Thursday, October 1, 2009

ఆయన పోయారు , మరి మనం ?




 రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తరువాత మన రాష్ట్రం లో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. అధికార పార్టి ని, ప్రభుత్వాన్ని సమర్ధం గా నడిపే వాడే లేక గందర గోళం గా మారింది. ఉన్న వాళ్ళు , వాళ్ళకు వాళ్ళు తన్నుకోవడమే తప్ప వేరే ఏ పని చేయడంలేదు. ప్రజా ప్రయోజనాలని గంగ లో కలిపి  "జగన్" కోసం కొంత మంది "సోనియా బజన" కోసం కొంత మంది విడి పోయి మరి తిట్టుకుంటున్నారు.

ఫించను దారులు కు జీతాలు ఇవ్వడానికి ఖజాన సరిపొదు అనే చెప్పే మన "పిట్ట కథల" ముఖ్యమంత్రి గారు ... పావురాల గుట్ట కి  కాలి బాట కోసం, అక్కడ ఒక స్మారక స్థూపం కోసం డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారో వారికే తెలియదు. మన పరిస్థితి ఎంత దయనీయం గా తయారు అయిందంటే "బస్సు లు తగలపెట్టి   ప్రబుత్వాని కి 26 లక్షల నష్టం తెచ్చిన వారిని సిగ్గు లేకండ వదిలేసి " కేవలం  పార్టి ఆఫీస్ లో 2000 (ఇది ప్రజా ధనం కాదు ) కూడ విలువ చేయని ఫ్లెక్సి ని చింపారు అని రాద్దాంతం  చేసి వాళ్ళ మీద కేసు పెట్టి దాని గురించి గంటల కొద్ది సోది మళ్ళి

ఇంకా మన  "సారి"  వి హెచ్ అయితే  ఎవరు అయిన ఎమైన అనుకంటారు అని కూడా లేకండా సోనియా కోసం ఎకం గా " ఒక సహస్రా నామర్చన " చేసేసాడు. ఆమె లేక పోతే పార్టి నే లేదు. "కాంగ్రేస్ అంటె సోనియా  ..  సోనియ అంటే కాంగ్రేస్ " అని నిర్వచనం చెప్పాడు
         ఏది ఏమైన .. రాజు పోయాడు అని ప్రజలు కూడ పోరు కదా .. వీళ్ళు ఇంతే  "పిల్లులు" లాగా కొట్టుకుంటు ఉంటే చిన్నప్పుడు చదివిన 2 పిల్లులు 1 కోతి కధలో లాగా ప్రాంతియ పార్టి లు అధికారం అనే రొట్టెని తన్నుకు పోతాయి . మళ్ళి ఈ  మొహాలకి డిపాజిట్లు కూడ దక్కవు .

   జనాన్ని బాధపెడితే సోనియా నే కాదు అమె అత్తగారు , తాత గారు అయిన ఓడిపోవల్సిందే.  నాయకులు ప్రజల కోసం అని చెప్పి ప్రజల మీద బతుకున్నారు అంతే గాని ప్రజలు వాళ్ళ మీద ఆదర పడలేదు 

5 comments:

Chandamama said...

బాగా చెప్పారు! అయితే ఒక్క విషయం- వైయస్సార్ బ్రతికున్నా మన ఖజానా పరిస్థితి ఇలానే వుండేది! మన ఆర్ధిక పరిస్థితి మేడిపండు చందం! ఓట్ల కోసం పధకాలు ప్రవేశపెట్టగానే సరిపోదు- దీర్ఘకాలంలో ఎదుర్కోబోయే ఆర్ధిక సవాళ్ళను ముందుగానే ఊహించగలగాలి! అది రాజశేఖరుడు చెయ్యలేదు! కాదంటారా?

నలుగురి లో నాలుగోవాడు said...

నిజం చెప్పారు. ఇంక మన రాష్ట్ర ఖజాన కి "In front crocodile festival"

తాడేపల్లి said...

వాస్తవానికి - రాజశేఖరరెడ్డి హయాములోనే, అతను బతికుండగానే అతని పాలసీల వల్ల ఆంధ్రా ఖజానా దివాలా తీసింది. "వెళ్ళినచోటల్లా వాగ్దానాలు చెయ్యొ"ద్దని అనుభవజ్ఞుడైన రోశయ్యగారు ఎంత మొత్తుకున్నా రెడ్డి వినలేదు. ఫలితంగా గత సంవత్సరం లక్షకోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తే అఖరికి డబ్బుల్లేక దాన్ని ఎనభై అయిదు కోట్లకి కుదించాల్సి వచ్చింది. ఇప్పుడు పదహాఱువేల కోట్లు ప్రజల దగ్గఱే అప్పు తీసుకుందామని ఆలోచిస్తున్నారు.

తాడేపల్లి said...

క్షమించాలి. పై వ్యాఖ్యలోని సంఖ్యని "ఎనభై అయిదువేల కోట్లకి కుదించాల్సి వచ్చింది" అని సవరించుకొని చదవగలరని ప్రార్థన.

Roses said...

ఖజానా ఖాళి ఆయినా మన కాంగ్రెస్స్ వాళ్ళకి బుధి రాలేనట్టు వుంది.
వైయసర్ కి స్మారకాలు కదతరంతా, ఎక్కడ నుంచి తెస్తరంతా డబ్బులు.
గ్రామాలకు రోడ్లు లేవు పావురాల గుట్టకి రోడ్డు వేస్తరనట.

వీటి మీద కూడ ఓ కన్ను వేయండి