Sunday, April 17, 2022

చట్టం , ధర్మం, న్యాయం ..అంతా మాయ...

చట్టం, ధర్మం, న్యాయం, అన్నీ మాయ ,అంత మిధ్య,  ఒక Mirage. 

ఉంటుంది, ఉంది అని ఒక బ్రమ, బ్రాంతి.అంతే. if at all ఉంది అన్న, ఉంటుంది అన్న అది కేవలం సామన్యుల కోసం, సామాన్యుల మీద ప్రయోగం. సామాన్యుడు అంటే అది రిలటేవ్ .. వార్ద్ మెంబెర్ కి వోటర్ సామాన్యుడు .. మండల స్థాయి లిడర్ కి గ్రామ స్థాయి లీడర్ ఒక సామాన్యుడు .. జిల్లా లెవెల్ లో ..మండలం వాళ్ళు ...ఇలా అన్నమాట .. అందులోను..ఎంత పెద్ద లీడర్ ని మనం మేనేజ్ చెస్తే అంత స్థాయి మనది అవుతుంది ...

వైజాగ్ లో డాక్టర్ అయిన ... కరీం నగర్ లాయర్ దంపతులు అయిన ఎదురు మాట్లాడితే ..అంతే .. నడిరోడ్ మీద .. పట్టపగలు .. 3 నిమిషాల బ్రేకింగ్ న్యూస్ అవ్వాల్సిందే ...

బెదిరించిన ..బయపెట్టిన కూడ ధైర్యం చేసి కేసు పెట్టి ..రక్షించమంటే .. పెట్రోల్ డబ్బ, పురుగు మందుల డబ్బ, లేద ఒక అగ్గిపెట్టె, ఒక సెల్ఫి వీడియో . 30 సెకండ్స్ న్యూస్ .. thats all.       

నీ స్థాయి ని బట్టి .. కానిస్టేబుల్ , యస్.ఐ స్థాయి వ్యక్తులు ..నిన్ను వేదించవచ్చు .. అవతలి వ్యక్తి నెక్స్ట్ లెవెల్ అయితే ..వాళ్ళే వేదింపబడనూ వచ్చు. 

పోలీస్,కోర్ట్,సి.బి.ఐ, సి.ఐ.డి. ఈ.డి. అంత ..అన్ని మాయ ..అంతా మాయ. అధికారాం వున్న వాళ్ళా దయ ..దాక్షిణ్యం; 

ఎంతలా అంటే .. ఎలెక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి ముఖ్యమైన దస్ట్రాలు కాలి పొవచ్చు, యఫ్.ఐ.అర్ లు తగలపడి పోవచ్చు, వారికి ఎటువంటి వ్రిటెన్ కంప్లైంట్ లేకపోవచ్చు..ఒక వేళ ఉన్నా పక్కింట్లొ ఉన్న  నిందితుడు.. ఆచుకి దొరక్కపొవచ్చు..ఫర్ అ చేంజ్ కోర్ట్ లో, పోలిస్ స్టేషన్ లో, దొంగతనమూ జరగవచ్చు...ఇది 2022, ఇక్కడ అన్ని..అంతా మామూలే.                                  

ఇక్కడ  మనం అంటే సామన్యులం తెలుసుకోవల్సిన నీతి..  ఒకటే ఒక రూల్.  "రూల్ ఈస్ రూల్" .. "రూల్ ఫర్ ఆల్".. బలం ఉన్నోడిదే ఇష్టా రాజ్యం.    

Monday, April 11, 2022

కాబినేట్ ఎందుకు ఎలా? ... మరి అంతేనా ..?

మన యువజన, కార్మిక, పర్యటక , క్రీడ శాఖమంత్రి శ్రీమతీ ఆర్.కె. రోజ గారు ఒక టీ.వీ చానెల్ తో మాట్లాడుతు ...కాబినేట్ అంటెనే కుల సమీకరణాలు , బలం ఉన్న నాయకులకు పదవులు అని తెల్చేసారు .  

పదవి కి కులమే ప్రామాణికమా ? ..పదవులు 11 బి.సి లు , 6 యస్.సి లు .. 4 రెడ్లు .. అంతేనా?

వైద్య శాఖ .. డాక్టర్ కి .. క్రీడా శాఖ .. క్రీడాకరుడికి .. న్యాయ శాఖ .. లాయర్ కి ఇచరు అని చెప్పుకొలేమా ..? ఒక వేళ డాక్టర్ కి ఇచిన కూడ, ఆయన ఉన్నత చదువు , అర్హత .. పి.హెచ్.డి .పట్టాలు కూడ .. కులం తర్వాతేనా ? ..స్టేట్ రాంకర్ కి కూడ పదవి కులం వల్ల నేనా ....?

ఒక రాష్ట్రనికి హోం మినిష్టర్ .. కేవలం దలిత కోట లో మిగిలి పోవడమేన ..?  వారి ప్రతిభ కన్న .. కులం గొప్పదా..?  

ఎటు పొతున్నాం .. 11 బి.సి లకు, 6 యస్.సి. ల కు పదవలు ఇస్తే ..సాధికరత వస్తుందా ..?    

రాష్ట్రపతి నుంది  .. శిశు సంక్షేమ శాఖ దాక .. కులం కార్డే గీటురాయ ..?  .. 

కేవలం వాళ్ళ ఓట్ల  కోసం .. ఈ పదవులు బిస్కెట్లేనా  ...?  ఒక పి.హెచ్.డి చదివిన స్కాలర్ కేవలం దళిత మంత్రి గ మిగిలి పొవాల్సిందేన ..?  దళితులు .. బి.సి లు .. కేవలం వోట్ బాంక్ లేన 
..?

వాల్ల పదవులు కాపాడుకోవాడానికి వేసే ఈ తాయలాలకు  మోసపొతే మనం ఎప్పుడు ముందుకు వెళతాం ..? వారు పోతే వరు భార్య ..కొడుకు ..వాళ్ళే .. పాలకులా ..? మనం జెండాలు మోసి .. దళిత బంధు, వ్రుద్దాప్య ఫించన్ ..అమ్మ ఒడి   లాంటి వాటికి క్లీన్ బౌల్డ్ అవ్వల్శిందేన ..?       


#RKRoja , #పదవి , #APCabinet, #APnewministers

Monday, January 8, 2018

రంకు నేర్చినమ్మ హత్యలు కూడా నేర్చింది...... కారణం తప్పు జవాబు ఎంచుకోవటం..




మన తెలుగు సామెత  "రంకు  నేర్చినమ్మ బొంకు నేర్వదా ?" అని.  దానిని ఇప్పటి ట్రెండ్ ప్రకారం "రంకు నేర్చినమ్మ హత్య నేర్వదా ?" అని మార్చాలి  అనుకుంటాము  ..

కానీ నా ఉద్దేశ్యం ...

స్వాతి, జ్యోతి,పార్వతి  .. శిరీషా  .. పేరు ఏదైనా చేసిన నేరం ఒకటే ,  మల్టిపుల్ ఆన్సర్ లో తప్పు జవాబు ని ఎంపిక చేసుకోవటం.

దాని కన్నా ముందు వాళ్ళ తల్లి తండ్రులు ఎంపిక చేసిన తప్పు జవాబు.

ఇప్పుడు వీరు చేసిన తప్పు , అంతకు ముందు వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పు , వాళ్ళ భర్తలు చేసిన తప్పు ..  వీటికి పర్యవసానం  ఏమిటి  అంటే ...    "చనిపోయిన తండ్రి, జైలు పాలు ఆయన అమ్మ " , ఏమి తెలియక అనాథ లు అయినా పిల్లలు అసలు అత్యంత కఠినమైన జీవిత కాల శిక్ష అనుభవించ పోతున్నారు.

ఈ పిల్లలు అనుభవించ పోతున్న , లేక అనుభవిస్తున్న ఈ జీవిత కాలపు కఠిన శిక్ష కి అస్సలు దోషులు  పాపం ఈ పిల్లలు కాదె ...

ఈ వార్తలు చూసిన తర్వాతా మన తరం వారు తెలుసుకోవాల్సిన సంగతులు చాలానే ఉన్నాయి.

1 ) . సమాజం  ..  (  పరువు , కులం ) ఇవే పేర్లు చెప్పి తల్లితండ్రులు , వాళ్ళ పిల్లల కు ఇష్టం లేని , వాళ్ళ అభిరుచి కి తగిన భాగస్వామి ని ఇవ్వలేక పోవటం.  పోనీ పిల్లలకు ఇష్టమైన వారు ఉన్నా , ఈ సమాజం పేరు తో ..విడదీసి , వారికి ఏది తోస్తే అది చేస్తున్నారు.

కానీ వారు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే , ఇది 1955 సావిత్రి  దేవదాసు కాలం కాదు..... అందరి జీవితం ఇష్టం లేని  పెళ్లి  తర్వాతా  "నిన్ను కోరి"  లోని నివేద థామస్ లాగ  ఆనందం గ ఉండదు.   ఇప్పుడు అంతా  ఈ .వి.వి  గారి  ఆరుగురు పతివ్రతల కాలం.. అర్జున్ రెడ్డి షాలిని పాండే కాలం.

తర్వాత , మన జ్యోతి , శిరీషా ,స్వాతి, ..పార్వతి  ..

2). పెళ్లి చేసుకున్టీరి   పో .. 5,6 సంవత్సరాలు కాపురం ఎలా చేస్తిరి....  చేస్తిరి పో .. 1 , 2 పిల్ల ల కి ఎలా ప్రాణం పోస్తిరి  ....  ప్రాణం పోస్తిరి  పో .... పిల్లలు ..భర్త , తల్లి , తండ్రి , సమాజం  .. లను మించి , కాదు వారిని ముంచి వేరే ఇంకొకరితో ప్రేమ ఎలా పంచుకుంటింటిరి .

వేరే ఒకరి తో  ప్రేమ పంచుకుంటిరి  కదా ? కానీ  ఈ ప్రేమ ని సాధించడం కోసం తప్పులు ఎందుకు చేయవలె ?

తప్పు ఇక్కడ  ప్రేమ ది   కాదు ... మనం అంతకు ముందు  చెప్పినట్టు తప్పు ఎంచుకున్న  జవాబుది .

వీరి ప్రేమని కేవలం శారీరక మైన ఆకర్షణ మాత్రమే చూడాల్సింది కాదు.

ఈ సృష్టి లో జననం , మరణం , ప్రేమ ఎప్పుడు జరుగుతాయో ఎవరు చెప్పలేరు , అవి జరిగిపోతాయి అంతే..

మనం మన జీవిత భాగస్వామి  ఉన్నా ..వేరో ఒకరితో .. జీవితం పంచుకోవాలి అనుకున్నపుడు  ఉత్తమమైన పరిష్కారం  విడాకులు..

కలిసి ఉండటం సాధ్యం కాదు అన్నప్పుడు , విడాకులు తీసుకోవడం . తర్వాత నచ్చిన వారితో జీవించడం. .

అప్పుడు హత్యలు చేయాల్సిన అవసరం లేదు ,

పిల్లలకి  ఇంత పెద్ద శిక్ష కూడా తప్పుతుంది.

వీళ్ళు  తెలుసు కోవాల్సిన నిజం ఏమిటి అంటే ,  ఒక స్త్రీ , ఇలాంటి విషయాల లో పట్టుబడి  భర్త   కోర్ట్  ని ఆశ్రయించినా ,  ఆడ వారికీ  ..  ఇండియా న్యాయశాస్త్ర ప్రకారం శిక్ష లేదు , వారు కేవలం బాధితుల గానే పరిగణిస్తారు. .  కానీ భర్త . ఇలాంటి పనులు చేస్తే వారికి జైలు , మరియు , భార్యకు చెల్లింపులు చెయ్యాలి.

కాబట్టి , వీరి ప్రేమ తప్పు కాదు, ఆ ప్రశ్నకి , భర్త ని చంపడం అనేది తప్పు జవాబు ..

పిల్లల  కి పెళ్లి చేయాలి అనుకోవడం తప్పు కాదు  మన పిల్లల అభిరుచి తెలియకుండా , ఇష్టం లేకుండా..  పొంతన లేని వ్యక్తి తో గుడ్డి గ పిల్లల పెళ్లి చేయడం తప్పు జవాబు .  

Friday, December 2, 2016

మనము ..మన మంచి బంగారం .మరి ఎందుకు భయం ..



చిన్నప్పుడు అందరు ఆడిన ఆట... ఒకటి .. ఇలా .. 

మొదటి వారు ..పక్కవారి చెవులో ఒకటి చెబుతారు ... అది వాళ్ళ పక్క వాళ్ళ కి చెవిలో చెప్పాలి ...అలా ..చివరకి ... చివరి వారి దగ్గరికి వచ్చేసరికి .. అస్సలు మొదటి వారు చెప్పిన దానికి ..చివరి వారు విన్నదానికి ..అర్ధమే మారిపోతుంది .... 

అది ఆట. 

ఇప్పుడు మన దగ్గర కూడా అలా నే జరుగుతుంది .... 

ప్రభుత్వం బంగారం మీద తీసుకున్న నిర్ణయం ఏమిటి ... ఎలా .. అని ఎవ్వరికి అక్కర్లేదు ... 

ఒకటే చర్చ ... చదువుకున్న వారు ... చదువు రాని వారు ... బాధ్యత ఉన్న ప్రతిపక్షం .... మా బాధ్యత లేదు అనుకునే మీడియా పక్షం ... 

 ప్రభుత్వం మన బంగారం లాగేసుకుంటుంది ....  500 గ్రాము ల కన్నా ఎక్కువ ఉండకూడదా? అని 


అస్సలు విషయానికి వస్తే ...




There is no limit on holding of gold jewellery/ornaments by anybody if it is acquired from explained sources of income including inheritance

మీరు వివరించ గలిగితే మీ దగ్గర ఉన్న ఎంత బంగారము అయినా మీకు ఏమి భయం లేదు ...అది 1 కేజీ  లేదా 10 కేజి లు అయినా ... 

Search & seizure of gold jewellery is governed by CBDT Circular dated 11.05.1994.

మీ దగ్గర ఉన్న బంగారం పైన సోదాలు .. 1994 మే 11 జారీ చేసిన జాబు కి లోబడి ఉంటుంది ...

అస్సలు అందులో ఏముంది అంటే ...

(i) In the case of a wealth-tax assessee, gold jewellery and ornaments found in excess of the gross weight declared in the wealth-tax return only need to be seized.

మీరు లెక్కకి చెప్పలేని .. మీ ఆదాయం న కి మించి ఉన్న బంగారం ... మాత్రమే జప్తు చేయబడుతుంది.

(ii) In the case of a person not assessed to wealth-tax gold jewellery and ornaments to the extent of 500 gms. per married lady 250 gms per unmarried lady and 100 gms. per male member of the family, need not be seized.

వివాహిత దగ్గర 500 గ్రా .. అవివాహిత దగ్గర 250 గ్రా ... మగవారి దగ్గర 100 గ్రా .. బంగారం కలిగి ఉండవచ్చు .... అంత వరకు లెక్క చెప్పవలసిన అవసరం లేదు ...
(iii) The authorized officer may having regard to the status of the family and the customs and practices of the community to which the family belongs and other circumstances of the case, decide to exclude a larger quantity of jewellery and ornaments from seizure. This should be reported to the Director of Income-tax/Commissioner authorising the search all the time of furnishing the search report.

మీ కుటుంబ నేపధ్యం .. సామర్ధ్యం .. లోకి తీసుకొని .. ఇతర ..పారిస్తుతుల అనుసరించి ..ఇంకా ఎక్కువ బంగారం వుంచుకోవచ్చు ....

(iv) In all cases, a detailed inventory of the jewellery and ornaments found must be prepared to be used for assessment purposes.

అన్ని సమయాల లోను ... మీ దగ్గర ఉన్న బంగారం .. దానికి ఉన్న విలువ ..మీ ఆస్తి గానే పరిగణిస్తారు ... 

ఆశర్యం ఏమిటి అంటే .. ఈ రూల్స్ 1994 నుండి ఉన్నాయి ...  ఇప్పటి నుండి ఖచ్చితం గ అమలు చేస్తాం అని మాత్రమే ఈ ప్రభుత్వం చెపుతుంది .. ఇది ఇప్పటి కొత్త గ వచ్చినడి కాదు ...దానిలో ఎటువంటి కొత్త నిబంధనలు ఏమి తేలేదు ... 


Income Tax వారు .. 125 కోట్ల ఇళ్ల కి వచ్చి ఏమి సోదా లు చెయ్యరు .... అలా చెయ్యటానికి వారి దగ్గర సమయం ... అవకాశం  లేదు ...  

మన భారత దేశం లో .. రైతుల ఇంటి లో, . I. T. సోదా జరగదు ..జరగబోదు ... 
నిజాయితీ గ పని చేసుకునే వారి ఇంట్లో ఎక్కడ IT సోదా జరిగినట్టు నాకు తెలియదు ... 

కేవలం సోదా లు జరిగినప్పుడు ..మీ లెక్కల తో తయారీగా ఉండండి ... 


కేవలం .. ప్రభుత్వ ఉద్యోగం అడ్డుగా పెట్టుకొని ..లంచాలు ... తీసుకొనే వారు ..
 నల్లధనము ..బంగారం రూపం లో పెట్టుకునే వారికీ  కష్టం  ... మనకి ఏమి భయమూ లేదు ... 


కానీ ..మీడియా .. కేవలం వారి .. T.R.P రేటింగ్స్ కోసం .. మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు ... 
లేని పోనీ భయాందోళనలు కలిగిస్తున్నారు ... 

మేలుకో భారతీయుడా  ..మేలుకో .. నీకు ..నీ దేశానికీ ఏది ఉపయోగమో అది చెయ్యి ... చేసే వారికీ చేయూత  నియ్యి ... 


మీ 
నలుగురిలో నాలుగోవాడు ... 

Sunday, July 31, 2016

అమేరికా లో నాకు బాగ నచ్చినది ..........


అందరికి అమెరికా ఒక కలల దేశం, ముఖ్యంగ మన తెలుగు రాష్ట్రాలలో అది ఇంకా చెప్పాల్సిన పని లేదు ... అందుకు నేను మినహాయింపు కాదు ...

నేను అమెరికా లో ఉండబట్టి 1 సంవత్సరం అయ్యింది ... 30 సంవత్సరాలు మన దేశం లోనే  ఉన్నాను ...

అక్కడ ఉంది, మన దగ్గర లేనిది కేవలం డబ్బు ఒక్కటే కాదు ... ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ...

వివిధ శతకాలలో  ఇంకా , మన పెద్దవాళ్ళు చెప్పినట్లు మంచి ఎక్కడ ఉన్న దానిని గ్రహించి ఆచరించడం లో తప్పు లేదు.....  అందుకోసం నాకు అనిపించిన కొన్ని మంచి విషయాలు మీ కోసం ...

1+ ) సాటి మనిషిని గౌరవించడం ...అది చెత్త డబ్బాలు తీసుకు వెళ్లే garbage collctors అయినా .. స్టోర్స్ లో పని చేసేవారు అయినా . పెద్ద బిజినెస్ లు చేసేవారు అయినా ... .అందరం సమానమే అన్న విషయం ...

1 )  ఎమర్జెన్సీ ... 911, ఈ నెంబర్ ..అమెరికా ప్రజలకు ఆక్సీజన్ ... ఎక్కడ ..ఎప్పుడు..  ఏ ఆపద,కష్టం వచ్చిన ఆదుకునే నెంబర్ .... ఇది ఎలాంటి సందర్భాలలో ..ఎలా ఉపయోగించాలో .. 3 సంవత్సరాల పిల్లలు నుంచి అందరికి తెలియ చెపుతారు ... ఈ నెంబర్ డయల్ చేయడానికి.. బాలన్స్,సిగ్నల్స్ ..ఫోన్ లాక్ ..ఏది అక్కర్లేదు... మన దేశం లో 100,101,108 మూడు నంబర్స్ ని కలిపి ఒక నంబర్ గ మార్చాల్సిన అవసరం చాలాఉంది .. ఇంకా అన్ని ఫోన్స్ ఆ నంబర్ ని ఎమర్జెన్సీ గ ఉంచాలి...

2) ట్రాఫిక్ రూల్స్ పాటించడం.... .. నేను 2,3 నగరాలు చూసాను ... ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలిస్ ఉండరు ..కానీ ఎవ్వరు వాటిని అధిగమించరు. .... కొన్ని కూడలిలో సిగ్నల్స్ కూడా ఉండవు .. ఎవరు ముందువస్తే వాళ్లు వెళ్ళాలి , అందరు తూ .చ.  తప్పకుండా పాటిస్తారు ..

3) మెడికల్ విధానం...  ఇది అన్నిటికన్నా నాకు నచ్చింది.... మెడికల్ షాపు (ఫార్మసీ) కి వెళ్లి  తెచ్చుకోగలిగిన మందులు .కొన్ని ఉన్నా .. ఇంకా చాలా వరకు .. డాక్టర్ నుంచి తీసుకున్న   ప్రిస్క్రిప్షన్ కి మాత్రమే ఇచ్చే మందులు... ఇవి డాక్టర్స్ .మనకి ఇష్టమైన .. మనం కోరుకున్న ఫార్మసీ కి ఇమెయిల్ చేస్తారు... మనం వెళ్లి మన పేరు, డీటెయిల్స్ ఇచ్చి తెచ్చుకోవాలి...  ఆ ప్రిస్క్రిప్షన్ లో నే మనం ఎన్ని సార్లు రీఫిల్స్..  అంటే ఎన్ని సార్లు కొనవచ్చు కూడ చెపుతారు .. అంటే మనం డాక్టర్స్ కి తెలియకుండా మనకి నచ్చినవి వేసుకోవడానికి ఉండవు ...  షాపు కి పోయి ఖాళీ బాటిల్స్ చూపించి తెచుకోవడాలు .. పోయిన సరి కొన్నవే కొనడం.. మనకి తెలియకుండా .. డోస్ లు వేసుకోవడాలు.. ఉండవు...

4) పిల్లల్ని స్వతంత్రం గ ఎదగనివ్వడం....ఇక్కడ 3 సంవత్సరాలు వస్తే .. తన పనులు తానే చేసుకునేలా నేర్పుతారు... 5 సంవత్సరాలు నిండేదాకా వారికీ ఏమి చదువులు వారిపై రుద్దారు .. వారు ఎలా మెలగాలి,ఎలా మాట్లాడాలి ..అండ్ ఇంకా మన పనులు ..బ్రష్, స్నానం చేయడం... డ్రెస్సింగ్ ...undressing .. టాయిలెట్ ఎథిక్స్ ..ఇవే ...

5) ఇంకా విద్యా విధానము , కుడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది .. కేజీ కేజీ ల పుస్తకాలు కాదు కావాల్సింది.. కుసిరింత ప్రాక్టికల్ ... అందుకే ..మన పిల్లలు కేవలం ఉద్యోగులుగా మిగిలిపోతున్నారు... ఆవిష్కరణ లో వెనక పడుతున్నారు...


ఇవి అండి నాకు ఇక్కడ నచ్చిన విషయాలు.....  కొన్ని విషయాల లో మన దేశం లో ఉన్న అన్ని సౌకర్యాలు ..పద్ధతులు.. ఇక్కడ లేవు అనుకోండి....
    



వీటి మీద కూడ ఓ కన్ను వేయండి