూసేలా చేసావు ...
ఇవి అన్ని నన్ను రూపాయి కూడ అడగకుండా ఉచితంగా ఇచ్చావు ...
ఇలానే
ఏ తొకలు పెట్టకుండ వెబ్సైట్ ఇస్తావు అని ...
తప్పిపోయిన నా మొబైల్ కనిపెట్టాడనికి ..ఎదో ఒక దారి చూపిస్తావని..
కోరుకుంటున్నాను ..
చేస్తావు ..నువ్వు తప్పకుండ చేస్తావు ఎందుకంటే నువ్వు గూగుల్ వి ..మంచి గూగుల్ వి...

కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం
కొత్తగా.... సరికొత్తగా .. కొత్త సంవత్సరం .. ఏమి చెయ్యాలి ... ఎలా మొదలు పెట్టాలి.
కొత్త సంవత్సరం .. పాత సంవత్సరం లా పాత లా ( రొటీన్) ఉండకూడదు .. కొత్తగా కొత్త పనులు మొదలు పెట్టాలి.
ఇవి రాబోయే సంవత్సరం లో నేను కొత్తగ మొదలు పెడదాము అనుకునే ....సంకల్పాలు ..
1) మా అమ్మ, నాన్న చిన్నప్పటి నుండి చెవి లో ఇల్లు కట్టుకొని మరి చెప్పే మాట .. పొద్దున్నే లేవాలి....
ఇప్పటి దాక ..పొద్దున అంటే వేకువ జామున 8:30, 9:00 అనుకునే నేను ... వచ్చే సంవత్సరం నుండి పొద్దున్నే అంటే 7:30 అని మెదటి బిల్లు గా ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది అని చెప్పుటకు సంతసించడమైనది..
2)
అరే ఒకసారి అద్దం లో చూసుకో.. బద్దకం ఎక్కువై .. రోజు రోజు కి.. కొబ్బరి బోండం లా తయారు అవుతున్నావు .. అని మా హితులు ..సన్నిహితులు ..కోరడం తో .. అందులోను ఇలా అయితే పిల్ల ని ఎవ్వరు ఇవ్వరు అని పలురకాలు గా భయాందొళనలకు గురిచేయడం వలన
వచ్చే సంవత్సరం నుండి .. క్రమం తప్పకుండ "జిమ్మ్ కి" వెళ్ళడం లేద అందుబాటు లో ఉన్న టీటీ ..వాలీబాల్ వంటి ఆటలు ఆడి అయిన సరే శరీర సౌష్టవం కాపాడుకుంటాను అని మీ అందరి ముందు వాగ్దనం చెస్తున్న..
3) అరే నువ్వు ఏ పెళ్ళాం కాకి, పిల్లలు కాకులు లేని ఏకాకివి ..నీ ఖర్చులు చూస్తే ..
హైదరబాద్ లో ఒక మంచి ఏరియా లో ఒక చిన్న కుటుంబం చింతలు లేకుండ ఒక నెలంత జీవించడం తేలిక అని మళ్ళి నా హితులు సన్ని హితులు కోరడం ....
మీ ముద్దుల కొడుకు దుబారాలు ఎక్కువ అయ్యాయి అని ..వార్తలు "టీవి9" వాళ్ళు లేకుండనే ఇంట్లో ప్రాదేశిక వార్తలు గా ప్రసారం అవ్వడం వల్లన ..
ఇలా అయితే నీ .. "ఏ టి యం" కార్డు తీసుకొని పాకెట్ మని లాంటి పాత స్కీములు కొత్తగా మొదలు పెడతాము అని అధిష్టానం నుండి హెచ్చరికలు రావడం తో ...
వచ్చే సంవత్సరం నుండి ప్రతి పైస ఖర్చు పెట్టెముందు .. ఎందుకు ..? అవసరమా? అని రెండు ప్రశ్నలు సంధించుకొని వాటికి సరియైన సమాధానం వచ్చిన పిమ్మట మాత్రమే ఖర్చు చెయ్యాలని ..కొత్త నిభందన ఎర్పాటు చేయడమైనది .. అని విన్నవించుకుంటున్నాను
చివరగా
అధిష్టానం దగ్గర బుద్దిమంతుడు అని పేరు తెచ్చుకున్న నేను ..ఇప్పటి వరకు గడిచిన 26 సంవత్సరములు లాగానే ..ఈ వచ్చే సంవత్సరం కూడ ..ధూమపానం ..మధ్యపానం .. ఇంకా ..ఎమైన మంచి అలావాటులు కి దురంగా ఉండి .. అధిష్టానం నమ్మకాన్ని .. వమ్ము కానియకూడదు అని ప్రతిఞ్ చేయుచున్నాను...

పైన పెర్కొనబడిన నా సంకల్పలు ..కేవలం నా స్వార్జితం అని ఎవరి నుండి తస్కరించనవి కావు అని ... ఒకవేళ ఇవే సంకల్పాలు మీరు చేసిఉంటే దానికి నేను .. నా బ్లాగ్ ఎవిధముగా బాద్యుడిని కాను అని .... ఒకవేళ నా సంకల్పాలు మీకు నచ్చి మీరు కూడ పాటించిన .. నాకు ఏమి రొక్కం .. ఏ రుపం లో కూడ కట్టవలిసిన అవసరం లేదు ...అని విన్నవించుకుంటున్నాను
ఇట్లు
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
మీ
నలుగురి లో నాలుగో వాడు. ..
Tuesday, December 14, 2010
2010 = 2 + 0 +1 +0 = 3
హలో ..బాగున్నారా.? బాగలేకపోయిన నేను చేసేది ఏమి లేదు లేండి. బట్ (కాని) మీరు అందరు ( నాతో కలిపి) బాగుండాలి అని కోరుకుంటున్ననూలేండి.....
తర్వాత.. దేని తర్వాత అనా మీ ఉద్దేశ్యం? అదేనండి ఇందాక కుశల ప్రశ్నల తర్వాత అసలు పాయింటు కొద్దము పాయింటు కొద్దాము. . 2010 = 2 + 0 +1 + 0 = 3. అవును మూడు, త్రీ, తీన్ , మూరు, బాష ఏదైన "మూడు" నా లక్కి నంబర్. కాబట్టి మీకు ముచ్చటగ ఈ సంవత్సరం నా అనుభవాలలో మూడు మీతో పంచుకుందాము అనుకుంటున్నాను.
1. క్రొత్త బంగారు లోకం
సంవత్సరం మొదటి రోజు ఎలా జరిగితే సంవత్సరం అంత అలా జరుగుతుంది అని నమ్మే వాళ్ళ లో నేను ఒకడిని. 2010 జనవరి 1న మా అన్న ని చూద్దాము అని ఎందుకు "పూణే" వచ్చానో తెలియదు కాని అనుకోకుండా, అస్సలు ఊహించని విదముగా నేను ఇక్కడే జాబ్ జాయిన్ అయ్యా. ఆ దేవుడి దయ వల్ల "క్రొత్త బంగారు లోకం" లోకి అడుగుపెట్టా!. మంచి కంపెని ..మంచి మనుషులు .. మంచి విలువ గల క్లైంటు.. అంతా ఆల్ హ్యపీస్ ......
3. పెళ్ళి ... పెళ్ళి ... పెళ్ళి ...
తర్వాత.. దేని తర్వాత అనా మీ ఉద్దేశ్యం? అదేనండి ఇందాక కుశల ప్రశ్నల తర్వాత అసలు పాయింటు కొద్దము పాయింటు కొద్దాము. . 2010 = 2 + 0 +1 + 0 = 3. అవును మూడు, త్రీ, తీన్ , మూరు, బాష ఏదైన "మూడు" నా లక్కి నంబర్. కాబట్టి మీకు ముచ్చటగ ఈ సంవత్సరం నా అనుభవాలలో మూడు మీతో పంచుకుందాము అనుకుంటున్నాను.
1. క్రొత్త బంగారు లోకం
![]() |
Zensar Technologies Pune. |
2. జీవితమే ఒక రైలు ప్రయాణం
"జీవితమే ఒక రైలు ప్రయాణం" అని ఆ కవి ఏ టైం లో .. ఎవరిని ఉద్దేస్యించి చెప్పారో కాని .. నా ఈ సంవత్సరం .. సగం రైలు లోనే గడిచింది...మళ్ళి మొదటికి వస్తే .. జనవరి 1 న ఏమని ముంబయి (వేగముగ) వెళ్ళు రైలు ఎక్కానో ..ఈ సంవత్సరం అంత ఆ రైలు ఎక్కుతు ..దిగుతు ..అదే పని ప్రతి వారాంతం.. ఈ సంవత్సరం నేను చేసిన ప్రయాణం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు.
3. పెళ్ళి ... పెళ్ళి ... పెళ్ళి ...
ఏమిటి .. పెళ్ళి .. పెళ్ళి .. పెళ్ళి అని మూడు సార్లు రాశాను అనా ? చెప్పాకదా నా లక్కి నంబర్ 3 అని. ఇంతకి ఈ సంవత్సరానికి .. ఈ 3 పెళ్ళిళ్ళ లకి బంధం ఏమిటా అనా? .. ఈ సంవత్స్రం ముచ్చటగ మా మూడో ( 3 ) అన్న పెళ్ళి .. తర్వతా మా స్నేహితుడి పెళ్ళి .. తర్వాత మా కజిన్ పెళ్ళి ..ఇలా ఇప్పటికి మూడింటికి హాజర్ అయ్యా. ఇది ఈ సంవత్సరం పెళ్ళి గోల ...
హమ్మయ్య ఇది అండి ఈ ఏటీ మేటి అనుభావాలు .. మీరు కూడ ..ఈ ఏటి మేటి అనుభవాలు పంచుకుంటారు కదూ..

Subscribe to:
Posts (Atom)