మన తెలుగు సామెత "రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా ?" అని. దానిని ఇప్పటి ట్రెండ్ ప్రకారం "రంకు నేర్చినమ్మ హత్య నేర్వదా ?" అని మార్చాలి అనుకుంటాము ..
కానీ నా ఉద్దేశ్యం ...
స్వాతి, జ్యోతి,పార్వతి .. శిరీషా .. పేరు ఏదైనా చేసిన నేరం ఒకటే , మల్టిపుల్ ఆన్సర్ లో తప్పు జవాబు ని ఎంపిక చేసుకోవటం.
దాని కన్నా ముందు వాళ్ళ తల్లి తండ్రులు ఎంపిక చేసిన తప్పు జవాబు.
ఇప్పుడు వీరు చేసిన తప్పు , అంతకు ముందు వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పు , వాళ్ళ భర్తలు చేసిన తప్పు .. వీటికి పర్యవసానం ఏమిటి అంటే ... "చనిపోయిన తండ్రి, జైలు పాలు ఆయన అమ్మ " , ఏమి తెలియక అనాథ లు అయినా పిల్లలు అసలు అత్యంత కఠినమైన జీవిత కాల శిక్ష అనుభవించ పోతున్నారు.
ఈ పిల్లలు అనుభవించ పోతున్న , లేక అనుభవిస్తున్న ఈ జీవిత కాలపు కఠిన శిక్ష కి అస్సలు దోషులు పాపం ఈ పిల్లలు కాదె ...
ఈ వార్తలు చూసిన తర్వాతా మన తరం వారు తెలుసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి.
1 ) . సమాజం .. ( పరువు , కులం ) ఇవే పేర్లు చెప్పి తల్లితండ్రులు , వాళ్ళ పిల్లల కు ఇష్టం లేని , వాళ్ళ అభిరుచి కి తగిన భాగస్వామి ని ఇవ్వలేక పోవటం. పోనీ పిల్లలకు ఇష్టమైన వారు ఉన్నా , ఈ సమాజం పేరు తో ..విడదీసి , వారికి ఏది తోస్తే అది చేస్తున్నారు.
కానీ వారు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే , ఇది 1955 సావిత్రి దేవదాసు కాలం కాదు..... అందరి జీవితం ఇష్టం లేని పెళ్లి తర్వాతా "నిన్ను కోరి" లోని నివేద థామస్ లాగ ఆనందం గ ఉండదు. ఇప్పుడు అంతా ఈ .వి.వి గారి ఆరుగురు పతివ్రతల కాలం.. అర్జున్ రెడ్డి షాలిని పాండే కాలం.
తర్వాత , మన జ్యోతి , శిరీషా ,స్వాతి, ..పార్వతి ..
2). పెళ్లి చేసుకున్టీరి పో .. 5,6 సంవత్సరాలు కాపురం ఎలా చేస్తిరి.... చేస్తిరి పో .. 1 , 2 పిల్ల ల కి ఎలా ప్రాణం పోస్తిరి .... ప్రాణం పోస్తిరి పో .... పిల్లలు ..భర్త , తల్లి , తండ్రి , సమాజం .. లను మించి , కాదు వారిని ముంచి వేరే ఇంకొకరితో ప్రేమ ఎలా పంచుకుంటింటిరి .
వేరే ఒకరి తో ప్రేమ పంచుకుంటిరి కదా ? కానీ ఈ ప్రేమ ని సాధించడం కోసం తప్పులు ఎందుకు చేయవలె ?
తప్పు ఇక్కడ ప్రేమ ది కాదు ... మనం అంతకు ముందు చెప్పినట్టు తప్పు ఎంచుకున్న జవాబుది .
వీరి ప్రేమని కేవలం శారీరక మైన ఆకర్షణ మాత్రమే చూడాల్సింది కాదు.
ఈ సృష్టి లో జననం , మరణం , ప్రేమ ఎప్పుడు జరుగుతాయో ఎవరు చెప్పలేరు , అవి జరిగిపోతాయి అంతే..
మనం మన జీవిత భాగస్వామి ఉన్నా ..వేరో ఒకరితో .. జీవితం పంచుకోవాలి అనుకున్నపుడు ఉత్తమమైన పరిష్కారం విడాకులు..
కలిసి ఉండటం సాధ్యం కాదు అన్నప్పుడు , విడాకులు తీసుకోవడం . తర్వాత నచ్చిన వారితో జీవించడం. .
అప్పుడు హత్యలు చేయాల్సిన అవసరం లేదు ,
పిల్లలకి ఇంత పెద్ద శిక్ష కూడా తప్పుతుంది.
వీళ్ళు తెలుసు కోవాల్సిన నిజం ఏమిటి అంటే , ఒక స్త్రీ , ఇలాంటి విషయాల లో పట్టుబడి భర్త కోర్ట్ ని ఆశ్రయించినా , ఆడ వారికీ .. ఇండియా న్యాయశాస్త్ర ప్రకారం శిక్ష లేదు , వారు కేవలం బాధితుల గానే పరిగణిస్తారు. . కానీ భర్త . ఇలాంటి పనులు చేస్తే వారికి జైలు , మరియు , భార్యకు చెల్లింపులు చెయ్యాలి.
కాబట్టి , వీరి ప్రేమ తప్పు కాదు, ఆ ప్రశ్నకి , భర్త ని చంపడం అనేది తప్పు జవాబు ..
పిల్లల కి పెళ్లి చేయాలి అనుకోవడం తప్పు కాదు మన పిల్లల అభిరుచి తెలియకుండా , ఇష్టం లేకుండా.. పొంతన లేని వ్యక్తి తో గుడ్డి గ పిల్లల పెళ్లి చేయడం తప్పు జవాబు .
1 comment:
Too funny.
Except 1 or 2 cases, No one has forced these ladies to marry those men's. Before writing some thing, first do the proper research and write comments.
Post a Comment